Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode ఇంటికి వచ్చిన ఆడబిడ్డకి సాయం చేయకుండా కన్నీరుతో పంపి అందరూ ఉండి అనాథని చేశారని సుమిత్ర భర్తతో చెప్పుకొని ఏడుస్తుంది. మీ చెల్లికి జరిగిన అవమానానికి ఎందుకు మామయ్యని ప్రశ్నించలేదని అడుగుతుంది. మీ చెల్లి స్థానంలో ఉండి ఆలోచించి ఉంటే తన గుండె కోత మీకు తెలిసేదని ఏడుస్తుంది. ఇక కార్తీక్ వాళ్లు ఇంటికి వస్తారు. దీపతో ఏ విషయం చెప్పొద్దని కార్తీక్ చెప్తాడు. వాళ్లు ఇంటికి వచ్చేసరికి చెల్లా చెదురుగా ఉన్న ఇంటిని ఓ మూల కూర్చొన్న దీపని చూసి ఏమైందని కార్తీక్ అడుగుతాడు. కళ్లు తిరిగినట్లు అనిపించి కూర్చొన్నాను అని దీప అంటుంది. ఇక కార్తీక్ వాళ్లతో మీరు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. 


కార్తీక్: అమ్మా వాళ్లు తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్తే తీసుకొస్తున్నా.
దీప: ఇందాకే మీ ఫ్రెండ్ వాళ్లు ఇంటికి వచ్చారు బాబు. పదండి వెళ్దాం.
కార్తీక్: మనసులో నేను చెప్పింది అబద్ధం అయితే ఇంటికి ఎవరు వచ్చారు. 
దీప: పదండి బాబు వర్ష వాళ్ల ఇంటి వెళ్లి శౌర్యని తీసుకొద్దాం.
కార్తీక్: ఇప్పుడు వద్దు దీప తర్వాత వెళ్దాం. శౌర్యని నేను తీసుకొస్తా.
దీప: ఎక్కడ నుంచి బాబు. నాకు శౌర్య ఇప్పుడే కావాలి నేను ఇప్పుడే చూస్తాను. పదండి వెళ్దాం. శౌర్యకి వీడియో కాల్ చేయండి.
కాంచన: మరీ ఇంత మొండి పట్టు ఏంటి దీప.
దీప: శౌర్య బలానికి మందులు వాడుతుందని చెప్పింది మీరే కదామ్మ మీతో తర్వాత మాట్లాడుతా. 
కార్తీక్: దీప పట్టుపట్టడంతో శౌర్య హాస్పిటల్‌లో ఉందని చెప్పేస్తాడు. ప్రాణాలతో పోరాడుతుంది. శౌర్య వ్యాధి గురించి చెప్తాడు. రెండు రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే శౌర్య బతకదు. 


దీప కార్తీక్ కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు మోసం చేశావ్ చెప్పు అని అడుగుతుంది. నా కూతురికి ఏమైనా అయినా ఇలాగే చేస్తావా అని అడుగుతుంది. దాంతో అనసూయ దీపని లాగిపెట్టి కొడుతుంది. కార్తీక్ బాబు నీకు ఎందుకు చెప్పాలి అని అడుగుతుంది. పాపని నువ్వు కని తల్లి అయితే కనకుండానే తాను తండ్రి అయ్యారని చెప్తుంది. ఆపరేషన్ డబ్బు కోసం తిండీతిప్పలు మానేసి సైకిల్ వేసుకొని ఊరంతా అప్పుకోసం తిరుగుతున్నాడని ఏడుస్తూ చెప్తుంది. దీప కూడా ఏడుస్తుంది. ఎదురు పడితే తన కళ్లు చూసి నువ్వు గుర్తు పడతావని చీకట్లో ఏడుస్తున్నాడని చెప్తుంది. కార్తీక్ బాబుని నిలదీసి అడిగే అర్హత నీకు లేదని అంటుంది. శౌర్య కార్తీక్ బాబు కూతురని ఏం చేసినా కార్తీక్ బాబుని ప్రశ్నించే హక్కు నీకు లేదని అంటుంది.


నీ అదృష్టం కాబట్టి ఇంత మంచి మనిషి దొరుకుతాడే అలాంటి వ్యక్తికి చేతులెత్తి దండం పెట్టకుండా కాలర్ పట్టుకొని నిలదీస్తావా అని అంటుంది. దాంతో దీప కార్తీక్ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తుంది. కార్తీక్ చేతులు పట్టుకొని నా ప్రాణం నా కూతురు అదే ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంటే ఎలా తట్టుకోగలను అని అంటుంది. దానికి కార్తీక్ అది నా కూతురు చావుని చంపి అయినా దాన్ని బతికిస్తాను అని అంటాడు. నీ చేతుల నుంచి తీసుకెళ్లిన నీ కూతుర్ని జాగ్రత్తగా నీ చేతుల్లో పెడతాను అని అంటాడు. రేపే శౌర్యకి ఆపరేషన్ అని డబ్బులు కట్టాలని అంటాడు.


చేతిలో చిల్లి గవ్వ లేదని గుండె వణుకుతుందని ఏడుస్తాడు. దీప పరుగున వెళ్లి వంట గదిలో తాను పోగేసిన డబ్బు కార్తీక్ చేతిలో పెడుతుంది. దీప ఇచ్చిన వందలతో శౌర్య బతకదు అని అంటాడు. తన తల్లి మనసు చంపుకొని పుట్టింటికి వెళ్లిన విషయం చెప్తాడు. ఆపరేషన్‌కి 50 లక్షలు కావాలి అని కార్తీక్ చెప్పగానే దీప కుప్పకూలిపోతుంది. నా కూతుర్ని చూడాలి అని దీప పరుగులు తీస్తుంది. కార్తీక్ వెనకాలే వెళ్తాడు. కాంచన, అనసూయలు ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. అనసూయ ఊరిలో ఇళ్లు అమ్మేస్తానని పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సంధ్య ఫోన్ కాల్ వినేసిన సత్య.. సంజయ్‌కి వార్నింగ్.. కోడలికి ఉచ్చు బిగించిన మామ!