Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర లక్ష్మీ కోసం కొంతమందిని పెళ్లి చూపులకు తీసుకొస్తుంది. నిశ్చితార్థం కూడా అయిపోతుందని చెప్తుంది. వసుధ, యమున రావడంతో లక్ష్మీకి పెళ్లి చూపులను చెప్తుంది. అబ్బాయి తన తండ్రి కంపెనీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడని నెలకు 16 వేలు జీతం వస్తుందని చెప్తుంది. యమున షాక్ అయిపోతుంది.
యమున: అదేంటి అమ్మ లక్ష్మీకి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏంటి తనతో ఒక మాట అయినా చెప్పాలి కదా.
సహస్ర: తనతో చెప్పకపోతే ఏమవుతుంది అత్తయ్య ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా మంచి సంబంధం అని తీసుకొచ్చా. తను కూడా ఒక కుటుంబానికి వెళ్లి కాపురం చేయాలి కదా. నేను లక్ష్మీ మంచి కోసమే కదా ఈ పని చేస్తున్నా. పాపం దిక్కూ ముక్కూ లేకుండా మన ఇంట్లో పడుంది. అందుకే ఇలా చేశా.
యమున: అది కాదు సహస్ర..
పద్మాక్షి: ఏంటి యమున ఇప్పుడు సహస్ర ఏదో తప్పు చేసినట్లు అన్ని దీర్ఘాలు తీస్తున్నావ్. లక్ష్మీకి మంచి దారి చూపించాలి అనే కదా నువ్వు విహారి ప్రయత్నించేది ఇప్పుడు సహస్ర కూడా అదే చేస్తుంది కదా సహస్ర నువ్వు వెళ్లి లక్ష్మీ తీసుకురా మీరు నాతో రండి.
లక్ష్మీ: సహస్రమ్మగారితో ఇంత మార్పు ఏంటి ఎందుకు నాకు ఇంత ఖరీదైన చీర ఇచ్చారు. ఎందుకు ఇప్పుడే కట్టుకోమన్నారు.
సహస్ర: లక్ష్మీ వావ్ ఎంత బాగున్నావో తెలుసా నిన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇప్పుడే తాళి కట్టేస్తారు. చాలా బాగున్నావ్ కానీ నేను నిన్ను ఇంకా అందంగా రెడీ చేస్తా రా కూర్చో అని సహస్ర లక్ష్మీకి మేకప్ చేస్తుంది. లక్ష్మీకి సహస్ర రెడీ చేసి చాలా అందంగా ఉన్నావ్ అని పొగుడుతుంది.
లక్ష్మీ: సహస్రమ్మ మీ మాటలకు అర్థం నాకు తెలీడం లేదు.
సహస్ర: ఒక సిస్టర్‌గా నీ బాధ్యత తీసుకుంటున్నా లక్ష్మీ అందుకే నీ భవిష్యత్ కోసం ఒక మంచి దారి వేయబోతున్నా. నీకు ఇంకా అర్థం కాలేదు అని నాకు అర్థం మైంది కిందికి వెళ్తే అన్నీ నీకే అర్థమవుతాయి పద.
లక్ష్మీని తీసుకొచ్చి ఆరు బయట జరుగుతున్న పెళ్లి చూపుల్లో సహస్ర కూర్చొపెడుతుంది. అబ్బాయి వాళ్లు చూసి అమ్మాయి బాగుంది అని అనుకుంటారు. ఇక లక్ష్మీతో సహస్ర పెళ్లి కొడుకు అని చెప్పి వాళ్లు గురించి చెప్తుంది. లక్ష్మీ షాక్ అయి లేచి నిల్చొంటుంది. నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశామని సహస్ర చెప్పగానే లక్ష్మీ బిత్తరపోతుంది. యమున కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. మరోవైపు విహారికి మీటింగ్‌కి అన్నీ ఏర్పాట్లు చేసి పిలుస్తారు. అబ్బాయి లక్ష్మీతో మాట్లాడుతాడు. అందరం కలిసే ఉంటాం అద్దె ఇళ్లు అని అది ఇదీ అంటాడు. ఇక సహస్ర మీ జంట బాగుంది అని లక్ష్మీతో చెప్పి నీకు కాబోయే అత్తవాళ్లకి నీ భర్తకి కాఫీ ఇవ్వు అంటుంది. ఇక యమున సహస్ర, లక్ష్మీని తీసుకెళ్లి మాట్లాడాలి అని చెప్తుంది. లక్ష్మీ ఇష్టముండాలి కదా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటేనే జీవితం బాగుంటుందని యమున సహస్రతో చెప్తుంది. విహారికి తెలీకుండా ఇలా జరగడం ఇష్టం లేదని విహారికి కాల్ చేస్తానని యమున అంటే సహస్ర టెన్షన్ పడుతుంది.
విహారి ఫోన్ రింగ్ అయినా మీటింగ్‌లో బిజీగా ఉండి ఫోన్ చూసుకోడు. లక్ష్మీని సహస్ర పెళ్లి చేసుకోమని అంటే లక్ష్మీ ఒప్పుకోదు. ఇష్టం లేదు అని చెప్తుంది. సహస్ర మాత్రం మొండికేస్తుంది. యమున ఎంత చెప్పినా సహస్ర వినకపోవడంతో పాటు మీ మాట వినే మా మామయ్య పైలోకాలకు పోయాడని అంటుంది. దాంతో యమున సహస్ర అని అరిచి చేయి ఎత్తుతుంది. ఇంతో పద్మాక్షి వచ్చి నా కూతురి మీద చేయి ఎత్తుతున్నావ్ ఏంటి అని అంటుంది. నోరు అదుపులో పెట్టుకో నా భర్త గురించి నా కొడుకు గురించి మాట్లాడితే తట్టుకోలేను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: నెత్తి పట్టుకున్న మహదేవయ్య.. చిన్న కోడలిని ఏం చేస్తాడు? కవ్వించి మడతెట్టేసిన సత్య!