Satyabhama Serial Today Episode తన ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయిందని సంధ్య చాలా టెన్షన్ పడుతుంది. అక్కకి ఎలక్షన్‌లో సపోర్ట్ చేయలేదని రివేంజ్ తీసుకుంటుందని అనుకుంటుంది. ఇంతలో సంజయ్ సంధ్యకి కాల్ చేస్తాడు. సంధ్య సంజయ్‌ని తిడుతుంది. అక్కకి లవ్ మేటర్ తెలిసిపోయిందని అంటుంది. దాంతో సంజయ్ మీ అక్క నన్ను వార్నింగ్ ఇచ్చిందని.. ఇప్పుడు మీ ఇంటికే బయల్దేరిందని సునామీని ఎదురించడానికి సిద్ధంగా ఉండమని అంటాడు. సంధ్య చాలా టెన్షన్ పడుతుంది. దాంతో సంజయ్ మా పెద్దనాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్తాడు. సంధ్య చాలా సంతోషిస్తుంది.
మహదేవయ్య పెళ్లికి ఒక కండీషన్ పెట్టారని మీ అక్క ఎలక్షన్లో పోటీ చేయకుండా నువ్వే ఆపాలని అంటాడు. ఇక సత్య తన గురించి చెడుగా చెప్తుందని ఏం నమ్మొద్దని అంటాడు. పోటీ నుంచి తప్పుకోమని ఫోర్స్ చేయమని అంటాడు. ఇంతలో సత్య ఇంటికి వచ్చి సంధ్యని పిలుస్తుంది. సత్య కోపంగా సంధ్యని పిలుస్తుంది. అందరూ ఏమైందని అడిగితే అది వస్తేనే అన్నీ తేల్చుతానని సత్య అంటుంది. ఇంతలో సంధ్య వస్తుంది. సత్య సంధ్యని కొడుకుతుంది. ఏమైందని అందరూ అడుగుతారు.
సత్య: మనకు నమ్మక ద్రోహం చేస్తుంది. మనల్ని మోసం చేస్తుంది. మన అందరి కళ్లు కప్పి నా మరిది సంజయ్‌ని ప్రేమిస్తుంది. కంప్యూటర్ క్లాస్‌ల పేరు చెప్పి చెట్టాపట్టాలేసుకొని వాడితో తిరుగుతుంది.
విశాలాక్షి: అక్క చెప్పేది నిజమేనా.
సంధ్య: నిజమే నేను సంజయ్‌ని ప్రేమిస్తున్నాను. మేం పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నా. ప్రేమించడం తప్పు అయితే బావగారు చేసింది తప్పే. అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించడం తప్పా.
సత్య: ప్రేమించడం తప్పు కాదే నువ్వు ప్రేమించిన మనిషి కరెక్ట్ కాదు.
సంధ్య: అక్క సంజయ్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు.
నందిని: సంజయ్ అన్న తప్పుడు మనిషి అని నీకు ఎలా తెలుసు వదిన.
సంధ్య: కథలు అల్లుతుంది.
సత్య: సంధ్య నేను నీ మంచి కోరుకుంటానే నువ్వు నా చెల్లివే.
సంధ్య: నువ్వు చెప్పిందే నిజమైతే మా ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి చేయి.
సత్య: వాడు మంచోడు కాదు సంధ్య నాతో చెడుగా ప్రవర్తించాడు. మర్యాద లేకుండా మాట్లాడాడు. వాడి ఆగడాలు భరించలేక ఒక సారి కొట్టాను. అప్పటి నుంచి నా మీద పగ పెంచుకున్నాడు. నన్ను ఏం చేయలేక సంధ్య మీద ప్రేమ అనే నాటకం ఆడుతున్నాడు. సంధ్యని పెళ్లి చేసుకొని నరకం చూపిస్తాను అని నాతోనే చెప్పాడు.
సంధ్య: అమ్మానాన్న అక్క నాటకాలు ఆడుతుంది. సంజయ్ చాలా మంచోడు. అక్క గురించి నాకు ముందే చెప్పాడు. తను అన్నట్లే అక్క ప్రవర్తిస్తుంది. అక్క స్వార్థంతో ప్రవర్తిస్తుంది. నేను ఆ ఇంటి కోడలు కావాలి అంటే అక్క ఎన్నికల నుంచి తప్పుకోవాలని కండీషన్ పెట్టారు.
సత్య: నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకు ఎందుకు అలాంటి కండీషన్ పెడతారు. వాళ్ల టార్గెట్ నేను సంధ్య. నన్ను ఓడించడానికి నిన్ను బలి చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా. అమాయకంగా చెల్లి వాళ్లు ఉచ్చులో లాగుతుంది. అందరి జీవితాలు అయోమయంలో పడతాయి నాన్న. మనసులో సంజయ్ ఆ మహదేవయ్య కొడుకు అది నేను ఎలా చెప్పగలను చెప్పినా ఎవరు నమ్ముతారు.
సత్య ఎంత చెప్పినా సంధ్య వినదు. సంజయ్‌ని పెళ్లి చేసుకొని తీరుతానని ఎవరూ అడ్డుపడినా ఆగను అని తండ్రితో చెప్తుంది. దాంతో విశాలాక్షి కాళ్లు విరగ్గొడతానని రేపు సంబంధానికి ఒకే చేయాలని అంటుంది. ఇక సంజయ్ స్వీట్స్ తీసుకొని మహదేవయ్య దగ్గరకు వెళ్తాడు. సత్య ఎలక్షన్లో పోటీ పడదని సంధ్య అడ్డుకుంటుందని అక్కడ మంట పెట్టానని చెప్తాడు. ఇద్దరూ హ్యాపీగా స్వీట్స్ తింటారు. ఇంతలో ఇంటిళ్లపాది అక్కడికి వస్తారు. ఏంటి స్పెషల్ అని అడుగుతారు. దాంతో ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మహదేవయ్య అందరితో సంజయ్ ప్రేమలో పడ్డాడని చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. ఎవరు అమ్మాయి అని అడిగితే సత్య చెల్లి సంధ్య అని చెప్తే అందరూ షాక్ అవుతారు.
భైరవి సంజయ్‌ని తిడుతుంది. సత్యకి విషయం తెలుసా అని క్రిష్ అడిగితే మా పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్లిందని చెప్తాడు. ఇంతలో సత్య వస్తే క్రిష్ వెళ్లి స్వీట్ ఇవ్వమని చెప్తాడు. సంజయ్ సత్యకి స్వీట్ ఇస్తే సత్య దాన్ని విసిరి కింద కొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఓడిన వాడు మళ్లీ గెలవొచ్చు కానీ దిగజారిన వాడు ఎందుకూ పనికి రాడని నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుందని సంజయ్‌తో అంటుంది. సంధ్యతో నీ పెళ్లి జరగదు అని సంధ్యని మర్చిపో అని వార్నింగ్ ఇస్తుంది. సంజయ్ తమని విడదీయొద్దని అంటాడు. నీ పెళ్లాం మన ఫ్యామిలీనే అవమానించిందని రుద్ర క్రిష్‌తో అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సంధ్య ఫోన్ కాల్ వినేసిన సత్య.. సంజయ్‌కి వార్నింగ్.. కోడలికి ఉచ్చు బిగించిన మామ!