Trinayani Today Episode పెద్ద బొట్టమ్మ మీద సుమన విసిరేస్తుంది. ఉలూచి పాదాలు కాలిపోయి ఎలా తయారయ్యాయో అలా సుమన పాదాలు మాడిపోవాలని పెద్దబొట్టమ్మ శాపం పెట్టి వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ భయపడతారు. సుమన మాత్రం పట్టించుకోదు. సుమన పాపని నయనికి ఎత్తుకోమని తన కాలు మంట పెడుతున్నాయని, తిమురొస్తుందని గంతులేస్తుంది. అందరూ సుమనకు శాపం తగిలిందని అనుకుంటారు. ఇంతలో సుమన తనకేం కాలేదని వెటకారంగా నవ్వుతుంది. అందరూ సుమనను హెచ్చరిస్తారు.


విక్రాంత్: పెద్దబొట్టమ్మ తెచ్చిన పాలను పాపకు వాడి ఉంటే తనకు నయం అయుండేదని ఇప్పటికీ నా మనసుకి అనిపిస్తుంది సుమన.
సుమన: నేను ఎవరి మాట నమ్మను అని మొన్ననే చెప్పాను కదా.
విక్రాంత్: తనలో నిజాయితీ తన కళ్లలో కనిపించింది. ఒకసారి పొరపాటు జరిగితే ఇంకోసారి అలా జరుగుతుందని ఎలా అనుకుంటావ్. ఉలూచి పాదాలు అలానే ఉండిపోతే ఏం బాగుంటుంది. 
సుమన: చూడండి ఆ ముసలి పాము గతసారి పసుపు తెచ్చి రాస్తే ఊరుకున్నానని ఈ సారి పాలు రాస్తే ఊరుకుంటాను అనుకున్నారా. 
విక్రాంత్: ఆలోచిస్తే అర్థమవుతుంది. కోట్ల ఆస్తి ఉన్న మా అమ్మే తన వల్ల ఇలా అయిందని డబ్బు ఇచ్చి సర్జరీ చేయించుకోమని చెప్పిందా ఏంటి. ఆ డబ్బే ఉంటే తన అందం కోసం వాడుతానని సుమన అంటే విక్రాంత్ ఒక్కటి కొడతాడు. పాప కంటే నీ అందమే ఎక్కువా అని అంటాడు. నయని వాళ్ల దగ్గర డబ్బు ఉందని తన పాపకి ఎందుకు సర్జరీ చేయించడం లేదని అంటుంది. విక్రాంత్ విసిగిపోయి పాప జీవితం నాశనం చేయకు అని చెప్పి వెళ్లిపోతాడు.


వల్లభ గదిలో ఉంటే ఆలోచిస్తూ ఉంటే తిలోత్తమ వచ్చి ఏమైందని అడిగితే సుమనని సపోర్ట్ చేసినందుకు తనని కూడా శపిస్తుందేమో అని భయంగా ఉందని వల్లభ అంటే తిలోత్తమ తనని ఏం పాము ఏం చేయదని నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అని భరోసా ఇస్తుంది. రేపు ఇంటికి విశాలాక్షి వస్తుందని తన గురించి ఆలోచించాలని అంటుంది. విశాలాక్షి రానుందని జాగ్రత్తగా ఉండాలని అంటుంది. నయని విశాల్‌లకు కూడా శాపగ్రస్తులుగా చేస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలని తిలోత్తమ అంటుంది. ఉదయం పావనా మూర్తి దురంధరకు సేవలు చేస్తాడు. ప్రెగ్నెంట్ కాబట్టి మామయ్య సేవలు చేస్తున్నారని అంటారు . ఇంతలో డమ్మక్క, విశాలాక్షిలు ఇంటికి వస్తారు. ఉత్సవాలకి వెళ్లి తిండి కోసం ఇక్కడికి వస్తారని సుమన అంటుంది. నయని, విక్రాంత్‌లు సుమనను తిడతారు. ఇక వల్లభ, సుమన వాళ్లు అన్నీ తెలుసు అని విశాలాక్షి అంటుంది కదా నిన్న ఏం జరిగిందో చెప్పమని అంటారు. దాంతో డమ్మక్క చేతుల మీద లెక్కలు వేసి వారం, తిథి, నక్షత్రం  చెప్తుంది. దాంతో విశాలాక్షి ఉలూచి పాదాలను నయం చేయడానికి వచ్చిన పెద్ద బొట్టమ్మని సుమన అవమానించగా పెద్దబొట్టమ్మ శాపం పెట్టిందని చెప్తుంది.  అందరూ షాక్ అయిపోతారు. ఇక ముందు రోజు దుష్టశక్తి ఉన్నా వారు బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్లు కంగు తిని వెళ్లిపోతారని చెప్తుంది. ఇక ఆ ముందు రోజు నయని కన్న బిడ్డకు గండం వస్తే దుష్టశక్తిని సంహరించిందని చెప్తుంది. అందరూ బిత్తర పోతారు. విశాలాక్షిని పొగుడుతారు. దురంధర విషయంలో ఏం జరిగిందో చెప్పమని విశాలాక్షిని తిలోత్తమ ప్రశ్నిస్తుంది. ఆ విషయం కరెక్ట్‌గా చెప్తే కాలు పట్టుకుంటానని వల్లభ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.    


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో సంయుక్త, జాను.. తల్లికి టెస్ట్ పెట్టాలనుకున్న లక్కీ, జున్నులు!