Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ చనిపోలేదని ఇదంతా మహాలక్ష్మీ అత్తయ్య కావాలనే చేసినట్లుందని సీత చెప్తుంది. దాంతో విద్యాదేవి చనిపోయిన వాళ్లు కోసం అలా మాట్లాడొద్దని అంటుంది. సీఐ త్రిలోక్ మహాలక్ష్మీకి నమ్మిన బంటు అని తాను అబద్ధం చెప్పడని విద్యాదేవి అంటుంది. ఇంకెవరితో ఈ మాట అనొద్దని సీతతో చెప్తుంది. గతంలో తాను ప్రాణాలతో బయట పడినట్లు మహలక్ష్మీ కూడా ప్రాణాలతో బయట పడితే బాగున్ను అని విద్యాదేవి అలియాస్ సుమతి అంటుంది. కానీ సీత మాత్రం మహాలక్ష్మీ బతికే ఉంటుందని అనుకుంటుంది.


మహాలక్ష్మీ బతికే ఉంటుంది. మహాలక్ష్మీకి మహర్షి ఆయుర్వేద ఆశ్రమం దగ్గర వైద్యం అందిస్తుంటారు. మహాలక్ష్మీ మేలుకుంటే అంతా తెలుస్తుందని అప్పుడు అప్పగించొచ్చని అనుకుంటారు. ఇక జనార్థన్ సుమతి ఫొటో పక్కన మహాలక్ష్మీ ఫొటో పెట్టి దండలేసి ఉంటే జనార్థన్ ఇద్దరినీ చూస్తు బాధ పడుతుంటాడు. సీత, విద్యాదేవి చూస్తారు. విద్యాదేవి బాధపడుతుంది. మామయ్యని మీరే బాగుచేయాలని సీత చెప్తుంది.


సీత: మహాలక్ష్మీ అత్తయ్య నాతో మాట తీసుకుంది. నేను నిజం నిరూపించలేను. మీరు ఎవరు అన్నది నిరూపించుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన అవకాశం.
విద్యాదేవి: లేదు సీత మహాలక్ష్మీ బతికే ఉంటే నేను నిరూపించుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా చేస్తే నాది స్వార్థం అవుతుంది. 
సీత: స్వార్థం అవకాశం ఆ మహాలక్ష్మీ అత్తయ్యవి. తనే మామయ్యని మిమల్ని దూరం చేసింది.
విద్యాదేవి: ఏది ఏమైనా మహాలక్ష్మీ లేదు అన్న నిజం నేను జీర్ణించుకోలేను నాకు కొంత టైం కావాలి.


ఆఫీస్ నుంచి మ్యానేజర్ వచ్చి జనార్థన్‌ని కలుస్తారు. అందరూ బాధ పడుతున్నారని టెండర్ ఫైల్స్ కూడా ఎక్కడివి అక్కడే ఉన్నాయి అంటే జనార్థన్ రాను అని అంటాడు. ఇక ఇంట్లో అందరినీ పిలిచి ఆఫీస్ ఫైల్స్ చూసుకోమని అంటే గిరిధర్, అర్చన, చలపతి ఎవరూ మహాలక్ష్మీ లేకపోతే మా వల్ల కాదు అని అంటారు. రామ్ ఒక్కడినే చూసుకోలేను అని అంటాడు. దాంతో సీత విద్యాదేవి చూసుకుంటుందని చెప్తుంది. గిరి వాళ్లు వద్దు అంటాడు. దాంతో జనార్థన్ మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి విద్యాదేవితో కలిసి సీత, రామ్ పని చేస్తారని అంటాడు. విద్యాదేవి సీత వాళ్లతో కలిసి ఆఫీస్‌కి వెళ్తుంది. సీత అక్కడ అందరితో సుమతి మేడం అని పరిచయం చేస్తుంది. దాంతో రామ్ తాను విద్యాదేవి అని మహాలక్ష్మీ ప్లేస్ తీసుకుంటుందని అంటుంది. అందరూ సుమతిని గుర్తు చేసుకుంటారు. సీత మంచి పనే చేసిందని రామ్ అనుకుంటారు. ఇక రామ్ విద్యాదేవికి తన పిన్ని స్థానాన్ని చూపించమని రామ్ అంటాడు. సీత తీసుకెళ్లి విద్యాదేవిని మహాలక్ష్మీ ఛైర్‌లో కూర్చొపెడుతుంది. విద్యాదేవి ఆ ఛైర్ చూసి ఎమోషనల్ అవుతుంది. సీతని హగ్ చేసుకొని నా కోసం చాలా చేశావు థ్యాంక్యూ అని చెప్తుంది. సీత విద్యాదేవిని ఛైర్‌లో కూర్చొపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: నెత్తి పట్టుకున్న మహదేవయ్య.. చిన్న కోడలిని ఏం చేస్తాడు? కవ్వించి మడతెట్టేసిన సత్య!