Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ మిత్ర ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. మనీషా వాళ్లు ఇంకా రాలేదు అని దేవయాని అంటుంది. దానికి మిత్ర వాళ్లు వెనక వస్తున్నారు అంటే వాళ్లు ఎప్పుడు ముందు రావాలి అని లక్ష్మీ సెటైర్ వేస్తుంది. ఇంతలో మనీషా, సరయు వస్తారు. మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి సరయు మిత్ర నాకు దక్కితే నీకు ఆస్తి అయినా కంపెనీ అయినా ఇచ్చేస్తా అని అంటుంది. లక్ష్మీ శవాన్ని చూడటం పక్కా అని సరయు అంటుంది. ఇంతలో లక్ష్మీ కుడి కన్ను అదురుతుంది.
లక్ష్మీ ఇక్కడికి వచ్చినా ఇంకా అపశకునాలు కనిపిస్తూనే ఉన్నాయని సెటైర్లు వేస్తుంది. ఎవరికీ ఏ కీడు జరగకూడదని లక్ష్మీ మొక్కుకుంటుంది. పంతులు ఫ్యామిలీతో మాట్లాడుతారు. అమ్మవారి కటాక్షం మీకు ఉంటుందని 12 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చారని అంటారు. దానికి జయదేవ్ నేను నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు తరతరాలుగా పూజలు చేస్తామని అంటాడు. గుడి ఫైల్స్ తెస్తే లెక్కలు చూస్తామని అంటారు. గుడి ధర్మ కర్త చూసుకుంటారని మనీషా అంటే ఆనవాయితీ అన్నారు కదా మామయ్య చూస్తే బెటర్ అని లక్ష్మీ అంటుంది. ఇంతలో మా అన్నయ్య సీరియల్ హీరో, హీరోయిన్ విలన్ వస్తారు. మా అన్నయ్య సీరియల్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ మహా సంగ్రామం జరుగుతుంది. మా అన్నయ్య సీరియల్ హీరోని జయదేవ్ తన ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. మామ అల్లుడి మధ్య సర్పంచ్ పోటీ ఉందని అందరికీ చెప్తారు.
జయదేవ్ ఫ్యామిలీ ముందే మామ అల్లుడి మాటల యుద్ధం మొదలవుతుంది. ఇంతలో శివ గుడి ధర్మ కర్త తన పెద్దనాన్నే అయినా లెక్కలు సరిగా ఉన్నాయో లేదో చూడండి అని జయదేక్‌కి చెప్తుంది. పిల్లలు ఆడుకుంటే ధర్మకర్త కొడుకు పిల్లలకు క్రాకర్స్ ఇచ్చి గుడి లెక్కల పేపర్లు కాలిపోవాలని ప్లాన్ చేస్తారు. జయదేవ్ వాళ్లు లెక్కలు చూసే టైంలో ఒకాయన వచ్చి మంటలు వచ్చాయని తగలబడిపోతుందని పిలుస్తాడు. అందరూ కంగారుగా అక్కడికి వెళ్తారు. లక్ష్మీ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటుంది. ఇంతలో ఫైల్స్ కూడా తగలబడిపోతాయి. ఎవరు క్రాకర్స్ ఇచ్చారని అడిగితే ఆ వ్యక్తిని చూపిస్తారు పిల్లలు. అందరూ ఆయన్ను ప్రశ్నిస్తారు. కావాలనే ఇలా చేసుంటారని శివ అంటుంది. ఫైల్స్‌కి ఏం కాలేదని లక్ష్మీ అందరికీ ట్విస్ట్ ఇస్తుంది. తాను ఫైల్స్ దాచి పెట్టానని చెప్తుంది.
మరోవైపు మనీషా లక్ష్మీ చావు కోసం ఎదురు చూస్తున్నానని అంటుంది. దానికి సరయు ఓ గదిలోకి తీసుకెళ్లి కరెంట్ షాక్ ఏర్పాటు చేసినట్లు చూపిస్తుంది. మరోవైపు దేవ తన తండ్రితో కలిసి గంగని చంపాలని ప్రయత్నిస్తాడు. పంతులు దీపపు కుందెలు తీసుకురమ్మని చెప్తారు. వాటికే కరెంట్ షాక్ పెట్టుంటారు. దేవయాని లక్ష్మీని వెళ్లమంటే వివేక్ ఆపి మనీషాని తీసుకురమ్మని చెప్తాడు. ఇంతలో మిత్ర వెళ్తానంటే మనీషా ఆపుతుంది. అయినా మిత్రనే వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి చేసిన పనికి కుమిలి కుమిలి ఏడ్చిన కుటుంబం.. హారతి, దీపక్‌లకు బాబు!