Prema Entha Madhuram July 26th: సత్తెమ్మ మాన్సీకి తను మర్డర్ చేశాను అని చెప్పటంతో భయపడిపోతుంది మాన్సీ. అంతేకాకుండా తను గతంలో చేసిన నేరాలు గురించి మొత్తం చెబుతుంది. ఇక అక్కడున్న వాళ్లు కూడా తన మాట వింటారు అని అక్కడున్న ఒక కానిస్టేబుల్ తో బిర్యాని తీసుకొని రమ్మని అంటుంది. ఇక నువ్వేం తప్పు చేశావు అనటంతో తన మీద తప్పులేదు అన్నట్లుగా చెబుతుంది మాన్సీ.


కానీ సత్తెమ్మ తన మాటలు నమ్మదు. అంతే కాకుండా ఆస్తి గురించి ఏదో తప్పు చేసావేమో అని అంటుంది. ఇక తనకు చేతులు నొక్కమని అనడంతో నేను నొక్కను అని అనటంతో వెంటనే తను గట్టిగా అరుస్తుంది. దాంతో భయపడి మాన్సీ తన చేతులు నొక్కుతుంది. ఇప్పుడే బిర్యానీ రావడంతో తినిపించమని అంటుంది. దాంతో మాన్సీ ఆమెకు భయపడి తినిపిస్తుంది.


మరోవైపు శారదమ్మ భాను వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక తనతో మా కుటుంబాన్ని కాపాడినందుకు థాంక్స్ అని చెప్పి లోపలికి పిలుస్తుంది. ఇక ఇంట్లోకి అడుగుపెట్టేముందు పిల్లలతో వచ్చింది అని దిష్టి  తీస్తుంది. ఇక ఆర్య పాపని ఎత్తుకుంటాడు. ఇక ఇద్దరు ఒకే చోట ఉండటంతో రేష్మ, ప్రీతి సంతోషపడతారు. ఇక లోపలికి వెళ్ళగానే శారదమ్మ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.


ఇల్లు చూసి రేష్మ ఆశ్చర్య పోతుంది. ఇక శారదమ్మ బాధపడటం చూసి ఏం జరిగింది అనటంతో వెంటనే అంజలి ఈ ఇంటి పెద్ద కోడలు తన అక్క అనురాధ ను తలుచుకొని బాధపడుతుంది అని చెబుతుంది. దాంతో అను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆర్య ఒక చోట నిలబడి ఉండగా గతంలో జరిగిన సంఘటనను గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడు అను పిల్లలతో సరదాగా ఆడుతూ ఉండగా అను కళ్ళకు గంతలు కట్టి ముద్దు పెడుతూ ఉంటారు.


అలా ఆర్య కూడా వచ్చి ముద్దు పెట్టడంతో అను చూసి మురిసిపోతుంది. అది తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఆర్య. అంజలి గోపి తో భాను వాళ్లకు ఇల్లు చూపించమని అనడంతో గోపి వాళ్లకు ఇల్లు చూపిస్తూ ఉంటాడు. ఇక గెస్ట్ రూమ్ చూపించగా అది చూసి రేష్మ పరుపుపై ఎక్కి చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటుంది. అను పిలిచినా కూడా అసలు వినిపించుకోదు.


ఇక గోపి వేరే రూము చూపిస్తాను అన్నప్పటికీ కూడా తను అక్కడే ఉంటాను అని అంటుంది. ఆ సంతోషంలో రేష్మ అను అనడంతో వెంటనే గోపి అను అని షాక్ అవుతాడు. అను, ప్రీతి కూడా షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత రేష్మ తను అలా పిలవలేదు అని భాను అని పిలిచాను అని కాసేపు గోపి మతి పోగొట్టేలా చేస్తూ ఉంటారు. ఇక గోపి అక్కడ నుంచి వెళ్లగా అను అందరి ముందు వచ్చినా కూడా వాళ్లకు నేను కనిపించలేకపోతున్నాను.. తను లేనందుకు వాళ్ళు చూపిస్తున్న ప్రేమను చూసి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్యను కలవలేను అని.. ఎందుకంటే ఆయన ప్రాణాలకు ఏమి హాని జరగకూడదు అని..  ఎందుకంటే ఆయనను నమ్మి ఎన్నో వేల మంది ఉన్నారని అంటుంది.


also read it: Janaki Kalaganaledhu July 25th: ‘జానకి కలగనలేదు’ సీరియల్: భార్య రాకతో సంతోషంలో సంబరాలు చేసుకుంటున్న రామ, జానకి ఎంట్రీతో వణికిపోతున్న మనోహర్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial