Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపలు శౌర్య కోసం మొత్తం వెతుకుతారు. దీప చాలా ఏడుస్తుంది. కార్తీక్, జ్యోత్స్నలు దీపకు ధైర్యం చెప్తారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే దీప వద్దు అనేస్తుంది. ఇక రోడ్డు మీద పరుగులు తీస్తూ దీప పాప కోసం వెతుకుతుంది. మరోవైపు శ్రీధర్, కాంచనలు ప్రేమగా మాట్లాడుకుంటారు. 


కాంచన: లండన్ వెళ్లినప్పుటి నుంచి కార్తీక్ తేడాగా ఉన్నాడని మీరు అన్నారు కదా గత రెండు రోజుల నుంచి నాకు మీరు తేడాగా కనిపిస్తున్నారు. ఏమైంది అండీ నాతో ఏమైనా చెప్పాలా.  


శ్రీధర్: మనసులో.. చెప్తే నువ్వు తట్టుకోవులే కాంచన. కాంచన నేను వారం రోజులు బయటకు వెళ్తాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్లు. బెంగ పెట్టుకోకు.


కాంచన: మీ మీద బెంగ లేకుండా ఎలా ఉంటుంది అండీ. 


శ్రీధర్: మనసులో.. ముందు అర్జెంట్‌గా కార్తీక్ పెళ్లి చేయాలి ఆ తర్వాత నీకు కావేరి గురించి చెప్పాలి. 


కార్తీక్, జ్యోత్స్న, దీపలు కారులో వెళ్తుంటారు. తన బిడ్డ కోసం దీప ఏడుస్తూ ఉంటుంది. సిటీకి వచ్చి తప్పు చేశానని బాధపడుతుంది. కార్తీక్, దీప మాటలకు రగిలిపోతున్న జ్యోత్స్నకు పారిజాతం కాల్ చేస్తుంది. జ్యోత్స్న పారుతో శౌర్య మిస్ అయిందని వెతుకుతున్నాం అని చెప్తుంది. దాంతో పారు శౌర్యని మీరు వెతకడం ఏంటి అది అవుట్ హౌస్ గుమ్మం దగ్గర కూర్చొని ఉందని చెప్తుంది. జ్యోత్స్న నమ్మకపోతే ఫోటో తీసి పెడుతుంది. కార్తీక్, దీపలకు జ్యోత్స్న పాప ఇంటి దగ్గర ఉంది అని చెప్తుంది. ఇక జ్యోత్స్న మేం వెళ్తాము మాకు పని ఉంది అని చెప్తుంది. దాంతో దీప మిమల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టాను అని ఇంటికి వెళ్తాను అని అంటుంది. దానికి కార్తీక్ తనకి కూడా శౌర్యని చూడాలి అని ఉందని అంటాడు. ముగ్గురూ ఇంటికి వెళ్తారు.


దీప శౌర్యని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక శౌర్య కారులో ఇంటికి వచ్చాను అని అంటుంది. ఇంతలో నర్శింహ కార్తీక్‌కు కాల్ చేస్తాడు. కార్తీక్ నర్శింహను తిడతాడు. దీపకి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. దీప ఫోన్ తీసుకొని ఎందుకు కాల్ చేశావ్ అని అడుగుతుంది. పాప కనిపించిందా అని నర్శింహ అడుగుతాడు. పాపని ఎత్తుకెళ్లింది తన ఫ్రెండే అని నిన్ను టెన్షన్‌ పెట్టడానికే ఇలా చేశాను అని అంటాడు. తాను పెట్టబోయే టార్చర్ ప్రారంభమైంది అని త్వరలో శౌర్యని కూడా దూరం చేస్తాను అని నీ బిడ్డ నీకు దక్కదు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక దీప కోపంగా బయట చిన్న పని ఉంది అని బయల్దేరుతుంది. 



శౌర్యకు తోడుగా నేను ఉంటాను అని కార్తీక్ అంటాడు. కోపంతో శౌర్య అదీ పరిస్థితి అని అంటుంది. కార్తీక్ జ్యోత్స్నని పిలిచినా పట్టించుకోకుండా వచ్చేస్తాడు. దీప ఉండటం టార్చర్‌గా ఫీలవుతున్న జ్యోత్స్నకు పారిజాతం దీప ఇక్కడ ఉండకూడదు అని చెప్తుంది. ఈ అనర్థాలు అన్నింటికీ మీ అమ్మే కారణం అని పారిజాతం జ్యోత్స్నకు చెప్తుంది. అది విన్న సుమిత్ర కోపంగా అత్తయ్య అని అరుచుకుంటూ అక్కడికి వస్తుంది. మనసులో పారు చచ్చానురా అనుకుంటుంది. ఇక సుమిత్ర పారుని తిడితే జ్యోత్స్న అడ్డుకొని తాను తన బావ దూరం కావడానికి దీప కారణం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ :శౌర్య మిస్సింగ్.. నడిరోడ్డు మీద కుప్పకూలిపోయిన దీప, నర్శింహ పనేనా!