Seethe Ramudi Katnam Serial Today Episode ఉదయం అందరూ హాల్‌లో ఉంటే లలిత కాఫీ ఇస్తుంది. ఇంతలో రామ్, సీత ఇంటికి వస్తారు. మహాలక్ష్మీ, జనార్థన్‌లు వాళ్లని చూసి కోపంగా ఉంటారు. నైట్ అంతా ఎక్కడికి వెళ్లారు. చెప్పకుండా ఫోన్ తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లారని మహాలక్ష్మీ అడుగుతుంది. ఇక రామ్ ఆరు బయట సీత ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిందని బలే థ్రిల్లింగ్‌గా ఉందని రామ్ చెప్తాడు.
మహాలక్ష్మీ: ఛీ ఆరు బయట ఫస్ట్ నైట్ ఏంటి అసహ్యంగా. మేం ఇంట్లో ఏర్పాటు చేశాం కదా. నైట్ అంతా మీ కోసం మేం టెన్షన్ పడేలా చేశారు.
సీత: మేం చిన్న పిల్లలం కాదు కదా పైగా ఇది మా ఊరు.
జనార్థన్: నైట్ సుమతి అర్చనకు కాల్ చేసింది. వెళ్దామంటే మీరు లేరు.
సీత: అవునా అయ్యో నిజమా. సుమతి అత్తమ్మ చిన్నత్తకు కాల్ చేసిందా.
రామ్: అమ్మ వచ్చిందా మన ఇంట్లో ఉందా.
ప్రీతి: లేదు అన్నయ్య మళ్లీ అమ్మ ఫోన్ చేసి రాను అని చెప్పింది అంట.
సీత: అత్తమ్మ వస్తున్నట్లు ఫోన్ ఎప్పుడు వచ్చింది.
విద్యాదేవి: మీరు గదిలో ఉన్నప్పుడు.
సీత: అత్తమ్మ రానని చెప్పినట్లు ఫోన్ ఎప్పుడు వచ్చింది.
విద్యాదేవి: మీరు గదిలో లేనప్పుడు.
సీత: అరే భలే విచిత్రంగా ఉందే గదిలో ఉంటే వస్తున్నట్లు లేనప్పుడు రావడం లేదని ఫోన్ రావడం వింతగా ఉందే.
రామ్: అమ్మ ఇలా మనతో దోబూచులాడటం ఏం బాలేదు. వస్తా అని చెప్పి ఎందుకు రాలేదు.
ప్రీతి: నేను అదే ఫీలయ్యా అన్నయ్య కానీ నా పెళ్లికి అమ్మ వస్తుందని టీచర్ చెప్పారు. అత్తయ్య మామయ్య కూడా చెప్పారు.
మహాలక్ష్మీ: అంటే మీ అమ్మ ఎక్కడ ఉందో వీళ్లకి తెలుసన్నమాట.
లలిత: అవన్నీ మాకు తెలీదు కానీ రామ్ సీత కార్యం ఆగిపోవడం ఇష్టం లేక వదిన ఆగిపోయినట్లు ఉంది.
మహాలక్ష్మీ: ఇదంతా కాదు సుమతి ప్రీతి పెళ్లికి వచ్చి తీరాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది.
జనార్థన్: అదే మహా నేను అనుకుంటున్నా ఇలా అయినా సుమతి బయటకు వస్తుంది.
మహాలక్ష్మీ బయట ఉంటే సీత వచ్చి ఏంటి అత్త సాడ్‌గా ఉన్నారు. అనుకున్నది ఒకటి ఇక్కడ అయింది ఇంకొకటి అని ఒళ్లు కుతకుతా ఉడికిపోతుందా అని అడుగుతుంది. మా శోభనం జరగకూడదు అనుకున్నారు అది కూడా మీ వల్ల అవ్వలేదు. నిన్ను మీరు అర్చన అత్తయ్యతో ఫోన్‌లో మాట్లాడినంతా నేను విన్నాను అందుకే నా ప్లాన్ నేను చేసుకున్నా అని సీత అంటుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. ఇక మమల్ని మీ జేజమ్మ కూడా విడదీయలేదు అని చెప్తుంది. ఇక అందరూ ఇంటికి బయల్దేరుతారు. సుమతి రాకపోతే ప్రీతికి నేను వేరే సంబంధం చూడాల్సి వస్తుందని అంటుంది. ఇక ప్రీతి అమ్మ వస్తేనే పెళ్లి చేసుకుంటా అమ్మ రాకపోతే నేనే నా పెళ్లి ఆపుకుంటా అని ప్రీతి అంటుంది. అంత వరకు రాదు మీ అమ్మ వస్తుందని విద్యాదేవి చెప్తుంది.
ఇక ప్రీతి గదికి అర్చన వస్తే ప్రీతి గుడ్ న్యూస్ అని చెప్పి హేమంత్ నాకు బాగా నచ్చాడని చెప్తుంది. దాంతో అర్చన ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని నాకు డౌట్ ఉందని అంటుంది. మీ అమ్మ రాదు అని ప్రీతిని అర్చన డిసప్పాయింట్ చేస్తుంది. మీ అమ్మ చిన్నప్పుడే వెళ్లిపోయింది అంటే ఆమెకు కచ్చితంగా వేరే సెటప్ ఉండి ఉంటుందని అంటుంది. మీ అమ్మ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని లేదంటే వేరే వ్యక్తితో రిలేషన్‌ని ఉందేమో మళ్లీ పిల్లల్ని కని అక్కడే ఉండిపోయి ఉంటుందని నిన్ను రామ్‌ని పిల్లలు కాదని వదిలేసి ఉంటుందని మీ అమ్మ మంచిది కాదు అని అర్చన అంటే విద్యాదేవి అర్చనా అని అరిచి అర్చన చెంప పగలగొడుతుంది. ఇంకో సారి ప్రీతి తల్లిని ఏమైనా అంటే నాలుక కోసేస్తా అని అర్చనకు ఫుల్ క్లాస్ ఇస్తుంది. అందరిని పిలిచి నీ సంగతి చెప్తా అని అర్చన వెళ్తుంది.
అర్చన అందర్ని పిలిచి టీచర్ కొట్టిందని చెప్తుంది. సుమతి గారి గురించి అలా మాట్లాడటం వల్ల కొట్టానని మరోసారి ఇలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చానని అంటుంది. తను మిమల్ని అనలేదు కదా అంటే మీకు కోపం ఎందుకు అని అంటే దానికి ప్రీతి అమ్మ గురించి అర్చన పిన్ని అనరాని మాటలు అనిందని అంటుంది. సుమతి అత్తమ్మ గురించి మీకు బాగా తెలుసు కదా అని అలా ఎలా ఊరుకుంటారని సీత అంటుంది. ఇక రామ్, జనార్థన్ ఇద్దరూ సుమతి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని అంటారు. అలాంటి మాటలు అనే వాళ్లు పెళ్లికి రావొద్దని రామ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మా అన్నయ్యతో మహాసంగ్రామం.. మిత్రకు కరెంట్ షాక్ కొడుతుందా!