ఈటీవీ వీక్షకులకు గురువారం అంటే 'జబర్దస్త్' డే. జబర్దస్త్ అంటే గురువారం. ఇక నుంచి అలా చెబితే కుదరదు. 'జబర్దస్త్' షో ఈ వారం నుంచి గురువారం టెలికాస్ట్ కావడం లేదు. ఆ సంగతి లాస్ట్ వీక్ రిలీజ్ చేసిన ప్రోమోలో చెప్పారు. గురువారం బదులు శుక్రవారం 'జబర్దస్త్' టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఫ్రైడే నైట్ 9.30కి ఈటీవీ ఆన్ చేస్తే చాలు... జబర్దస్త్ చూడొచ్చు. శుక్రవారం రాత్రి వచ్చే 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ఎక్స్ట్రా అనేది తీసేసి జస్ట్ 'జబర్దస్త్' పేరుతో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం చెయ్యడానికి ఈటీవీ రెడీ అయ్యింది. మరి, గురువారం ఏ షో వస్తుంది? అంటే... 


'జబర్దస్త్' ప్లేసులో గురువారం రాత్రి 'ఢీ'
Find out the latest show timings and telecast days for Dhee: అవును... ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఈటీవీలో 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2 టెలికాస్ట్ కానుంది. 'ఢీ' షో వచ్చేది బుధవారం కదా, గురువారం అంటారేంటి? అనే డౌట్ వచ్చిందా? ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్. ఇక నుంచి బుధ, గురు... వారంలో రెండు రోజుల పాటు రాత్రి తొమ్మిదిన్నరకు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' టెలికాస్ట్ కానుంది. టీవీ చూసే జనాలకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని చెబుతోంది. అదీ సంగతి! 'జబర్దస్త్' ప్లేసులో గురువారం 'ఢీ' షో టెలికాస్ట్ అవ్వడం అయితే కన్ఫర్మ్.


'ఢీ'లోనూ మార్పులు చోటు చేసుకున్నాయ్!
'జబర్దస్త్'లో మార్పులు చోటు చేసుకున్నట్టు... 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు 'జబర్దస్త్'లో కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరించారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ఇంద్రజ బదులు ఖుష్బూ జడ్జిగా చేశారు. కానీ, ఇప్పుడు అలా కాదు. 'జబర్దస్త్' పేరుతో రెండు రోజులు షో టెలికాస్ట్ కానుంది కనుక... రెండు రోజులూ ఖుష్బూ వుంటారు. 'ఢీ' విషయానికి వస్తే.... లాస్ట్ సీజన్ బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ జడ్జిగా చేశారు. ఇప్పుడు ఆమె బదులు హన్సికను తీసుకున్నారు. జడ్జిగా ఈ సీజన్ వరకు ఆవిడ సందడి చేయనుంది.


Also Read: రామ్ చరణ్ కూతురికి గిఫ్ట్ పంపిన ప్రభాస్ - క్లిన్ కారా కొత్త ఫ్రెండ్ ఎవరో చూశారా?



'ఢీ'కి మరోసారి యంగ్ హీరో నందు యాంకరింగ్!
Dhee Celebrity Special Anchor Name: 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' ముందు వరకు ఆ షో పేరు చెబితే ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ గుర్తుకు వచ్చేది. సెలబ్రిటీ స్పెషల్ సీజన్ కోసం యంగ్ హీరో నందును తీసుకు వచ్చారు. ఇప్పుడు 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2లో కూడా ఆయన యాంకరింగ్ సందడి చేయనుంది. సెలబ్రిటీ డ్యాన్సర్లకు తోడు కామెడీ అందించే బాధ్యతను 'హైపర్' ఆది తీసుకోనున్నారు. మరి, ఈ సీజన్ (Dhee Celebrity Special 2)లో డ్యాన్స్ చేసే సెలబ్రిటీలు ఎవరు? అనేది త్వరలో వెల్లడించనున్నారు.


Also Readఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఏపీకి రామ్ చరణ్ - Pithapuramకి దగ్గరలో షూటింగ్ ప్లాన్ చేసిన అబ్బాయ్


'జబర్దస్త్' శనివారానికి వెళ్లడంతో ఆ టైమ్ స్లాట్ లో వచ్చే 'సుమ అడ్డా'ను శని నుంచి మంగళవారానికి తీసుకు వచ్చారు. ఆదివారం రాత్రి ఈటీవీలో 'సుడిగాలి' సుధీర్ హోస్ట్ చేస్తున్న కొత్త షో 'ఫ్యామిలీ స్టార్స్' మొదలైంది. 'జబర్దస్త్' షోకి రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తోంది.