Seethe Ramudi Katnam Serial Today July 26th Episode కిరణ్ డబ్బు సంపాదించినంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లకు ఎవరూ లేని అనాథ అయిన కిరణ్‌కి ఇచ్చి పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదని మహాలక్ష్మి అంటుంది. కిరణ్‌ని మనతో సమానంగా చూడలేం అని అంటాడు. మహాలక్ష్మి మాటలకు గిరిధర్, అర్చనలు వత్తాసు పలుకుతారు. జనార్థన్ కూడా ఆలోచించి కిరణ్ కూడా తనకు ఇష్టం లేదని అంటాడు.
అర్చన: ఆ డబ్బు అతను న్యాయంగా సంపాదించాడో అన్యాయంగా సంపాదించాడో ఎవరికి తెలుసు.
మహాలక్ష్మి: వాడు రేవతి మీద ప్రేమతో డబ్బు సంపాదించలేదు మన మీద పగతో సంపాదించాడు. వాడు రేపు రేవతిని మన మీద పగతో హింసిస్తాడు. మీరు మగాలు ఎలాంటి బాధ అయినా భరిస్తారు. కానీ రేపు వాడు మన రేవతిని చిత్ర హింసలు పెడితే నేను అర్చన తట్టుకోలేము. మహాలక్ష్మి నటనకు అర్చన కనీళ్లు పెట్టి గిరిధర్ వద్దు అని చెప్పడంతో జనార్థన్ కూడా రేవతిని కిరణ్‌కి ఇచ్చి పెళ్లి చేయనని అనేస్తాడు. ఈ విషయం రేవతికి జనార్థన్‌కే చెప్పమని మహాలక్ష్మి అంటుంది. ఈ పెళ్లి ఆపుతామని జనార్థన్ అంటాడు. కిరణ్ ఎదురు తిరిగితే వాడిని తన్ని తరిమేస్తానని గిరిధర్ అంటాడు.
సీత రామ్‌లు కారులో వస్తుంటారు. సీత రామ్ని చూస్తూ ఉంటుంది. తనని అలా చూడటం వల్ల డిస్ట్రబ్ అవుతున్నా అని రామ్ సీతతో చెప్తాడు. సీత రామ్‌ని పొగుడుతుంది. రాముడికి ఉన్న రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంది. రామ్ కూడా సీతని అమాయకపు సీత, కోతి అని రకరకాలుగా పిలుస్తాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా కారులో మాట్లాడుకుంటారు. ఇక పిన్ని, కిరణ్‌లకు త్వరగా పెళ్లి చేయమని సీత అంటుంది. మీ పిన్ని చేయనిస్తుందా అని అడుగుతుంది. తన పిన్ని తప్పకుండా ఒప్పుకుంటుందని రామ్ అంటాడు. ఇంతలో రామ్‌కి కాల్ రావడంతో ఆఫీస్‌కి వెళ్లిపోతాడు. సీతని ఆటోలో ఇంటికి వెళ్లమంటాడు. మరోవైపు రేవతి కిరణ్‌లు ఇంటికి వస్తారు. కిరణ్‌ని లోపలికి రమ్మని రేవతి పిలుస్తుంది. కిరణ్ వద్దు అన్నా రేవతి బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. మహాలక్ష్మి వాళ్లు మాట్లాడుకుంటారు. అందరూ వాళ్ల దగ్గరికి వస్తారు. ఏదో తేడాగా ఉందని చలపతి అనుకుంటాడు. ఇంతలో రేవతి కిరణ్ చేయి పట్టుకొని లోపలికి వస్తుంది. రేవతి కిరణ్ కి కాఫీ ఇస్తాను అంటే ఏం అవసరం లేదని జనార్థన్ అంటాడు.
జనార్థన్: అతను ఈ ఇంటికి ఎప్పటికీ అల్లుడు కాలేడు. మేం ఈ పెళ్లి చేయడం లేదు.
రేవతి: మొన్న అలా చెప్పి ఈ రోజు ఇలా అంటారేంటి.
గిరిధర్: మేం ఆరోజు కూడా ఒకే చెప్పలేదు.
అర్చన: సీత మమల్ని బలవంతంగా ఒప్పించింది.
కిరణ్: ఎందుకు వద్దు అంటున్నారో కారణం తెలుసుకోవచ్చా.
మహాలక్ష్మి: నీకు కారణం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
విద్యాదేవి: కారణం చెప్పకుండా ఎలా పెళ్లి ఆపుతారు.
రేవతి: కారణం నాకు చెప్పండి వదినా. కావాల్సినంత డబ్బు సంపాదించాడు కదా.
జనార్థన్: అతను డబ్బు సంపాదిస్తే ఎవరికి గొప్ప రేవతి. అతను ఆ డబ్బు ఎలా సంపాదించాడో ఎవరికి తెలుసు.
మహాలక్ష్మి: డబ్బు ఒక్కటి సంపాదిస్తే సరిపోతుందా. డబ్బు సంపాదిస్తే సరిపోతుందా.
జనార్థన్: నీ పుట్టు పూర్వొత్తరాలు ఏంటి. మీ అమ్మానాన్న ఎవరు. నీ అడ్రస్ ఏంటి.
గిరిధర్: ఊరు పేరు లేని నీ లాంటి అనామకుడికి మా చెల్లిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం అనుకున్నావ్.
మహాలక్ష్మి: ఎవరికీ పడితే వాళ్లకి ఈ ఇంటి అడ్రస్ ఎలా ఇస్తాం. అలా చేస్తే దారిన పోయిన ప్రతీ ఒక్కరికీ ఈ ఇళ్లు ధర్మసత్రం అవుతుంది.
రేవతి: నేను కిరణ్ ని ప్రేమిస్తున్నాను అన్నయ్య.
జనార్థన్: నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు.
మహాలక్ష్మి: ఈ పెళ్లి జరగదు.
సీత: జరుగుతుంది. ఇది నా మేనత్త సుమతి ఇళ్లు ఇది నా మేనత్త సుమతి కుటుంబం. నా మేనత్త ఇక్కడ ఉండి ఉంటే తన ఆడపడుచుకి ఏం కావాలో అది చేస్తుంది. తను లేదు కాబట్టే రేవతి వదినకు ఏం కావాలో అది చేస్తా.
మహాలక్ష్మి: ఏం చేస్తావే నువ్వు.
సీత: చూస్తారా ఇప్పుడే వస్తా ఆగండి.
సీత లోపలికి వెళ్లి దేవుడి దగ్గర దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి తాళి బొట్టులా రెడీ చేస్తుంది. దేవుడికి దండం పెట్టుకొని దాన్ని తీసుకెళ్లి అందరికీ చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. మీ కళ్ల ముందే కిరణ్ గారు రేవతి పిన్నికి తాళి కడతారు ఏం చేస్తారని అందరికీ సవాలు విసురుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.