Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు మాట్లాకుంటుంటే ప్రీతి, ఉషలు వచ్చి అందరితో మమల్ని తిట్లు తినిపించారు. అన్నయ్యతో దెబ్బలు తినిపించారు. మీరు సూపర్ అనుకుంటే ఇలా వేస్ట్ అవుతారని అనుకోలేదని అంటారు.
మహాలక్ష్మీ: నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే సీత శవం మీద పువ్వులు చల్లేవాళ్లం. అయినా ఏం పర్లేదు సీత మన నలుగురికి ఉమ్మడి శత్రువు. అది ఈ సారికి తప్పించుకుంది కానీ ఇంకోసారి తప్పించుకోలేదు.
ప్రీతి: సీత వదినను చంపాలి అన్నది మీ ప్లానా పిన్ని.
మహాలక్ష్మీ: ఏ మీకు ఏమైనా అభ్యంతరమా.
ఉష: అదేం లేదు పెద్దమ్మా మీరు ఏం చేసినా మాకు ఓకే.
మహాలక్ష్మీ: మీకు రామ్ కొట్టినందుకు మీతో సీతకు సారీ చెప్పించినందుకు నాకు చాలా బాధగా ఉంది. అలాంటి టైంలో కూడా మీరు నా పేరు పెట్టలేదు అందుకే మీకు చెరో లక్ష ఇస్తున్నా వెళ్లి షాపింగ్ చేసుకోండి.
అర్చన: మహా వాళ్లకేనా నాకేం లేదా.
మహాలక్ష్మీ: ఎంత కావాలి. చీపురు కట్ట ఉండాలి ఎక్కడ పెట్టాను.
అర్చన: మహా నాకు ఏం వద్దులే నేను వెళ్తాను.
సీత దేవుడి దగ్గర దండం పెట్టుకొంటుంటే రేవతి వచ్చి నువ్వు బతకడం చాలా సంతోషంగా ఉందని అంటుంది. దాంతో సీత నా కోసం వచ్చి నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉన్నందుకు థ్యాంక్స్ అని అంటుంది. ఇక రామ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని నీ కోసం అందరి ముందు ఏడ్చాడు.. వాళ్ల పిన్నిని ఎదురించాడు.. చెల్లెళ్ని కొట్టాడని నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని ఇక మీ ఇద్దరినీ ఎవరూ వేరు చేయలేరని అంటుంది. సీత చాలా సంతోషిస్తుంది. మామకి నేనేంటే ఇంత ఇష్టమా అని అనుకుంటుంది. రేవతి వెళ్లిపోయిన తర్వాత టీచర్ సీతని తీసుకెళ్లి దిష్టి చుక్కలు పెడుతుంది. రామ్ కన్న తల్లిని తిట్టడం నాకు బాధగా ఉందని సీత అంటుంది. ఇక టీచర్ సీతతో లలితకు ఫోన్ చేయిస్తుంది. లలిత సీతతో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది. మీ నాన్న లేరని నేను ఒక్కదాన్నే నరకం అనుభవించానని ఇకపై మీ అత్త ఏం చెప్తే అది విను అని అంటుంది. ఇక సీత తన కిడ్నాప్ వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని తనని చంపాలనే చూశారని కిడ్నాప్ కాదని చంపడమే ఉద్దేశమని సీత చెప్తుంది.
మరోవైపు శివకృష్ణ ఇంటికి రాగానే లలిత భర్తతో సీత కిడ్నాప్ విషయం చెప్తుంది. శివకృష్ణ షాక్ అయిపోతాడు. సీతని అలా వదిలేయడం ఏంటి ఇదేదో ప్లాన్‌లా ఉందని రేపే సీత దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తానని అంటాడు. ఇక రాత్రి సీత రామ్‌కి పాలు తీసుకొని వస్తుంది. టీచర్ వస్తుంది. రామ్ నీ కోసం చాలా భయపడ్డాడని రామ్ అంటే నీకు చాలా ఇష్టమని నువ్వు పెట్టిన అఖండ దీపం ఆరిపోయిన రామ్ మనసులో నీ ప్రేమ దీపం ఎప్పటికీ ఆరిపోదని మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత సీత మామ నేను నీకు అంటే అంత ఇష్టమా అని అడుగుతుంది. నేను కూడా నిన్ను తలచుకున్నానని నీ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సంధ్యని లాక్కెళ్లిన తల్లి.. నా జీవితం నా ఇష్టం అంటూ ఫైర్.. పోలీసులకు కంప్లైంట్!