Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ జ్యోత్స్నలు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇద్దరూ చక్కగా రెడీ అయి కూర్చొంటారు. అందరూ ఇద్దరినీ చూసి ముచ్చట పడతారు. దీప కూడా మనసులో కార్తీక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అందరూ చాలా సంతోషపడతారు అని అనుకుంటుంది. ఇక శౌర్య కార్తీక్ దగ్గర కూర్చొంటాను అంతే జ్యోత్స్న వద్దు అనేస్తుంది. శౌర్యని సుమిత్ర పిలిచి తన దగ్గర కూర్చొ పెట్టుకుంటుంది. రెండు కుటుంబాలు తాంబూలాలు  మార్చుకోవడానికి రెడీ అవుతారు.


జ్యోత్స్న: బావ ఈ క్షణం ఈ ప్రపంచంలో అందరి కంటే నేనే ఎక్కవ సంతోషంగా ఉంటాను. ఇది నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క కల. తాంబూలం మార్చుకున్నారు అంటే మనకు సగం పెళ్లి అయిపోయినట్లే అని గ్రానీ చెప్పింది. కానీ నాకు మాత్రమే తెలుసు నీకు ఇది రెండో పెళ్లి అని.
కార్తీక్: ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న.
జ్యోత్స్న: కంగారు పడకు బావ. నేను పుట్టక ముందే నన్ను పెళ్లి చేసుకున్నావ్. ఇది మనకు రెండోసారి. ఇంత అదృష్టం ఏ ఆడపిల్లకి రాదు. 


తాంబూలం తీసుకోవడానికి రెడీ అయిన టైంకి నర్శింహ ఎంట్రీ ఇస్తాడు. ఇంతలో శౌర్య  అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమైందని దీప అడిగితే బూచోడు వచ్చాడని నర్శింహని చూపిస్తుంది. తనని తీసుకెళ్లిపోవడానికి బూచోడు  వచ్చాడని శౌర్య మేడమీదకు పరుగులు పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. నర్శింహ వెనకాలే అనసూయ కూడా వస్తుంది. దీప అత్తగారిని, భర్తని పిలిచావా సుమిత్ర అని పారిజాతం అడుగుతుంది. దానికి నర్శింహ అమ్మా నిశ్చితార్థం అంటూ నీ రాత అందరిలా ఉండదని అనుభవించు రాజా అని పాట పాడుతాడు. దీప నర్శింహ ముందుకు వస్తుంటే ఆపి గొడవ పడటానికి వచ్చావా అని అడుగుతుంది. 


నర్శింహ: మై డియర్ రిచ్ పీపుల్ నేను వచ్చింది మీ ఇంట్లో నిశ్చితార్థం చెడగొట్టడానికో మరెందుకో కాదు. నా మొగుడు వద్దని నన్ను వదిలేసిన నా పెళ్లంతో ఓ చిన్న పంచాయితీ ఉండి వచ్చా.
పారిజాతం: అలాంటి పంచాయితీలు ఉంటే బయటకు వెళ్లి తేల్చుకోండి. 
అనసూయ: ఏం లేదమ్మా మేం వచ్చింది మా మనవరాలి కోసం దాన్నితీసుకెళ్లడానికే వచ్చాం.
దీప: ఏంటి అత్తయ్య ఇది మా బతుకు మేం బతుకుతున్నాం మమల్ని వదిలేయండి.
అనసూయ: నువ్వు ఎలా అయినా పోవే కానీ అది మా ఇంటి రక్తం మా బిడ్డని మాకు ఇచ్చేయ్. 
సుమిత్ర: భార్యని ఉయ్యాలో బిడ్డని వదిలేసిన నీకు ఇన్నాళ్లకు కూతురు గుర్తొచ్చిందా ఈ ఆరేళ్లలో ఏమైపోయావురా. ఇప్పుడు ఏమంత ప్రేమ ముంచుకొచ్చిందని బిడ్డ కోసం నువ్వు మీఅమ్మ  వచ్చారు.
నర్శింహ: మిమల్ని చూస్తుంటే మీరు మీకు కాబోయే అల్లుడి మాట నిజం చేసేలా ఉన్నారు. శౌర్యకి తండ్రి నేను కాదు అంట మీ మనవడు అంట.
శివనారాయణ: రేయ్ ఏం కూసావురా
నర్శింహ: అన్నాడో లేదో నీ మనవడిని అడుగు పెద్దాయన అనలేదు అంటే నీ చెప్పుతో నన్ను కొట్టు.
పారిజాతం: అమ్మ వెధవ అనకూడని మాట అనేశాడు.
నర్శింహ: శౌర్య హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఈ దీప ముందే నన్ను అన్నాడు.


అందరూ నిజం చెప్పమని కార్తీక్‌ని అంటే కార్తీక్ అన్నాను అని ఒప్పుకుంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇక అనసూయ నర్శింహనే తిడుతుంది. అది నీ కూతురురా పద పాపని తీసుకొని వెళ్లిపోదామని అంటుంది. ఇక శ్రీధర్ కార్తీక్‌ని ఇక్కడ ఏం జరుగుతుందిరా అని అడుగుతాడు. ఇక అనసూయ శౌర్యని తీసుకొని రావడానికి వెళ్తుంది. నర్శింహ దీపని పట్టుకుంటాడు. అనసూయ శౌర్య దగ్గరకు వెళ్తుంది. నానమ్మ గొంతు విని శౌర్య అనసూయ దగ్గరకు వెళ్తుంది. ఇక శౌర్యని అనసూయ నాన్న వచ్చాడని అంటుంది. దాంతో శౌర్య నాన్న అని కిందకి వస్తుంది. గేటు వైపు చూస్తుంది. ఇక నర్శింహని చూసి బూచోడు అని అంటే తనే మీ నాన్న అని శౌర్యకి అనసూయ చెప్తుంది. మీ అమ్మ ఇన్ని రోజులు నీకు అబద్ధం చెప్పిందని తనే మీ నాన్న అని చెప్తుంది. బూచోడు మా నాన్న కాదు అని శౌర్య ఏడుస్తుంది. దీప దగ్గరకు వెళ్లి దీపని పట్టుకొని ఏడుస్తుంది. దీప ఏడుస్తుంది. అందరూ చెప్పమని దీపని అంటే వీడే మీ నాన్న అని దీప అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో సంయుక్త, జాను.. తల్లికి టెస్ట్ పెట్టాలనుకున్న లక్కీ, జున్నులు!