Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపలు హాస్పిటల్ దగ్గరే ఉంటారు. దీప కార్తీక్‌తో ఆపరేషన్‌ని నాలుగు గంటల టైం ఉంది డబ్బు సర్దుబాటు అయిందా అంటే కార్తీక్ 4 లక్షలు కట్టానని చెప్తాడు. ఇంకా 41 లక్షలు కట్టాలని దీప చాలా కంగారు పడుతుంది. ఇంతలో నర్స్ వచ్చి పాప మీ కోసం ఏడుస్తుందని చెప్తే ఇద్దరూ పాప దగ్గరకు వెళ్తారు.


శౌర్య: ఇంటికి వెళ్లిపోదాం అమ్మా నాకు ఇక్కడ ఉండాలి అని లేదు నాన్న. స్కూల్‌కి వెళ్లాలి అని ఉంది. చాలా వర్క్ ఉంది.
దీప: ఇప్పుడు అవన్నీ ఎందుకు పడుకో ప్రశాంతంగా.
శౌర్య: పడుకుంటుంటే తాత కలలోకి వస్తున్నారమ్మా. తాత దగ్గరకు వెళ్లిపోతున్నట్లు కల వస్తుంది. నేను ఎక్కడికీ వెళ్లను అమ్మ నువ్వు నన్ను కలెక్టర్ అవ్వాలి అన్నావు కదా. నేను తాత దగ్గరకు వెళ్లిపోతే కలెక్టర్ ఎలా అవుతాను.
కార్తీక్: మనసులో దీని పరిస్థితి ఈ రోజు ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే నువ్వు రేపటి గురించి కలలు కంటున్నావా శౌర్య.
శౌర్య: నాన్న నేను కలెక్టర్ అవుతాను కదా. ఫొటోలో ఉన్నట్లు మన ముగ్గురం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నాన్న. ఉంటాం కదా.
కార్తీక్: నీ కలలు అన్నీ నాన్న తీర్చుతాడు రౌడీ.


కార్తీక్‌ని డాక్టర్ పిలుస్తారు. కార్తీక్ వెళ్తాడు. ఆపరేషన్‌కి నాలుగు గంటల టైం ఉంది స్పెషలిస్ట్‌లు వచ్చేస్తున్నారు ఇంకా డబ్బు కట్టలేదని డాక్టర్ కార్తీక్ మీద సీరియస్ అవుతాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి శౌర్య అలా కూల్‌గా మాట్లాడుతుంది ట్రీట్మెంట్‌ ఆపేస్తే నీకు పాప కండీషన్ తెలుస్తుందని అంటారు. నువ్వు నాకు తెలుసు అని అన్నీ ఏర్పాట్లు చేస్తున్నా అందరి ముందు నువ్వు నా పరువు తీసేలా ఉన్నావ్ ట్రీట్మెంట్ ఆపేస్తా అని డాక్టర్ అంటాడు. దాంతో కార్తీక్ డాక్టర్ కాళ్లా వేళ్లా పడి బతిమాలుతాడు. పాపని ఎలా బతికించుకుంటామో అని ఇద్దరూ ఏడుస్తారు.


కావేరి కూతురి ఇంటికి వచ్చి దాసుని చూస్తుంది. కాశీ అత్తయ్యతో తండ్రి కండీషన్ చెప్తాడు. ఇక కావేరి తల్లి కోసం కాఫీ తీసుకొస్తుంది. తన మామయ్య రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్తుంది. ఇక కావేరితో తన భర్త మామగారు ఎక్కడా అని అడుగుతుంది. ఇక ఇంతలో డోర్ కొట్టడంతో స్వప్ననే వెళ్లి డోర్ తీయమని చెప్తుంది. ఫ్రూట్స్ బుట్టతో శ్రీధర్ ఎదురు పడతాడు. శ్రీధర్ కస్సుబుస్సులాడుతాడు. కాశీ వచ్చి నమస్కారం మామయ్య గారు అంటే వచ్చాడండీ మర్యాద రామన్న అంటాడు. తల్లీ కూతురు తండ్రి మాటలతో సెటైర్లు వేసుకుంటారు. కాశీ కాఫీ తీసుకురమ్మని చేప్తే నాకు ఏం అవసరం లేదని దాసుని చూడటానికి వచ్చానని అంటాడు. కాశీ దాసు దగ్గరకు తీసుకెళ్తాడు. దాసు కండీషన్ తెలుసుకున్న దాసు అడిగితే ఏమైనా సాయం చేస్తానని అంటాడు. మీ సాయం రాదులే అని స్వప్న అంటుంది. 


ఇక కాంచన, అనసూయలు గుడికి వెళ్లి పాపని బతికించమని వేడుకుంటారు. పాపకి ఏం కాదని ధైర్యంగా ఉండమని పంతులు చెప్తాడు. పరిస్థితులు చేజారిపోయాయని కాంచన అంటే ఇష్టదైవానికి హోమం చేయమని సూచిస్తారు. కాశీ దశరథ్, సుమిత్రల్ని కలిసి పెద్దమ్మా, పెద్దనాన్న మీరు విన్నది నిజమే శౌర్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. బావ నేను చాలా ప్రయత్నించాం ఎక్కడా డబ్బు పుట్టడం లేదని కార్తీక్ ఏడుస్తాడు. దాంతో సుమిత్ర కాపాడమని భర్తని వేడుకుంటుంది. అంత డబ్బు నేను నాన్నకి తెలీకుండా ఇవ్వలేనని దశరథ్ అంటాడు.  సాయం చేయమని సుమిత్ర ఏడుస్తుంది. శౌర్యకి ఏమైనా అయితే దీప బతకదు అని చచ్చిపోతుందని అంటుంది. దీపకి టైం ఇచ్చిన జ్యోత్స్న దీప కాల్ కోసం వెయిట్ చేస్తుంటుంది. నానమ్మకి శౌర్య కండీషన్ గురించి చెప్తుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ సాక్షిగా సంజయ్, సంధ్యల పెళ్లి.. తలోదిక్కూ తలపట్టుకొని ఏడుపు.. సత్యకి నిజం తెలిస్తే!