Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు ప్రీతి, ఉషలకు కాల్ చేస్తారు. సీతని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు ఇంటికి వచ్చారని మీ ముగ్గురు కలిసి గుడికి వెళ్లారని సీతని వదిలేశారని రామ్ కోపంగా ఉన్నాడని చెప్పి ఇంటికి రమ్మని ఏం చేయాలో పోలీసులతో ఏం చెప్పాలో మహాలక్ష్మీ వాళ్లతో చెప్తుంది. ఇద్దరూ భయపడుతూ ఇంటికి బయల్దేరుతారు. పిల్లలు ఏం సమాధానం చెప్తారో అని అర్చన తెగ కంగారు పడుతుంది.
ఇక అర్చన ఎలాగూ ఫోన్ మన దగ్గరే ఉంది కదా నాగుకి కాల్ చేసి మనకు కాల్ చేయొద్దని చెప్పమని చెప్తుంది. ఇక త్రిలోక్ మహాలక్ష్మీ వాళ్ల దగ్గరకు వస్తాడు. దాంతో మహాలక్ష్మీ ఫోన్ కట్ చేసేస్తుంది. త్రిలోక్ ఫోన్ తీసుకొని వెళ్లిపోతాడు. నాగు ఇంకా ఫోన్ చేయలేదు అంటే వాడికి ఇప్పటికే పోలీస్‌ల గురించి తెలిసిపోయింటుందని అంటుంది. త్రిలోక్ మహాలక్ష్మీ వాళ్లని రమ్మని పిలుస్తాడు. సీత కట్లు విప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. కట్లు వీడిపోతాయి. సీతని చంపేయాలని రౌడీలు అనుకుంటారు. నాగు సరే అని సీత దగ్గరకు వెళ్తాడు. అందరూ సీత చుట్టు ముట్టి చంపేస్తామని సీతతోనే చెప్తారు. ఇక సాంబ రేవతికి కాల్ చేసి విషయం చెప్తే రేవతి ఇంటికి వస్తుంది.
మహాలక్ష్మీ: ఆగు నువ్వు ఎందుకు వచ్చావ్.
రేవతి: సీత విషయం తెలిసే వచ్చాను.
మహాలక్ష్మీ: నువ్వు ఇక్కడికి రావడమే వేస్ట్.
రేవతి: సీత మీకు ఎంత ముఖ్యమో మాకు అంతే.
మహాలక్ష్మీ: నువ్వు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఎవరికీ ఒరిగేది ఏంలేదు.
రేవతి: నేను రామ్‌ని ఓదార్చడానికి వచ్చాను.
మహాలక్ష్మీ: నీ ఓదార్పు ఎవరికీ అవసరం లేదు మొసలి కన్నీళ్లు కార్చడానికి వచ్చావ్.
జనార్థన్: మహా ఆగు ఈ టైంలో గొడవలు ఎందుకు.
రేవతి: సీతకి ఏం కాదు రామ్ ధైర్యంగా ఉండు. ఇది బయటవాళ్ల పని కాదు. ఇంట్లో వాళ్ల పనే.
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ రేవతి ఇంట్లో వాళ్లు అంటే ఏంటి నీ ఉద్దేశం.
అర్చన: నువ్వు మాకు శత్రువు అయ్యావ్ అని సీత అవుతుందని అనుకుంటున్నావా.
గిరిధర్: అయినా వాళ్లని శత్రువులు అనుకోవడం నీకు అలవాటు మాకు కాదు.
ఏసీపీ: ఏంటయ్యా ఈ ఫ్యామిలీ బయట నుంచి చూస్తే డీసెంట్ అనుకున్నా కానీ ఇంట్లో ఇన్ని గొడవలా.
త్రిలోక్: దూరపు కొండలు నునుపు అని ఊరికే అన్నారా సార్ ఈ మధ్య పెద్ద వాళ్ల ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలే జరుగుతున్నాయ్. మీడియాలో చూస్తున్నాం కదా సార్.
పోలీసుల మాటలు విన్న జనార్థన్ అందరినీ డీసెంట్‌గా ఉండమని చెప్తాడు. రేవతి వల్లే ఇదంతా అని మహాలక్ష్మీ అంటే రేవతిని ఏం అనొద్దని రామ్ అంటాడు. సీత వస్తే అందరి పని అయిపోతుందని రేవతి అంటుంది. ప్రీతి, ఉషలు వస్తే ఎవరూ మాట్లాడొద్దని నేనే మాట్లాడుతా అని రామ్
సీరియస్‌గా చెప్తారు. సీతని చంపడానికి రౌడీలు వెళ్తే సీత వాళ్లని కొట్టేసి పారిపోతుంది. ఇక ప్రీతి, ఉషలు ఇంటికి వస్తారు.
రామ్: సీతని ఎందుకు వదిలేశారు చెప్పండి.
మహాలక్ష్మీ: వాళ్లు నీ చెల్లెళ్లు రామ్ ఎందుకు అలా వాళ్లు మీద అరుస్తున్నావ్.
రేవతి: మీరు వదిలేయడం వల్లే సీత కిడ్నాప్ అయింది.
ఏసీపీ: మీరు ఆగండి మేం అడుగుతాం. చూడండి అమ్మా ఏం జరిగిందో చెప్పండి.
త్రిలోక్: మీరు ఏం దాచినా మాకు తెలుస్తుంది. నిజాలు మాత్రమే చెప్పండి.
ప్రీతి, ఉషలు మహాలక్ష్మీ కోసం అమ్మవారి గుడికి వెళ్లామని సీత నీటి కోసం వెళ్లి ఎంతకీ రాకపోవడంతో గుడికి వెళ్లి మొక్కు చెల్లించామని సీత వదిన ఇంటికి వచ్చేసుంటుందని వచ్చామని ఇంతలో అమ్మ కాల్ చేస్తే వచ్చామని అంటారు. ఇదే జరిగిందని ఏదీ దాయలేదని ప్రీతి, ఉషలు అంటారు. దాంతో ప్రీతి, ఉషలకు సంబంధం లేదని అంటాడు. సీత కిడ్నాప్ చేసిన వాళ్లు డబ్బు కోసం కాల్ చేయలేదని బంగారం కోసమే అయితే సీత బంగారం వేసుకోలేదని చలపతి చెప్తాడు. దాంతో ఏసీపీ ఇదంతా పర్సనల్ గ్రజ్‌తో చేశారని అంటారు. ఇక రేవతి ఇదంతా ఇంటి వాళ్ల పనే అని అంటుంది. దాంతో మహాలక్ష్మీ అనవసరంగా మా మీద ఇలాంటి నిందలు వేయొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.