Rishi Is back In Guppedantha Manasu Serial: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ సీరియల్‌లోకి రిషీ రి-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ‘స్టార్ మా’ స్పష్టం చేసింది. తాజాగా ఇన్‌స్టాలో ఇద్దరు అమ్మాయిలు రిషి సార్ రీ ఎంట్రీ గురించి చాటింగ్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆడియన్స్‌‌‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.


‘గుప్పెడంత మనసు’ సీరియల్ సోమవారం నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. అయితే తాజాగా స్టార్‌మా ఇందుకు సంబంధించి ఓ పోస్ట్ చేసింది. సీరియల్ లవర్స్ అనే ఓ వాట్సాప్ గ్రూప్‌లో ప్రియా, రియా అనే ఇద్దరు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ గురించి చాటింగ్ చేస్తున్నట్లు చూపించారు. చాటింగ్‌కు సంబంధించిన చిన్న క్లిప్లింగ్ పోస్ట్ చేస్తూ దాని కింద ఇలా రాసుకొచ్చారు.


చాటింగ్‌లో ఏముంది అంటే..


ప్రియా: రియా.. ‘గుప్పెడంత మనసు’లో రిషి వచ్చేస్తున్నాడు తెలుసా.
రియా: ఓమైగాడ్, రియల్లీ.. వాట్ ఏ సర్‌ఫ్రైజ్.
ప్రియా: అలాగే సీరియల్ సాయంత్రం 6 గంటలకి మారింది.
రియా: అవునా.. ఆ టైమ్‌కి మూవీకి వెళ్దామనుకున్నా.
ప్రియా: మూవీనా, సీరియలా.. నిర్ణయించుకో.
రియా: రిషి రీ ఎంట్రీ కాబట్టి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫస్ట్.
ప్రియా: సూపర్.. రిషి సార్‌ రీ ఎంట్రీని చూసే వరకు ఇక ఆగలేను.
రియా: నేను కూడా.. సాయంత్రం మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి రిషి సార్‌ రీ ఎంట్రీ చూద్దాం. 



స్టార్‌మా ప్రియా, రియా అనే ఇద్దరు అమ్మాయిలు చాటింగ్ చేసినట్లు ఇవాళ సాయంత్రం రిషి రీ ఎంట్రీ గురించి చెప్పడంతో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. మేం కూడా చాలా ఎదురు చూస్తున్నాం అని ఒకరు. రిషి లేక ఇన్ని రోజులు సీరియల్ బోరింగ్‌ ఉందని మరొకరు. రిషి లేని ‘గుప్పెడంత మనసు’కి ఊహించుకోలేమని ఒకరు. సీరియల్ మళ్లీ గాడిలోకి రానుందని ఇలా అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


అభిమానుల కామెంట్స్‌లో ఫన్నీ..


‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కు, రిషి, వసులకు ఉన్న క్రేజ్‌నే వేరు. అలాగే స్టార్‌ మాలో వచ్చే ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ నటులు వేద, యష్‌లు కూడా ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. అయితే ఈ సీరియల్ ముగియడంతో ఈ ఇద్దరూ స్టార్‌మాలోనే ‘సత్యభామ’ సీరియల్‌లో నటిస్తున్నారు. ఆ సీరియల్‌లో ఇద్దరి పేర్లు క్రిష్‌, సత్య అభిమానులు ఆ కాంబోని ఇద్దరి పేర్లలోని ఒక్కో అక్షరం జతచేసి 'క్రిత్య' అని ముద్దుగా పిలుచుకుంటారు. విషయం ఏమిటంటే స్టార్ మా పోస్ట్ చేసిన రిషి రీ ఎంట్రీ పోస్ట్‌లో సీరియల్ లవర్స్ అనే ఆ వాట్సాప్ గ్రూప్‌కి 'క్రిత్య' డీపీని పెట్టింది. దీంతో ఆ సీరియల్ లవర్స్ కూడా రిషి రీ ఎంట్రీపై విపరీతంగా రెస్పాండ్ అవుతున్నారు. మేం కూడా రిషి రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నామని, మా క్రిత్యల డీపీ పెట్టుకోవడం సంతోషంగా ఉందని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.   


ఇది వరకు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ మధ్యాహ్నం 12:30కి వచ్చేది. ఆ టైంలో ఈ రోజు నుంచి నిన్ను కోరి అన్నే కొత్త సీరియల్ ప్రారంభమైంది. దీంతో ‘గుప్పెడంత మనసు’కి పూర్వవైభవం దక్కింది. రిషి రీ ఎంట్రీ ఇస్తే రిషికి అనుపమ కొడుకు మను అని తెలుస్తుంది. అయితే మను రిషి తండ్రి మహేంద్ర కొడుకు కావడం ఆ విషయం వసుకి తెలియడంతో వసు రిషికి చెప్తుందా లేదా అనే ఉత్కంఠ మొదలవుతుంది. ఒక వేళ రిషికి చెప్తే రిషి తన తండ్రిని ఎలా అర్థం చేసుకుంటాడో చూడాలి. ఒకప్పుడు రిషి తల్లి జగతిని ఎంతలా ద్వేషించే వాడో ఇప్పుడు మను తన తండ్రిని అంతలా ద్వేషిస్తున్నాడు. మరి రిషి తండ్రి విషయంలో మనుని మార్చుతాడా.. మనుని తమ్ముడు అంగీకరిస్తాడా లేదా అనే విషయాలు మున్ముందు తెలుస్తాయి.


Also Read: ‘పడమటి సంధ్యారాగం’ సీరియల్‌: హాస్పిటల్ లో ఆద్యను చంపేసిన చారు – శోకసంద్రంలో రఘురాం కుటుంబం