Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్ దగ్గరకు జ్యోత్స్న వస్తుంది. ఏంటి ఈ సర్‌ఫ్రైజ్ అని కార్తీక్ అడిగితే సరదాగా వచ్చాను అని జ్యో చెప్తుంది. ఇక కార్తీక్ మీలాంటి వాళ్లు మా ఆఫీస్‌కు రావడం ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. దానికి జ్యో ఏంటి బావ మీలాంటి వారు మాలాంటి వారు అని వేరు చేసి మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. 


జ్యో: నన్ను నువ్వు దూరం చేస్తున్నావా. నాకు నువ్వు దూరం అవుతున్నావా.


కార్తీక్: ఇద్దరం ఇక్కడే ఉన్నాం. నువ్వే దూరంగా ఆలోచిస్తున్నావ్.  


జ్యో: మనసులో.. అనవసరంగా మాటా మాట పెంచి గొడవ పెట్టుకోవడం ఎందుకు నా టాలెంట్ చూపించి బావని నా దారిలోకి తెచ్చుకోవాలి. బావ నీకో గుడ్ న్యూస్.. రెస్టారెంట్‌ విషయంలో ఆ కేసు మనమే గెలిచాం. పరువునష్టం దావా వేయొద్దని అవతల వ్యక్తి డాడీని బతిమాలాడు. కేసు గెలిచాం కదా నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. మనిద్దరం సరదాగా దాబాకు వెళ్లి పరోటా తిని వద్దామా.


కార్తీక్: కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది జ్యోత్స్న.


జ్యో: నీకంటే ఇంపార్టెంట్ నాకు ఏం లేదు బావ. అలాగే నా కంటే ఇంపార్టెంట్ నీకు కూడా ఏం ఉండకూడదు. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్. 


కార్తీక్: మనసులో.. నువ్వు ఇలా అనుకోవడానికి కారణం పెద్దవాళ్లే. నిన్ను ఇప్పుడు దూరం పెట్టలేను. వాళ్లతో నిజం చెప్పే వరకు నీతో మామూలుగానే ఉంటా. నీ ఆలోచనలు నా మీద నుంచి బిజినెస్ మీదకు వెళ్లేలా చేయాలి. 


ఇద్దరూ బయటకు వెళ్తారు. మరోవైపు దీప స్కూల్ దగ్గరకు కంగారుగా వెళ్తుంది. టైం అయింది ఇంకా వదిలిపెట్టలేదా అని అడుగుతుంది. దాంతో వాచ్‌మెన్ ఎప్పుడో వదిలేశారు అని అందరూ వెళ్లిపోయారు అని అంటాడు. దీప తన కూతురు తన కోసం ఎదురు చూస్తుంటుందని అంటుంది. పాప వెయిట్ చేస్తుండగా క్యాబ్ వచ్చిందని తాను చూసే సరికి పాప లేదు అని క్యాబ్ ఎక్కి వెళ్లి ఉండొచ్చని వాచ్ మెన్ చెప్తాడు. దీంతో దీప పాపని నరసింహ తీసుకొని వెళ్లుంటాడు అని అక్కడికి బయల్దేరుతుంది. ఇక శోభకు అనసూయ జడ వేస్తూ దీప జోలికి వెళ్లొద్దని దాని విషయంలో నరసింహను రెచ్చగొట్టదని చెప్తుంది. శోభ మాత్రం తన భర్తని కొట్టించిందని దాన్ని వదిలను అంటుంది. దీపని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను అని అనసూయ అంటుంది. ఇంతలో దీప అత్తయ్య అని అరుచుకుంటూ వస్తుంది. ఇద్దరూ షాక్ అవుతారు. దీప అనసూయకు తన కూతురు ఎక్కడా అని అడుగుతుంది. 


దీప: ఏం తెలీనట్లు మాట్లాడకండి అత్తయ్య అని ఇళ్లంతా వెతుకుతుంది.


శోభ: దీప కూతురు మన ఇంట్లో ఉండటం ఏంటి అత్తయ్య.


అనసూయ: ఉండవే నాకు కూడా ఏం అర్థం కావడం లేదు.


దీప: అత్తయ్య నర్శింహ ఎక్కడ. నా కూతురు కనిపించడం లేదు అత్తయ్య.


అనసూయ: కూతురు కనిపించకపోతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లు నా ఇంటికి ఎందుకు వచ్చావ్. 


దీప: ఇంక చాలు అత్తయ్య నరహింహ నా కూతురిని ఎక్కడ పెట్టాడో చెప్పండి.


శోభ: ఓహో నా మొగుడిని జైలులో పెట్టించడానికి ఇప్పుడు ఇదో కొత్త నాటకమా. 


దీప: నాటకం కాదు.. నర్శింహ స్కూల్ దగ్గరకు వెళ్లి నిన్న శౌర్యతో మాట్లాడే ప్రయత్నం చేశాడు నేను అడ్డుకున్నాను. తర్వాత హోటల్ దగ్గరకు వచ్చి గొడవ చేశాడు జనాలు బుద్ధి చెప్పారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని నా కూతురిని ఎత్తుకొని వచ్చేశాడు. మీకు దండం పెడతాను అత్తయ్య నా కూతురు ఎక్కడుందో చెప్పండి. మీరంతా దూరం అయిపోయినా నాకంటూ ఉన్న ఒకే ఒక బంధం అది. దాన్ని దూరం చేయకండి.


అనసూయ: అసలు నువ్వేం మాట్లాడుతున్నావే. నీ కూతురిని ఎత్తుకొని రావాల్సిన అవసరం నా కొడుకుకు ఏంటే. అది నా కొడుకు కూతురు నా మనవరాలు. దాన్ని మీద నీకు ఎంత హక్కు ఉందో మాకే అంతే హక్కు ఉంది. నిన్ను వద్దు అనుకున్నవాళ్లం నీ కూతురు ఎందుకు మాకు.


దీప: పాపకు తండ్రి నరసింహ అని నేను చెప్పలేదు అందుకే దాన్ని తీసుకొని వచ్చాడు. 


దీపని అనసూయ, శోభ ఇద్దరూ దీపని తిట్టి పంపేస్తారు. పాప ఎక్కడికైనా పోయిందో ఎవరైనా ఎత్తుకు పోయారో పోయి వెతుక్కో అని పంపేస్తారు. దీప ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇక శోభ అత్తయ్యతో నర్శింహను జైలులో పెట్టించడానికి కార్తీక్‌ ఇలా దీపతో నాటకం ఆడిస్తున్నాడేమో అని అంటుంది. 


పారిజాతం తాను అద్భుతం చేయబోతున్నాను అని తనని తానే పొగుడుకుంటుంది. ఇక శివనారాయణ చూసి పారిజాతం తనలో తాను మాట్లాడుకుంటుందని పారు మీద సెటైర్లు వేస్తాడు. కార్తీక్, జ్యోత్స్నలను కలపడానికి ప్రయత్నించాను అని పారిజాతం అంటే వాళ్ల విషయంలో కలుగజేసుకోవద్దని అంటాడు. మరోవైపు కార్తీక్ జ్యో కారులో వెళ్తూ ఉంటారు. జ్యోత్స్న అనవసరంగా తన బావని అపార్థం చేసుకున్నాను అని అనుకుంటుంది. ఇక కార్తీక్ జ్యోత్స్నని అంత చదువు చదివి ఇంట్లో కూర్చొవద్దని అంటాడు.



జ్యోత్స్న దగ్గర దీపని పొగుడుతాడు. కోపంతో జ్యోత్స్న కారు ఆపమని అంటుంది. దాంతో కార్తీక్ దీప పేరు ఎత్తగానే కారు ఆపేమంటున్నావా అంటే అది కాదు అని ఏడుస్తున్న దీపని చూపిస్తుంది. కార్తీక్, జ్యోత్స్న ఇద్దరూ దీప దగ్గరకు వెళ్తారు. దీప శౌర్య కనిపించడం లేదు అని చెప్తుంది. కార్తీక్, జ్యోత్స్న ఇద్దరూ షాక్ అవుతారు. వెతుకుదామని అని కార్తీక్ పిలవగానే దీప వెళ్లి కారు ముందు సీటులో కూర్చొంటుంది. దీంతో జ్యోత్స్న కోపంతో వెళ్లి వెనక సీటులో కూర్చొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ : గాయత్రీదేవి సూచనతో సుమన తల పగలగొట్టి.. గంటలమ్మని తరిమికొట్టిన నయని!