Krishna Mukunda Murari Today Episode భవాని దగ్గరకి రేవతి వచ్చి మీరాతో ఆదర్శ్ పెళ్లి గురించి ఏం ఆలోచించావ్ అక్క అని అడుగుతుంది. ఆ మాట వినగానే భవాని రేవతిని తిడుతుంది. కృష్ణ బాలేదు అని టెన్షన్‌గా ఉంటే ఇప్పుడు పెళ్లి గురించి ఏంటని అంటుంది. దీంతో రేవతి మరేం చేయమంటావు అక్క ఆదర్శ్ నన్ను ఉంచడం లేదని ఏమైనా అంటే తనని ఎవరూ పట్టించుకోవడం లేదు అంటున్నాడు అని చెప్తుంది.
భవాని: ఈసారి అలా అంటే వాడి దవడ పగలగొట్టు. అయినా కృష్ణ అంటే వాడికి ఎందుకు అంత కోపం అయినా అదేం చేసింది పాపం.
రేవతి: ఏమో అక్క మొన్నటి వరకు మురారితో గొడవ పడ్డాడు. ఇప్పుడు మురారితో బాగానే ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు కృష్ణ మీద కోపంగా ఉన్నాడు.
భవాని: అరే ఉంటే ఇద్దరి మీద కోపం ఉండాలి కదా. ఒకరి మీద ఉండి మరొకరి మీద ఉండకపోవడం ఏంటి. అయినా వాడికి ఏదైనా కోపం ఉంటే ముకుంద మీద ఉండాలి కదా.. తను పోయింది అని ఆ కోపం ఉన్నవాళ్ల మీద చూపిస్తే ఎలా.. అసలు వాడు ఎప్పుడు ఎలా మారుతాడో ఎప్పుడు ఎవరి మీద ప్రేమ పుడుతుందో ఎవరి మీద కోపం వస్తుందో తెలీదు అందుకే మీరాతో పెళ్లి అంటే ఆలోచిస్తున్నాను. వాడు అడిగాడు కదా అని ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసి తర్వాత ఏమైనా జరిగితే ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పట్లో ఏ నిర్ణయం తీసుకోలేను. అసలు ముందు వాడికి కృష్ణ మీద కోపం ఎందుకు ఉందో అది తేలాలి. తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుదాం.
రేవతి: సరే అక్క.
మురారి: (దేవుడికి దీపం పెడుతూ..) నా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇలా చేశావ్ అని నిన్ను అడగలేదు స్వామి. నా ఖర్మ ఇంతే అని ఊరుకున్నా. కానీ ఈ రోజు కృష్ణ పరిస్థితి చూసి నిజం చెప్పలేను. చెప్పకుండా ఉండలేను. చెప్తే ఏమైపోతుందా అని భయం వేస్తుంది. అసలు కృష్ణకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావ్. తనకి ఎలా నిజం చెప్పాలి. ఎలా ధైర్యం చెప్పాలి. ఎలా ఓదార్చాలి నాకు ధైర్యం ఇవ్వు తండ్రి.
ముకుంద: మనసులో.. పాపం ఏం కాలేదు అని కృష్ణకు చెప్పి నిజం ఎలా చెప్పాలా అని దేవుడికి మొర పెట్టుకుంటున్నట్లు ఉన్నాడు. ఏంటి మురారి గారు నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏరోజు మీరు దేవుడి దగ్గరకు రావడం చూడలేదు. ఈ రోజు ఏంటి కొత్తగా..
మురారి: అలా ఏం లేదు వస్తూ ఉంటాను. బహుషా నువ్వు గమనించి ఉన్నట్లు లేవు.
ముకుంద: మిమల్ని చూసినా అంతా బాగున్నట్లే కనిపిస్తారు. కానీ లోపల దేని కోసం ఎంత మదన పడతారో మీకు మాత్రమే తెలుస్తుంది. కదా.. అంటే.. ఇప్పుడు మీరు మదన పడుతున్నారు అని కాదు. జస్ట్ జనరల్‌గా చెప్తున్నా అంటే. మురారి గారు నాకు ఓ ఫ్రెండ్ ఉంది. తనకు క్యాన్సర్. అందుకే మొక్కుకోవాలి అని వచ్చాను. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే తనకి క్యాన్సర్ అని నాకు మాత్రమే తెలుసు. తనకి తెలీదు. ఎలా చెప్పాలా అని మదనపడ్డాను.
మురారి: మనసులో.. ఇది ఏదో నా పరిస్థితిలాగే ఉందే..
ముకుంద: చివరకు ఓ నిర్ణయానికి వచ్చాను. ఎంతో ఆలోచించాను అదే మంచిదనిపించిది. తనని కలవడం మానేశాను. పూర్తిగా దూరం పెట్టేశాను.
మురారి: అదేంటి దూరం పెట్టడం అంటే మేలు చేసినట్లు ఎలా అవుతుంది.
ముకుంద: బాగా ఆలోచించండి.. ఒక్కోసారి వదిలేయమే మేలు చేయడం. మీకు అర్థం కాలేదా.. ఇప్పుడు నేను రోజు తనని కలిసి మాట్లాడితే ఏదో ఒక క్షణం బాధ తట్టుకోలేక నిజం చెప్పేస్తాను. అప్పుడు తాను అది ముందే ఆలోచించి నాలుగు రోజుల ముందే చనిపోతుంది. అందుకే విషయం చెప్పకపోతే చనిపోతుంది అని తెలీక బతికినన్ని రోజులు సంతోషంగా ఉంటుంది. అందుకే బాధగా ఉన్నా సరే తను క్షేమంగా ఉండాలి కోరుకుంటున్నా. దగ్గరగా ఉండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి తనని సంతోషంగా చూసుకోవడం బెటర్ కదా..
మురారి: మనసులో.. మీరా చెప్పేది కూడా కరెక్టే. ఎంత దగ్గరగా ఉంటే అంత తొందరగా నిజం చెప్తేస్తాను. ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికే వరకు దూరంగా ఉంటాను.
ముకుంద: ఆలోచిస్తున్నాడు అంటే ఆచరిస్తాడు.. కన్ఫమ్ ఇక కృష్ణకు దూరంగా ఉంటాడు. కృష్ణ ఇక చూసుకో రోజు రోజుకీ నీ నుంచి మురారిని ఎలా దూరం చేస్తానో..
ఇంతలో కృష్ణ నిద్రలేచి మురారి కోసం వెతుకుతుంది. మురారి రావడంతో ఏంటి ఏసీపీ సార్ ఇంత తొందరగా నిద్ర లేచి స్నానం చేసేశారు.. నన్ను నిద్ర లేపలేరు అని అంటుంది.
కృష్ణ: ఇక మనకు ఏ టెన్షన్ లేదు ఏసీపీ సార్ పెద్దత్తయ్య కోరిక తీర్చడం తప్పు. (మురారి డల్‌గా ఉండటం చూసి) హలో ఏసీపీ సార్ ఈ మాట అనగానే నన్ను గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పుతారు అనుకుంటే అలా శూన్యంలోకి చూస్తారేంటి. (కృష్ణ మురారి మెడ మీద చేతులు వేసి దగ్గరగా వెళ్తుంది. ) ఏమైంది ఏసీపీ సార్ మీకు ఒంట్లో బాగానే ఉంది కదా..
మురారి: బాగానే ఉంది ఇప్పటికే ఆలస్యం అయింది నువ్వు ఫ్రెష్ అయిరా..( నేను నీకు దగ్గరగా ఉండాలి అన్నా కలిసి కాసేపు సరదాగా ఉండాలి అన్నా భయంగా ఉంది కృష్ణ ఎక్కడ నీకు నిజం చెప్తేస్తానా అని.. )
మరోవైపు మురారి డాక్టర్ పరిమళను కలుస్తాడు. తనకు పిచ్చిఎక్కుతుంది చచ్చిపోవాలని ఉందని అంటాడు. దీంతో పరిమళ చచ్చిపోరా.. అని అంటుంది. మురారి షాక్ అయితే పరిమళ మురారికి క్లాస్ ఇస్తుంది. మురారి నిజం చెప్పేస్తాను అనే భయంతో తప్పించుకొని తిరుగుతున్నాను అని అంటాడు. పరిమళ నిజం చెప్పేయ్ మని అంటుంది. కనీసం ఇంట్లో వాళ్లకి అయినా చెప్పమని అంటుంది. దీంతో మురారి అది తన వల్ల కాదు అని ఇంట్లో ఎవరూ తట్టుకోలేరు అని చెప్పలేను అని అంటాడు.
పరిమళ: నాలుగు రోజులు ఆగి కృష్ణను హాస్పిటల్‌కి తీసుకురా. కడుపులో గడ్డ ఉందని ఆపరేషన్ చేసి నేను అమెరికా వెళ్తాను.
మురారి: అయితే అమెరికాలో ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది.
పరిమళ: అంటే ఏంటి అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తే కృష్ణకు పిల్లలు పుట్టేస్తారా. అలాంటి అవకాశం ఉంటే నేను తీసుకెళ్లేదాన్నికదా.. వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకండా కృష్ణకు నిజం ఎలా చెప్పాలో అది ఆలోచించు..(సారీరా మురారి నేను కూడా నీతో బాధగా మాట్లాడితే మరింత కుమిలిపోతావని ఇలా మాట్లాడుతున్నా)
కృష్ణ: మనసులో.. ఏమైంది ఏసీపీ సార్‌కి ఎందుకు అలా ఉన్నారు. టిఫిన్ కూడా చేయకుండా వెళ్లారు. పోనీ నాకు ఏమైనా అయింది అంటే పరిమళ అంతా బాగానే ఉంది అని చెప్పింది కదా.. ఇక రేవతి వచ్చి కృష్ణతో మాట్లాడుతుంది. కృష్ణ గురించి భవాని అన్న మాటలు చెప్తుంది. భవానికి నువ్వంటే ప్రాణమని.. నువ్వు ఆవిడకి ఏమైనా ఇవ్వగలవు అంటే అది కేవలం ఆవిడ కోరికను తీర్చడమే.
కృష్ణ త్వరలోనే ఆ కోరిక తీర్చుతాను అంటుంది. ఇంతలో ముకుంద వచ్చి రెండు బొమ్మలు పట్టుకొని అత్త కోరికను త్వరలోనే తీర్చాలి అని అంటుంది. ఆదర్శ్ దూరం నుంచి చూస్తాడు. ముకుంద ప్రవర్తన అర్థం కావడం లేదని.. తనకి కృష్ణ మంచిది కాదని చెప్పిన ముకుంద కృష్ణతో ఇంత ప్రేమగా ఉందేంటి అని అదంతా ముకుంద మంచి తనం అని తనని అస్సలు వదులుకోకూడదు అనుకుంటాడు..
మరోవైపు మురారి కృష్ణకు విషయం చెప్పాలి అనుకుంటాడు. అయితే దానికి తనకు ధైర్యం సరిపోవడం లేదు అనుకుంటాడు. ఇక కృష్ణ ముకుంద ఇచ్చిన బొమ్మలు పట్టుకొని వచ్చి మురారికి చూపిస్తుంది. మురారి కృష్ణకు అవౌడ్ చేస్తాడు. మీరా బొమ్మలు ఇచ్చిందని.. హాల్‌లో జరిగింది చెప్తుంది. వారసుడ్ని ఇస్తాను అని అంటుంది. మురారి బాధ పడతాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: బెడిసికొట్టిన తిలోత్తమ పౌడర్ ప్లాన్.. తింగరి చేష్టలతో తారుమారు చేసేసిన హాసిని!