Seethe Ramudi Katnam Serial Today Episode రామ్, సీతకి ఏమైనా గొడవలు ఉన్నాయా అని పోలీసులు రామ్‌ని అడుగుతారు. దాంతో తమకు ఏం గొడవలు లేవని ఒకవేళ ఉన్నా సీత తనని వదిలి వెళ్లిపోదని రామ్ అంటాడు. ఇక రేవతి, చలపతిలు తమకు ఉష, ప్రీతిల మీద అనుమానంగా ఉందని అంటారు. డ్రైవర్‌ని పిలిచి ఏం జరిగిందో అడగమని చలపతి అంటాడు. మహాలక్ష్మీ వాళ్లు వద్దని అన్నా రామ్ డ్రైవర్‌ని పిలిచి అడుగుతానని అంటాడు. పోలీస్ డ్రైవర్‌ని తీసుకొని లోపలికి వస్తాడు.
రామ్ డ్రైవర్‌తో సీత కారు ఎందుకు దిగిందని అడుగుతాడు. త్రిలోక్ డ్రైవర్ మీద సీరియస్ అవుతాడు. రామ్ నేను నిజం చెప్పిస్తాను అని సీత ఎలాంటిదో నీకు తెలుసు కదా తను ఇప్పుడు కనిపించడం లేదు నిజం చెప్పు అంటాడు. దాంతో డ్రైవర్ జరిగింది అంతా చెప్తాడు. ప్రీతి వాటర్ కోసం సీతని దింపిందని సీత వెళ్లగానే కారు పోనిమ్మని తనకి బెదిరించారని సీత కారు వెనక చాలా సేపు పరుగెత్తారని కానీ వీళ్లు కారు ఆపొద్దని చెప్పారని అంటాడు. దాంతో జనార్థన్ పిల్లల మీద సీరియస్ అవుతాడు. సీతని ఎందుకు వదిలేశారని అడుగుతాడు. రామ్ కోపంతో ప్రీతి, ఉషలన్ని చితక్కొడతాడు. మహాలక్ష్మీ రామ్‌ని ఆపుతుంది. వీళ్ల స్థానంలో సీత ఉన్నా ఇలాగే చేసుండే వాడినని అంటాడు.
ఇక మహాలక్ష్మీ ఇద్దరినీ కొట్టి నిజం చెప్పండి అని అంటుంది. దాంతో రేవతి మీ నాటకం ఆపండి అని అరుస్తుంది. దాంతో ప్రీతి, ఉషలు వదినను ఏడిపించాలని అలా చేశామని వదిన ఇంటికి వచ్చేస్తుందని అలా చేశామని కిడ్నాప్ అవుతుందని అనుకోలేదని అంటారు. సీత అంటే ఇంట్లో అందరికీ ఎందుకు ద్వేషం అని రామ్ ఎమోషనల్ అవుతాడు. సీత మీద కోపం ఉంటే నాతో చెప్పాలి కానీ అలా వదిలేస్తారా అని అడుగుతాడు. నిన్ను కాపాడింది నీ పెళ్లి చేసింది కదా అని అంటాడు. సీత ఎక్కడుందో ఎలా ఉందో అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలీదని సీతకి ఏమైనా జరగరానిది జరిగితే ఎవరినీ వదలను అని రామ్ వార్నింగ్ ఇస్తాడు. రామ్ గదిలోకి వెళ్లి తన పెళ్లి నుంచి ఇప్పటి వరకు తనతో సీత బంధం గుర్తు చేసుకొని ఏడుస్తాడు. నా వల్ల నీకు ఎప్పుడూ సంతోషం లేదు సారీ సీత అని చెప్పకుంటాడు. సీతని గుర్తు చేసుకొని రామ్ చాలా ఏడుస్తాడు.
ఇక సీత రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతుంటే నాగు ఇటుక రాయితో సీత తల మీద కొట్టేస్తాడు. మామ అని అరుస్తూ సీత రామ్‌ని గుర్తు చేసుకొని కుప్పకూలిపోతుంది. సీత తల నుంచి రక్తం కారిపోతుంది. మూర్చపోయిన సీతని రౌడీలు లాక్కెళ్లి ఓ చోట పడేస్తారు. కాళ్లు చేతులు కట్టేయమని నాగు వాళ్లతో చెప్తే అవసరం లేదని చనిపోయిందని అంటారు. దాంతో నాగు ఇక్కడే పాతేసి వెళ్లిపోదామని అంటాడు. ఇక విద్యాదేవి గుడికి వెళ్లి సీత కిడ్నాప్ అయిందని పంతులుకి చెప్తుంది. పంతులు షాక్ అయి అపచారం జరిగిపోయిందని అంటాడు. విద్యాదేవి సీత చాలా మంచిది అని తనకు ఏమైనా అయితే దేవుడు ఎందుకు పూజలు ఎందుకు అని దేవుడి మీద నిందలు వేస్తుంది. అలా అనొద్దని కాపాడమని దేవుడిని కోరుకోమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్తారు. టీచర్ సరే అని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.