Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవికి రామ్, సీతలు థ్యాంక్స్ చెప్తారు. తనని సరైన దిశలో నడిపించి గెలిపించినందుకు మీకు సరైన గౌరవం దక్కాలి అని సన్మానం చేయాలి అనుకుంటున్నాం అని ఒప్పుకోవాలి అని చెప్తారు. రామ్ తన పిన్నిని పొగిడి ఒప్పుకోమని చెప్తాడు. ఇద్దరూ విద్యాదేవిని కిందకి తీసుకెళ్తారు. ఇక మహాలక్ష్మి వాళ్లతో ప్రీతి, ఉషలు తమకు డ్యాన్స్ నేర్పించిన మాస్టార్‌కి సన్మానం చేయకుండా సీతకు నేర్పించిన వారికి సన్మానం ఏంటని ప్రశ్నిస్తారు. ఇక మహాలక్ష్మి తాను ప్లాన్ చేశాను అని ఇప్పుడు తనకు అవమానం జరుగుతుందని అంటుంది. చలపతి ఆ మాటలు వింటాడు.
విద్యాదేవి కిందకి రావడంతో మహాలక్ష్మి మంచిగా మాట్లాడుతుంది. సీత మనసులో మహాలక్ష్మికి మండుతున్నట్లు ఉందని అనుకుంటుంది. ఇక విద్యాదేవి మీతో కలిసి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనిపిస్తుందని అంటుంది. ఇక జనార్థన్ కోసం అందరూ ఎదురు చూస్తారు. ఇంకా రాలేదు ఏంటా అని అనుకుంటారు. మహాలక్ష్మి జనా అంటూ పిలుస్తుంది. జనార్థన్ కిందకి వచ్చి తన బ్రేస్‌లెట్ కనిపించడం లేదు అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. అర్చన ఎవరో దొంగిలించేశారు అని అంటుంది.
చలపతి: మనసులో.. కొంప తీసి టీచర్ మీద ఆ నింద మోపుతారేమో.
అర్చన: ఇంటిలో ఎవరో దొంగిలించి ఉంటారు కదా. మన ఇంటిలో ఓ బయట వ్యక్తి ఉన్నారు కదా.
మహాలక్ష్మి: ఏంటి అర్చన విద్యాదేవి గారు తీసుంటారు అంటావా.
సీత: మా టీచర్ దొంగతనం చేసింది అంటారా.
రామ్: టీచర్ మంచిది కదా పిన్ని.
మహాలక్ష్మి: ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం రామ్. పైకి ఒకలా లోపల మరోలా ఉంటారు.
సీత: మా టీచర్‌కి అవసరం లేదు. మీరే లక్ష ఇస్తాను అంటే వద్దు అన్నారు.
విద్యాదేవి: నాకు ఆ అవసరం లేదు. కొందరిలా పరాయి సొమ్ముకి ఆశపడటం నాకు తెలీదు.
మహాలక్ష్మి: ఈ ఇంట్లో అందరూ ధనవంతులే.
రామ్: అయినా టీచర్ గారికి నాన్న బ్రేస్‌లెట్ కోసం ఎలా తెలుసు.
మహాలక్ష్మి: ఎందుకు తెలీదు. ఇంటికి వచ్చిన రెండో రోజే మీనాన్న చేతికి ఉన్న బ్రేస్‌లెట్ మీద కన్నేసింది. మీ నాన్న చేతికి తానే కట్టింది కూడా.
రామ్: అనవసరంగా టీచర్ మీద నిందలు వేయకండి.
మహాలక్ష్మి: ఎస్ ఇవన్నీ ఎందుకు ఒకసారి ఆమె రూమ్, బ్యాగ్ చెక్ చేస్తే సరిపోతుంది.
ప్రీతిని పంపించి చెక్ చేయమంటారు. ప్రీతి, రామ్‌లు వెళ్లి గది అంతా చెక్ చేస్తారు. విద్యాదేవి సర్దుకున్న బ్యాగ్‌లో ప్రీతి బ్రేస్‌లెట్ గుర్తిస్తుంది. రామ్‌కి విషయం చెప్తుంది. టీచర్ దొంగ అని అంటుంది. కిందకి వెళ్లి అందరికీ విషయం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. విద్యాదేవి మనసులో ఇది అస్సలు నేను ఊహించలేదు అని అనుకుంటుంది. అందరూ విద్యాదేవిని నిందిస్తారు. జనార్థన్ కూడా విద్యాదేవిని కోప్పడతాడు. చాలా అసహ్యంగా ఉందని అంటాడు. రామ్ కూడా మా అమ్మ జ్ఞాపకాన్ని దొంగిలించి మా నాన్నని బాధ పెట్టారు అని మిమల్ని అమ్మ అని ఎందుకు పిలిచానా అని అంటాడు. సీత మాత్రం టీచర్‌ని అలా అనొద్దని అంటుంది. విద్యాదేవి తల వంచుకుంటుంది. ఇక మహాలక్ష్మి సన్మానం మానేసి శిక్ష వేయాలి అనుకుంటున్నాం అని అంటుంది. జనార్థన్ ఇలాంటి దొంగకు ఇంట్లో స్థానం లేదు అని ఇంటి నుంచి వెంటనే పంపించమని అంటాడు. రామ్ పనిష్మెంట్ వద్దు అని అంటాడు.
ఇక సీత ఆ బంగారం కొట్టేసింది మా టీచర్‌నా నువ్వా చిన్నత్తయ అని అంటుంది. మీ అందరికీ ఓ సినిమా చూపించబోతున్నాను అని సీత అంటుంది. అర్చన దొంగతనం చేసి అది విద్యాదేవి బ్యాగ్‌ళో వేయడం సీత తన ఫోన్‌లో రికార్డ్ చేసి అది విద్యాదేవి బ్యాగ్‌లో వేసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.