Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కాంచన ఏడుస్తూ తన మనవరాలిని కాపాడమని కోరిన జ్యోత్స్న మాటలు విని శివనారాయణ నీ కొడుకుకి పుట్టిందా అని అడుగుతాడు. కార్తీక్ లోపలికి వచ్చి పారు కూడా నీలాగే అనుకొని ఉంటే మా అమ్మని మామయ్యని చక్కగా సాకేది కాదని అంటాడు. దానికి శివనారాయణ నీ జంట ఏదీ నువ్వు లేకుండా తను ఉండదు కదా ఇద్దరూ కలిసే అన్నీ చేస్తారు కదా ముందు నిన్ను పంపి తర్వాత తను వస్తుందా. గుమ్మం దగ్గర దాక్కుందా.. రామ్మ కార్తీక్ టిఫెన్ సెంటర్ ఓనర్ గారి భార్య మా వాళ్లని మా మీదకు రుసిగొలిపి మేం తన్నుకు చస్తే నువ్వు వినోదం చూస్తున్నావా అని దీపని తాత వెటకారంగా పిలుస్తాడు.


సుమిత్ర కార్తీక్‌తో దీప వచ్చిందా అంటే లేదని ముసలాయన కదా వయసు పెరుగుతుంటే ఇలా మాట్లాడుతున్నాడని అంటాడు. ఇక కాంచన డబ్బులు ఇవ్వమని అప్పుగా అయినా ఇవ్వమని రెండు చేతులు జోడించి చాలా ప్రాధేయపడుతుంది. కార్తీక్ వద్దని చెప్పినా వినదు బతిమాలు తుంది. దాంతో జ్యోత్స్న ఇదంతా అబద్దం అని దీప ఆడిస్తున్న నాటకం అని అంటుంది. పారు కూడా ఇదంతా నాటకం అని దీప రాకుండా మీరు రావడం ఏంటి అని అంటే కార్తీక్ వెళ్లిపోదామని అంటాడు. అయినా కార్తీక్‌ని కాంచన ఆపి తండ్రిని బతిమాలుతుంది. సుమిత్ర, దశరథ్, అనసూయ అందరూ తాతని బతిమాలుతారు. దాంతో తాత జ్యోత్స్నని చూస్తే జ్యోత్స్న వద్దని తలూపుతుంది.


శివనారాయణ: సరే సాయం చేస్తా. కానీ డబ్బులు మీకు ఇవ్వను. దీపని రమ్మను దీప చేతికి ఇస్తాను. అయ్యా ఇది సమస్య అని దీపని అడగమనండి. 45 లక్షలు కాదు కోటిఅయినా ఇస్తాను.
కాంచన: దీప రాలేదు నాన్న.
శివనారాయణ:  సమస్య తన కూతురికి అయితే తను రావాలి కదా. నిజానికి నీ కంటే ఎక్కువ తనే అల్లాడిపోవాలి కదా. మీ కంటే ఎక్కువ ప్రాధేయపడాల్సింది దీపే కదా.
కార్తీక్: విన్నావ్ కదా అమ్మ నా భార్య వచ్చి వీళ్లని ప్రాధేయపడాలంటూ.
జ్యోత్స్న: దీప ఎందుకు రాదు బావ.
కార్తీక్: ఎందుకంటే తనకి పాప అనారోగ్యం గురించి తెలీదు కాబట్టి. నిజం తెలిస్తే తట్టుకోలేదని మేమే చెప్పలేదు.
శివనారాయణ:  మరీ అంత వెధవల్లా కనిపిస్తున్నామా నీకు. దీప గారు ఎక్కడ బాధ పడిపోతారో అని చెప్పలేదంట. ఆ దీప మమల్ని మరీ ఇంత వెర్రి బాగుల్ని చేసింది ఏంట్రా.
కార్తీక్: శివనారాయణ గారు మీకో దండం. ఎంత కాలం ఇలా భ్రమలో బతుకుతారో బతుకండి. పసిదాని ప్రాణం కంటే మీకు మీ పంతాలే ఎక్కువ అయిపోయావా. అలాగే ఉండండి అమ్మ పద పాపని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా ప్రాణం అడ్డు పెట్టి అయినా కాపాడుతా.
అనసూయ: చంటిది హస్పిటల్‌లో ఉంటే నాటకం అంటున్నారు కదా చాలా బాధగా ఉందండి
శివనారాయణ: ఇదంతా నిజం అయితే దీపని రమ్మనండి నేను డబ్బులు ఇస్తాను.
కార్తీక్: చాలా అమ్మ ఇలాంటి మాటలతో వీళ్లు చంపేస్తారు మనల్ని కూడా.
కాంచన: నాన్న ఆశతో వచ్చాను నాన్న ఇలా అనొద్దు. 
శివనారాయణ:  అంటాను ఇంకా చాలా అంటాను. అది నీ కొడుకు కూతురు కాదు ఆ రౌడీ కూతురు ఇదంతా మీ నాటకం.
కాంచన: నాన్న నువ్వు పుట్టగతులు లేకుండా పోతావ్. అయ్యో నాన్నని ఇంత మాట అనేశానేంటి.
జ్యోత్స్న: ఆ వంట మనిషి కోసం మా తాతని ఇంత మాట అంటావా.
శివనారాయణ: జ్యోత్స్న ఇంకేం మాట్లాడొద్దు నేను కన్నది కూతుర్ని కాదు నా చావుని. ఇలాంటి కూతుర్ని కన్నుందుకైనా నేను పుట్టగతులు లేకుండా పోతాను.
కాంచన: నన్ను క్షమించు నాన్న ఏదో కోపంతో అనేశా.
పారు: ఎంత కోపం అయితే మాత్రం అంత మాట అంటావా.


కార్తీక్ తాతతో మీరు అన్న మాటలు కంటే మా అమ్మ అన్నది తక్కువే అని అంటాడు. ఇంకోసారి మా గుమ్మం తొక్కొద్దని శివనారాయణ అంటే అది ఇక జరగదు అని అవసరం వస్తే మీరు మా గుమ్మం తొక్కాలే కానీ మేం జీవితంలో ఈ గుమ్మం తొక్కము అని తల్లిని అనసూయని తీసుకొని వెళ్లిపోతాడు. సుమిత్ర చాలా ఏడుస్తుంది. మేం వచ్చామని నీకు ఎలా తెలుసు అని కాంచన అంటే అత్త కాల్ చేసి చెప్పిందని అంటాడు. ఇక జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్తుంది. దీపకి నిజంగానే విషయం తెలీదేమో అని అనుకుంటుంది. శౌర్య గురించి అడిగితే ఇంట్లో లేదని అంటుంది. కార్తీక్ బాబు వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో ఉందని దీప చెప్తే జ్యోత్స్న దీపకి నిజంగానే నిజం తెలీదని అనుకుంటుంది.


జ్యోత్స్న దీపతో తాను ఓ నిజం చెప్తాను అని గుండె ఆగిపోకుండా చూసుకో అని అంటుంది. విషయం ఏంటి అని దీప అడిగితే నీ కూతురు త్వరలోనే చచ్చిపోతుందని జ్యోత్స్న అంటుంది. దాంతో దీప జ్యోత్స్న గొంతు పట్టుకొంటుంది. దాంతో జ్యోత్స్న పాప హాస్పిటల్‌లో ఉందని చెప్తుంది. ఇంటిళ్లపాది నీతో అబద్దం చెప్పారని మీ అత్త మా అత్త డబ్బు కోసం మా ఇంటికి వచ్చారని బావ కూడా వచ్చారని తాత డబ్బు ఇవ్వలేదని చెప్తుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే బావ చెప్పిన ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి చూడు అక్కడ లేకపోతే హాస్పిటల్‌లో చూడు ఏ ఐసీయూలోనో ఉంటుందని అంటుంది. దీప నోట మాట రాకుండా చూస్తూ ఉండిపోతుంది. జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత దీప గుండె పగిలేలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!