Trinayani Serial Today Episode త్రినేత్రి బామ్మ తన అల్లుడి వేషాలకు తిడతాడు. పక్కింటి కోళ్లను కొట్టేస్తున్నాడని వాతలు పెడతాడు. ఇక బామ్మ త్రినేత్రితో నిన్ను చూసుకోవడానికి రేపు పట్నం నుంచి పెళ్లి కొడుకు వస్తున్నాడని చెప్తుంది. ఈసారి సంబంధం ఖాయం అయ్యేలా ఉందని అంటుంది. మరోవైపు నయని హాల్‌లో కూర్చొని తెగ హడావుడిగా ఏవో పేపర్లు తిరగేస్తుంది. ఏం జరుగుతుందని అందరూ వచ్చి అడుగుతారు.
విక్రాంత్: బ్రో వదినకు కలలో కనిపించే అమ్మవారి వివరాలు సంపాదించాను.
నయని: ఈ విషయంలో విక్రాంత్ బాబు చాలా కష్టపడ్డారు నాకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు.
సుమన: ఎందుకు ఉండరు అభిమానంతో చాలా కోసుకునే వారు ఇంకా చెప్పాలి అంటే పిచ్చ ఫ్యాన్.
హాసిని: మీరు ఎవరు చెల్లి మాటలు నమ్మకపోయినా విక్రాంత్ నమ్మి సాక్ష్యాలు సంపాదించాడు.
నయని: నాకు కనిపించిన గుడి దేవీపురంలో ఉంది.
విశాల్: దేవీపురమా ఇది యాదృశ్చికమో విధిరాతో తెలీదు కానీ ఆ ఊరిలో ప్రాజెక్ట్ చేయాలని నిన్నే ఢీల్ జరిగింది.
విక్రాంత్: నిజంగా విచిత్రమే అయితే ఒక విషయం ఈ అమ్మవారి గుడి ఊరిలో లేదు ఊరి చివరిలో ఒక చిట్టి అడవిలో ఉంది.
సుమన: అంటే అక్కడికి మా నయని అక్క వెళ్తుందా వెళ్తే విష ప్రయోగం జరుగుతుందా.
పావనా: అంతా అయోమయంగా వింతగా ఉంది.
నయని: నేను అక్కడికి వెళ్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
హాసిని: రిస్క్ ఎందుకు చెల్లి ముందు విశాల్ వెళ్లని తర్వాత అక్కడ పరిస్థితి బట్టి నువ్వు వెళ్లొచ్చు.
సుమన: ముందు విశాల్ బావగారు వెళ్లి అక్కడ తన భార్యకి ప్రమాదం ఉందా లేదా తెలుసుకొని చెప్పడానికి ఆయన ఏమైనా స్వామీజా. లేకపోతే సైంటిస్ట్నా.
విక్రాంత్: వదినా వీళ్లకి మన ప్లాన్ అర్థం కాదు లెండీ. బ్రో వదిన ప్రాణాలు కాపాడటానికి మనం చిన్న చిన్న పరీక్షలు చేయలేమా. సో బ్రో అక్కడికి ప్రాజెక్ట్ పని మీద వెళ్తే మనకు కొంచెం తెలుస్తుంది.
విశాల్: రైట్ దేవీ పురం దగ్గరే కాబట్టి నేను వెళ్లి ఏమైనా అనుమానం వస్తే మీకు టచ్‌లోకి వస్తా. నేను చెప్పాకే నయని గానీ విక్రాంత్ గానీ మీరు ఎవరైనా అక్కడికి రావాలి.
ఉదయం త్రినేత్రిని బామ్మ పిలిచి నిన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి పట్నం నుంచి బయల్దేరాడట అని చెప్తుంది. దానికి వైకుంఠం చూడటమేనా చేసుకునేది ఉందా అని అడుగుతుంది. ఇక వైకుంఠం త్రినేత్రికి చీర ఇవ్వమని అంటుంది. ఈపెళ్లి ఫిక్స్ అవ్వకపోతే వైకుంఠానికి గుండు కట్టేస్తాను అని అంటుంది. ఇక అబ్బాయి గులాబి రంగు చీర కట్టుకొని వస్తున్నాడని ఫొటో అడగలేదని చెప్తుంది. నన్ను చేసుకోవడానికి వచ్చే వ్యక్తి మహారాజే అయ్యుంటాడని త్రినేత్రి అనుకుంటుంది. ఇక మరోవైపు విశాల్ బ్యాగ్ పట్టుకొని గులాబి రంగు షర్ట్ వేసుకొని వెళ్తాడు. అక్కడ త్రినేత్రికి తన బామ్మ పెళ్లి కొడుకు ఏ రంగు షర్ట్‌లో వస్తాడని చెప్పిందో అదే రంగు షర్ట్ విశాల్ వేసుకొని అదే ఊరు బయల్దేరుతాడు. ఇక విశాల్‌కి గాయత్రీ పాప ఎదురుగా వస్తుంది. అయితే పాప వెళ్లొద్దు అన్నట్లు రెండు చేతులు ఊపుతూ సైగ చేస్తుంది. ఎవరికీ ఆ సైగ అర్థం కాదు. అమ్మని నన్ను వదిలేసి వెళ్తున్నావా అన్నట్లు సైగ చేస్తుందని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.