Seethe Ramudi Katnam Today Episode : సీత తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. మధు విషయంలో తానో నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది. తాను చేయబోయే పనిని చెప్తుంది. దీంతో అందరూ సీతని పొగుడుతారు. మరోవైపు మహాలక్ష్మి, అర్చనలు ప్రీతి, ఉషలను తిడతారు. ఇద్దరూ సారీ చెప్పి తల దించుకుంటారు. మధు ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఇంట్లో సీత పెత్తనం పెరిగిపోతుందని అందరూ మహాతో చెప్తారు. సీత దగ్గర తామే ఏం చేయలేని వాళ్లలా మిగిలిపోయాం అని మహాలక్ష్మి బాధపడుతుంది. ఇక మధుని ఆపడానికి మహా ఓ ప్లాన్ వేస్తుంది.  ఐడియా సూపర్ అని అందరూ మహాలక్ష్మిని పొగిడేస్తారు. 


ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. మధుమితని సీత రమ్మని పిలుస్తుంది. మధు బ్యాగ్ పట్టుకొని వస్తుంది. మధు తానని మహా కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మన్న విషయం ప్రీతి ఉషల ప్రేమ అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. రామ్ మధు దగ్గరకు వచ్చి వర్రీ అవ్వొద్దని త్వరలోనే సూర్య బయటకు వస్తాడని చెప్తాడు. ఇక విద్యాదేవి అంతా నీ మంచికే మధు  అని అంటుంది. ఇక రేవతి ఇది నీకు అవమానం కాదు గౌరవం అని అంటుంది. ఇంటి నుంచి నీకు విడుదల వచ్చిందని నీకు స్వేచ్ఛ వచ్చిందని సీత అంటుంది. ఇక మధుని బయల్దేరమని అంటుంది. మధు వెళ్తుండగా మహాలక్ష్మి ఆపుతుంది.


మహాలక్ష్మి: సారీ మధు. నీకు న్యాయం చేస్తా అని ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నీకు ఏం చేయకుండా వెళ్లిపోతున్నావు. నా వల్ల నువ్వు నష్టపడ్డావు. నీ సమస్య తీరకుండా ఒంటరిగా ఇంటి నుంచి వెళ్లిపోతున్నావ్. నన్ను క్షమించు మధు. నేను తప్పు చేశాను.
అర్చన: నువ్వు నిజంగానే తప్పు చేశావ్ మహా. సీత నీతో పంతం పట్టి అలా నీతో పందెం కాయించింది. మీ పట్టుదల కారణంగా మధ్యలో మధు బలి అయిపోయింది. మధు స్థానంలో నేను ఉండి ఉంటే నన్ను ఎందుకు తీసుకొచ్చారు. ఎందుకు పో మంటున్నారు. అని నిలదీసేదాన్ని.
జనార్థన్: అవును మహా న్యాయం చేస్తా అని చెప్పి ఇలా పంపడం తప్పు. 
గిరిధర్: అవును అయినా ఇంతకుముందు సీత సూర్యని విడిపించి తన అక్కని పంపిస్తా అని చెప్పింది. ఇప్పుడు ఇలా పంపడం తప్పు కదా. మాట తప్పినట్లే కదా. 
అర్చన: అసలు మధు, రామ్‌ల మధ్య ఏదో ఉందని సీత అనుమానించడం వల్లే ఈ సమస్య వచ్చింది. 
రామ్: ఏంటి మీరు అనేది.
మహాలక్ష్మి: అవును రామ్ నీకు మధుకి మధ్య ఏదో సంబంధం ఉందని సీతకు అనుమానం వచ్చింది అందుకే మధుని ఇంటి నుంచి పంపేయాలి అని ఇలా ప్లాన్ చేసింది. నాతో పందెం కాసింది.


సీత మధుని ఉంచడానికి మళ్లీ కుట్ర చేస్తున్నారా అని అడుగుతుంది. దీంతో రామ్ అలాంటి కారణంతో మధుని ఇంటి నుంచి వెళ్లడానికి తాను ఒప్పుకోను అని రామ్ అంటాడు. సీత ఎంత చెప్పినా రామ్ ఒప్పుకోడు. సీత గెలిచింది కాబట్టి నేను వెళ్లిపోతాను అని అంటుంది. అయితే తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లను అని సూర్య లేని అత్తారింటికి వెళ్లనని అంటుంది. ఎమోషనల్ అవుతుంది మధు. సూర్య వచ్చేవరకు ఇక్కడే ఉండమని అందరితో పాటు రామ్ కూడా అంటాడు. విద్యాదేవి కూడా సూర్య వస్తేనే మధుని పంపాలని అంటుంది. విద్యాదేవి మాటలకు అందరూ షాక్ అయిపోతారు. 


సీత షడెన్‌గా సూర్యని పిలుస్తుంది. అందరూ షాక్ అవుతారు. సూర్య ఎంట్రీ ఇస్తాడు. విద్యాదేవి సూర్య విషయం పెద్ద లాయర్‌తో మాట్లాడి బెయిల్ ఇప్పించిందని త్వరలోనే కేసు కూడా కొట్టేస్తారు అని సీత చెప్తుంది. మధుమిత, మహాలక్ష్మి అందరూ షాక్ అయిపోతారు. సూర్యని మధుమితని తీసుకెళ్లమని సీత చెప్తుంది. దీంతో సూర్య మధుని తీసుకెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సంధ్యని ఇచ్చి తనకు పెళ్లి చేస్తేనే సత్య వీడియో డిలీట్ చేస్తానని విశ్వనాథాన్ని బెదిరించిన కాళీ!