Satyabhama Today Episode  ఉదయం నిద్ర లేచి సత్య కిచెన్‌లోకి వస్తుంది. అప్పుడే లేచేశావ్ ఎందుకు ఇది నీ అత్తారిళ్లు కాదు కదా కాసేపు పడుకో అంటుంది. దానికి సత్య క్రిష్‌ని తలచుకొని చిరాకు వేసి లేచేశా అంటుంది. విశాలాక్షి ఏమైందని అడగటంతో ఈరోజు ఉగాది కదా అందుకే లేచానని బదులిస్తుంది. ఇక క్రిష్‌ని లేపమని విశాలాక్షి చెప్తే మొగుళ్లు పడుకుంటేనే ప్రశాంతంగా ఉండొచ్చని అంటుంది.


 ఇంతలో శాంతమ్మ అక్కడికి వచ్చి ఈ మధ్య నీకు వెటకారాలు ఎక్కవయ్యాయని మనవరాలికి చురకలేస్తుంది. అందరూ నవ్వుకుంటారు. ఇక క్రిష్‌కి కాఫీ ఇచ్చి లేపమని విశాలాక్షి చెప్తుంది. దీంతో సత్య చిరాకుగా గదికి వెళ్తుంది. క్రిష్ చెవి దగ్గర గంట కొడుతుంది. 


క్రిష్: గంట కొట్టడం ఏంటే చెయి ఏమైంది.. నోరు ఏమైంది.
సత్య: చేతితో లేపితే ప్రేమ అంటారు అది నా దగ్గర లేదుగా అందుకే ఇలా.. 
క్రిష్: టార్చర్‌ పెడుతున్నావ్ కదనే.. అనవసరంగా నీతో కాంప్రమైజ్ అయ్యా లేదంటే ఈపాటికి మా ఇంటికి వెళ్లిపోతుండే..
సత్య: లేచి నీ పనులు నువ్వే చేసుకో నీ వెనకాలే తిరుగుతూ నీ పనులు చేయడానికి నాకు టైం లేదు ఇంట్రస్ట్ లేదు. పైగా నా పెళ్లాం పోస్ట్ పీకేశా అన్నావ్ కదా..
 క్రిష్: రాత్రేమో బెడ్‌షీట్ లాగేసింది. ఇప్పుడు ఇలా నువ్వు నాతో ఆడుకోవడం కాదు నేనే నీతో ఆడుకుంటా. నా వెనక వెనక ఉరికి పిస్తా చూడు. అని క్రిష్ సత్య లిప్‌స్టిక్ తీసుకొని సత్య ముద్దు పెట్టుకున్నట్లు బుగ్గ మీద, మెడ మీద పెట్టకుంటాడు. కావాలనే అలాగే బయట సత్య దగ్గరకు వెళ్తాడు. 


క్రిష్: లోపల చేయాల్సింది అంతా చేసేసి ఇక్కడ ఏం తెలీనట్లు ఉన్నావ్ ఏంటి.
సత్య: ఏయ్ నేనేం చేశాను.
క్రిష్:  ఏం చేయలేదా.. బాగా గుర్తు తెచ్చుకో అని సత్య ముద్దు మార్క్‌లు చూపిస్తాడు. నువ్వు చేసిన పనిని నా నోటితో చెప్పించాలి అని అనుకుంటున్నావ్.
సత్య: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను చిలిపి పనులు చేయడం ఏంటి.
క్రిష్: సరే అయితే నేనే యాడ్ చేస్తా.. ఇందాక నువ్వు రూంలోకి కాఫీ తీసుకొచ్చావా లేదా.. అప్పుడు ఏమైంది అంటే కాఫీ చిప్ చేసి చల్లగా ఉంది అన్నాను. అప్పుడు నువ్వు వేడిగా కావాలా అన్నావ్. నేను కావాలి అన్నాను. నువ్వు రెండు ముద్దులు పెట్టేసి పాత సినిమా హీరోయిన్‌లా పరుగున బయటకు వచ్చేశావ్. ఇవే ఆ ముద్దులు..
సత్య: అబద్దాలు చెప్పకు. నిన్ను ముట్టుకోడానికే ఇష్టపడను. మరి ముద్దు ఎలా పెడతాను. 
క్రిష్: నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు ముద్దు పెడతారు. అంత ధైర్యం ఎవరికి ఉంది. 
సత్య: ఆ ముద్దులు నావి కావు.. నువ్వే లిప్స్టిక్‌ రాసుకొని వచ్చి నాటకం ఆడుతున్నావ్.
క్రిష్: అబ్బా సీఐడీలా ఎంత బాగా గుర్తుపట్టావ్. నీలా మీ ఇంటి వారు కూడా గుర్తుపడతారా లేదా చూద్దాం పద..


సత్య వద్దు అన్నా క్రిష్ శాంతమ్మ దగ్గరకు వెళ్లి కూర్చొంటాడు. కాఫీ బాగుందా అని అడుగుతాడు. శాంతమ్మ ముద్దు మార్క్‌లు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. ఇక సత్య క్రిష్‌ని రమ్మని సైగ చేస్తుంది. ఇంతలో సంధ్య వస్తే క్రిష్ కావాలనే సంధ్య ముద్దు మార్క్‌లు చూసేలా చేస్తాడు. సంధ్య తన అక్క దగ్గరికి వెళ్లి అక్క ఏమో అనుకున్నాకానీ నీలో కూడా ఓ రొమాంటిక్ యాంగిల్ ఉందని అంటుంది. ఇక విశాలాక్షి కూడా చూసేస్తుంది. 


సత్య కంగారు పడి తన భర్తని గదికి తీసుకెళ్లడానికి వస్తుంది. అప్పుడు క్రిష్ సత్యతో అందరూ అయిపోయారు మామ ఒక్కడే ఉన్నాడు. మామకు కూడా చూపిస్తా ఎక్కడున్నాడు అని అడుగుతాడు. సత్య నవ్వుతూ కవర్ చేసి క్రిష్‌ని లోపలికి తీసుకెళ్లిపోతుంది. మరోవైపు సత్య ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. మార్కెట్‌ నుంచి వచ్చిన విశ్వనాథం సత్యతో బాగా ముగ్గు వేశావని అంటాడు. ఇక కిచెన్‌లోకి వెళ్తే విశాలాక్షి భర్తలో జరిగింది చెప్తుంది. 


విశ్వనాథం: ఏది ఏమైనా ఈ ఉగాది మనకు చాలా తృప్తిని ఇస్తుంది విశాలా.. అల్లుడు, సత్యని పండక్కి పిలవడం వల్ల వాళ్లు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో మనకు తెలిసింది.
విశాలాక్షి: అవును. మనకు ఉన్న అనుమానాలు అన్నీ తీరిపోయాయి. మన కళ్లు ముందు వాళ్లు ఇలా చిలకాగోరింకల్లా ఉంటుంటే చాలా సంతోషంగా ఉంది. 


ఇక క్రిష్ సత్య దగ్గరకు వచ్చి ముగ్గు బాగుంది అంటాడు. సత్య ఏం సమాధానం చెప్పదు. థ్యాంక్స్ చెప్పమని క్రిష్ అంటే నువ్వు చేసిన చిరాకుకు కోపం వస్తుందని అంటుంది. దీంతో క్రిష్ నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా.. నువ్వు కోపంతో ఉంటే నేను కోపంగా ఉంటా అంటాడు. ఇక సత్య నీ పొడత్తలకు నేను పడను అనడంతో క్రిష్ పక్కనే ఉన్న నీళ్లను సత్య ముగ్గు మీద వేసేస్తాడు. 


సత్య: ఏయ్ ఏం చేశావ్ నువ్వు..
క్రిష్: పొగిడినప్పుడు తీసుకోవాలి. పొగరుగా సమాధానం ఇస్తే ఇలాగే ఉంటుంది. కష్టపడి వేసిన ముగ్గు చెరిగిపోతేనే తట్టుకోలేకపోతున్నావు. ఇష్టపడిన నా ప్రేమను చెరిగిపోయేలా చేస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది. 


ఇంతలో క్రిష్‌కు నలుగు పెట్టాలని సత్యను విశాలాక్షి పిలుస్తుంది. దీంతో సత్య నీ కోసం స్పెషల్‌గా నలుగు పిండి కలుపుతా అని క్రిష్‌ని ఏడిపించాలని ప్లాన్ చేస్తుంది. అందుకు సున్నుపిండిలో కారం కలిపేస్తుంది. క్రిష్ సత్య తనకు నలుగు పెడుతుందని సంతోషంగా పాటలు పాడుకుంటాడు. ఇంతలో సత్య అక్కడికి వస్తుంది. విశాలాక్షి, సంధ్య, విశాలాక్షిలు కూర్చొంటారు. సంధ్య సత్యను ఆటపట్టిస్తుంది. కావాలనే క్రిష్ సిగ్గుపడినట్లు నటిస్తాడు. 


ఇక సత్య క్రిష్ తలకు ఆయిల్ రాస్తుంది. తర్వాత క్రిష్ నీ పని అవుట్ అని కారం కలిపిన నలుగు క్రిష్‌కి రాసేస్తుంది. క్రిష్‌కి మంట రావడంతో అప్పుడు వరకు సరదాగా ఉన్న క్రిష్‌ మండుతుందేంటి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపను అడ్డుకున్న సుమిత్ర, కార్తీక్‌తోనే రివేంజ్ మొదలన్న నర్శింహ.. కార్తీక్‌కు జ్యోత్స్న స్వీట్ వార్నింగ్!