Padamati Sandhya Ragam Serial Today Episode : హాస్పిటల్​లో ఉన్న ఆద్య దగ్గరకు చారు వెళ్తుంది. నువ్వు భూమ్మీద లేకుంటేనే కదా బావ నాకు దగ్గరయ్యేది. అందుకే దగ్గరుండి నిన్ను పైకి పంపించాలని వచ్చాను. బావ జీవితంలోకి నన్ను రాకుండా చేయాలనుకున్నావు.. కానీ నిన్నే జీవితంలోంచి పైకి పంపిస్తున్నాను కడసారి వీడ్కోలు అంటూ ఆద్యకు పెట్టిన ఆక్సిజన్‌ ఆఫ్‌ చేసి వెళ్లిపోతుంది చారు. దీంతో ఆద్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇంతలో ఆద్యను చూడాలని రామలక్ష్మీ రూం దగ్గరకు వచ్చి ఆద్యను చూసి గట్టిగా కేకలు వేస్తుంది. దీంతో రఘురాం, జానకి, శీను అందరూ లోపలికి వస్తారు. గిలగిలా కొట్టుకుంటున్న ఆద్యను చూసిన రఘురాం వెంటనే వెళ్లి డాక్టర్‌ను తీసుకొస్తాడు. డాక్టర్‌ వచ్చేసరికే ఆద్య చనిపోతుంది. అందరూ ఏడుస్తూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.


శీను: ఆద్య లేవు ఆద్య.. నన్ను చూడు ఒక్కసారి నన్ను చూడు ఆద్య..


అంటూ ఏడుస్తూ శీను వాచ్‌ తీసి ఆద్య పక్కన పెట్టి  అక్కడి నుంచి వెళ్లి హాస్పిటల్‌లో ఉన్న దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంటాడు. మరోవైపు లోపల వాచ్‌ అల్లారం మోగుతుంది. ఐసీయూ డోర్‌ దగ్గరకు వెళ్లిన రామలక్ష్మీ ఏడుస్తూ లోపలికి చూడగానే ఆద్య కదులుతుంది. వెంటనే అందరినీ పిలుస్తూ లోపలికి వెళ్తుంది రామలక్ష్మీ. అందరూ లోపలికి వచ్చి ఆద్యను పిలుస్తుంటారు.


రఘురాం: అమ్మా ఆద్య చూడు నన్ను చూడమ్మా..


రామలక్ష్మీ: అమ్మా నేను వెళ్లి శీను బావను పిలుచుకుని వస్తాను.


జానకి: ఆద్యా.. అమ్మా ఆద్యా.. ఏవండి.. డాక్టర్‌.. డాక్టర్‌ ను పిలవండి..


రఘురాం: డాక్టర్‌.. డాక్టర్‌..


రామలక్ష్మీ: బావ ఆద్య కళ్లు తెరిచింది బావ. నిజమైన ప్రేమను ఏడిపించింది చాలు అని ఆ దేవుడే ఆద్యకు మళ్లీ ప్రాణం పోశాడు బావ. ఎవరేమనుకున్నా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే ఆద్యను మళ్లీ బతికించింది బావ.


అని చెప్పి రామలక్ష్మీ లోపలికి వెళ్తుంది. రూంలోకి వచ్చిన డాక్టర్‌  ఆద్యను చూసి ఆశ్చర్యపోతుంది. ఇది నేను నమ్మలేకపోతున్నాను చనిపోయిందనుకున్న అమ్మాయి మళ్లీ ఎలా బతికింది అంటుంది. ఇంతలో శీను లోపలికి పరుగెత్తుకుంటూ వస్తాడు. ఆద్యను చూసి హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు రామలక్ష్మీని కిడ్నాప్‌ చేసిన వీడియో చూస్తుంటారు ప్రశాంత్‌ ఫ్రెండ్స్‌. ఇంతలో ప్రశాంత్‌ అక్కడికి వస్తాడు.


ప్రశాంత్‌: అరెయ్‌ అదెలా వీడియో తీశావురా? ఎందుకు తీశావు. ఆ వీడియో అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకుంటున్నావా? రామలక్ష్మీ నాకు కాబోయే భార్య అని తెలిసి ఆ వీడియో ఎలా తీశావు.


ప్రశాంత్‌ ఫ్రెండ్‌: ఆగు బాసు నిన్ను బ్లాక్‌ మెయిల్‌ చేయాల్సిన అవసరం నాకేంటి?


ప్రశాంత్‌: మరెందుకు ఆ వీడియో తీశావు.


ఫ్రెండ్‌: అదా ఆ రఘురాం మీద పగ. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పెట్టాను అంటే వాడు వాడి కుటుంబం మొత్తం ఉరేసుకునైనా చావాలి. లేదా ఊరొదిలి వెళ్లిపోవాలి.


ప్రశాంత్‌: ఆ వీడియోలో నేను ఉన్నాను కదరా? అది సోషల్‌ మీడియాలో ఎలా పెడతావు.


ఫ్రెండ్‌: నువ్వు ఉన్నదంతా డిలీట్‌ చేసి శౌర్య గాడు ఉన్న దగ్గర నుంచి పోస్ట్‌ చేస్తాను.  


అనగానే ప్రశాంత్‌ దీనివల్ల రామలక్ష్మీ పరువు పోతుంది కదా అంటే మేము చేసేదంతా నీకు రామలక్ష్మీకి పెళ్లి చేయడానికే అని కన్వీన్స్‌ చేస్తారు. దీంతో ప్రశాంత్‌ సరేనని వెళ్లిపోతాడు. ప్రశాంత్‌ వెళ్లిపోయాక ఫుల్‌ వీడియో ఒక కాఫీ తీసిపెట్టుకోవాలి అని డిసైడ్‌ అవుతారు ప్రశాంత్‌ ఫ్రెండ్స్‌ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: సెట్స్‌పైకి వచ్చిన సూర్య కొత్త సినిమా - అండమాన్‌ దీవుల్లో షూటింగ్‌, ఫస్ట్ గ్లింప్స్ చూశారా?