Satyabhama Today Episode : రెండు జంటలు ఇంటికి బయల్దేరటానికి సిద్ధమవుతారు. హర్ష తాను నందినితో కలిసి వేరుగా వస్తాను అని మరో కారు ఏర్పాటు చేయిస్తాడు. ఇక నందినికి భైరవి కాల్ చేస్తుంది. నందిని హర్ష ప్రత్యేకంగా కారు ఏర్పాటు చేశాడని తాను క్రిష్‌ వాళ్ల కారులో ఇంటికి వచ్చేస్తా అని చెప్తుంది. భైరవి వద్దు అని హర్షతోనే వెళ్లమని చెప్తుంది. రెండు జంటలు రెండు కార్లలో బయల్దేరుతారు.


క్రిష్: ఇది లాంగ్ డ్రైవింగ్ పక్కనున్నవాళ్లు మూతి ముడుచుకుంటే చిరాకేస్తుంది. టైం పాస్ కోసం అయినా ఏమైనా వాగొచ్చుకదా. అదే మాట్లాడొచ్చుకదా.
సత్య: చూడు.. రాత్రి ఏమీ జరగలేదు కదా. నువ్వు చెప్పింది అంతా అబద్ధమే కదా.
క్రిష్: దేవుడా నువ్వు ఇంకా ఆడనే ఉన్నావా. ఒక్కాసారి నీ ముఖం చూసుకో ఒక్క రాత్రిలో నీ ముఖంలో ఎంత వెలుగు వచ్చిందో తెలుసా. అయినా ఒక్కసారి అంత వెలుగు వచ్చిందంటావ్..
సత్య: అబద్ధం.. అబద్ధం.. అంతా అబద్ధం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నువ్వు అంటే నాకు అసహ్యం.
క్రిష్: అది ఒకప్పుడు సత్య.. ఇప్పుడు నీకు నేను చాలా ఇష్టం. సరే జరిగింది అబద్ధం అని అనుకో ఎవరు వద్దు అన్నారు. రెండు నెలలు ఆగి నువ్వే నా దగ్గరకు వచ్చి నిజం తెలుసుకున్నా అని సిగ్గు పడుతూ చెప్తావ్.
సత్య: ఛా.. ఖర్మరా బాబు. 


క్రిష్ రొమాంటిక్ పాటలు పెడితే సత్య మార్చేస్తుంది. అన్నీ వాళ్లకు పరిస్థితికి తగ్గట్టే పాటలు వస్తాయి. ఇక సత్య మనసులో క్రిష్ మాటలు నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. మరోవైపు ఉదయం సంధ్య తన తండ్రితో కలిసి కూరగాయలకు వెళ్తాను అని తల్లితో చెప్తుంది. ఇక కాళీ ఆరుబయట వెయిట్ చేస్తుంటాడు. ఇక సంధ్య ఫోనులో మాట్లాడటం కాళీ చూస్తాడు. సంధ్య కూడా చాలా అందంగా ఉందని అలా ఎలా మిస్ అయ్యాను అని అనుకుంటాడు. ఇంతలో విశ్వనాథం బయటకు వచ్చి కాళీని చూస్తాడు. సంధ్యని లోపలికి వెళ్లి తలుపు వేసుకోమన అంటాడు. కాళీ దగ్గరకు విశ్వనాథం వెళ్తాడు. కాళీ మరోసారి విశ్వనాథాన్ని బెదిరిస్తాడు. డబ్బులు ఇవ్వలేను అని విశ్వనాథం దండం పెట్టడంతో పది లక్షలు ఇవ్వకుండా దానికి బదులుగా సంధ్యని ఇచ్చి తనకు పెళ్లి చేయమని అడుగుతాడు. దాంతో విశ్వనాథం కాళీ కాలర్ పట్టుకుంటాడు. సంధ్యని ఇచ్చి పెళ్లి చేస్తేనే సత్య వీడియో డిలీట్ చేస్తాను అని అంటాడు. విశ్వనాథం ఏడుస్తాడు.


మరోవైపు మహదేవయ్య చక్రవర్తికి కాల్ చేస్తాడు. పిల్లల గురించి అడుగుతాడు. వారసుడి గురించి కంగారు పడతారు. చక్రవర్తి టెన్షన్ వద్దని క్రిష ముఖంలో ఏదో తెలియని ఫీలింగ్ ఉందని, సత్య కూడా సిగ్గు పడుతుందని చెప్తాడు. మహదేవయ్య హ్యాపీగా ఫీలవుతాడు. ఇక సత్య మరో రెండు రోజులు ఉందామని అంటే క్రిష్ వద్దన్నాడని  చెప్తాడు. దీంతో మహదేవయ్య క్రిష్‌ని తిడతాడు. మరోవైపు క్రిష్‌, సత్యలు ఇంటికి వచ్చేస్తారు. క్రిష్ సత్యను ఆటపట్టిస్తాడు. మహాదేవయ్య క్రిష్‌ని హగ్ చేసుకుంటాడు. సత్యకు దిష్టి తీయమని చెప్తాడు. త్వరలోనే వారసుడు వస్తాడు అని అంటాడు. భైరవి ఆ మాట సత్య నోటి నుంచి చెప్పమని అంటుంది. సత్య లేని సిగ్గు నటిస్తూ అవును అని సిగ్గు పడుతూ లోపలికి వెళ్లిపోతుంది.  



సత్య గదిలోకి వచ్చి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ మాత్రం చాలా హుషారుగా వస్తాడు. సత్య మళ్లీ మంచాలు దూరం చేస్తే క్రిష సెటైర్లు వేస్తాడు. వారసులిని ఇస్తాను అని తనతో ఎందుకు అబద్ధం చెప్పిస్తున్నావ్ అని అడుగుతుంది. దీంతో క్రిష్ కాలు జారింది నువ్వు నా మీద అరుస్తావ్ ఏంటి అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యను శాశ్వతంగా దూరం చేస్తానని దీపకు వార్నింగ్ ఇచ్చిన నర్శింహ.. జ్యోత్స్న ఎమోషనల్!