గుప్పెడంతమనసు జూలై 26ఎపిసోడ్ (Guppedanta Manasu July 26nd Written Update)


మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీటింగ్ కాలేజీలో జరుగుతోందని తెలిసి ఓ లెక్చరర్ ద్వారా తెలుసుకుని కాలేజీకి వెళతాడు శైలేంద్ర. లేనిపోని ప్రశ్నలు వేసి జగతి-మహేంద్రని ఇరికిద్దామని చూస్తాడు. 
జగతి: నీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా అందుకే నిన్ను ఈ మీటింగ్ కి పిలవలేదు అయినా వచ్చావు. వచ్చి లేనిపోని ప్రశ్నలు వేస్తున్నావు. అయినా నేనేమీ పూర్తి బాధ్యతను ఆ కాలేజీకి అప్పగించడం లేదు. వదిలేయడానికి బాధ్యతలు అప్పగించడానికి చాలా తేడా ఉంది చదువుకున్నావు కదా ఆ మాత్రం  తేడా తెలియదా 
శైలేంద్ర: చూశారా డాడ్ నన్ను  ఎంత మాట అంటున్నారో. పేర్లు అడిగితే చెప్పడం లేదు అంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. నాకు అడగడానికి హక్కు లేదు అంటున్నారు కనీసం మీరైనా అడగండి అని ఫణింద్ర తో చెప్తాడు
ఫణీంద్ర: అసలు వీడిని లోపలకు రానివ్వడమే నువ్వు చేసిన తప్పు జగతి అని ఫైర్ అయిన ఫణీంద్ర..అసలు నిన్ను ఎవడు మీటింద్ కి రమ్మన్నారు. అయినా వాళ్ల గురించి ఏం తెలుసు . ఏ చేసినా పక్కగా చేస్తారు. అయినా నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు మిషన్ ఎడ్యుకేషన్ మీద బేసిక్ నాలెడ్జి కూడా లేదు అని గట్టిగా క్లాస్ పీకి పంపించేస్తాడు
జగతి: త్వరలోనే మిగిలిన డీటేల్స్ చెబుతాం
ఫణీంద్ర: అక్కర్లేదు మీ మీద ఆ మాత్రం నమ్మకముంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి


Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: పైకి ఈగో, లోపల మాత్రం చెప్పలేనంత ప్రేమ- శైలేంద్ర నోరు మూయించేసిన జగతి


మరోవైపు కారులో వెళ్తూ ఉంటారు వసుధార, ఏంజెల్. మీ కాలేజీలో అంత మంది ఉన్నారు కదా నన్ను ఎందుకు రమ్మన్నావు అయినా మనం ఎక్కడికి వెళ్తున్నాము  అంటుంది ఏంజెల్. నువ్వు నా ఫ్రెండ్ వి అయినా నేను పడే ఇంటెన్షన్ నువ్వు చూస్తే మీ తాతయ్యకి చెప్తావు కదా అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అంటుంది వసుధార. 
ఏంజెల్: రిషి కూడా వచ్చి ఉంటే బాగుండేది తనకి ఇష్టం లేకపోయినా నేను సినిమాలు కి షాపింగ్ కి రమ్మంటే వచ్చేవాడు కానీ ఈరోజు ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు నువ్వు ఉన్నావని ఏమో అంటుంది
కాసేపు ఇద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటారు... నేనొకటి అడుగుతాను నిజం చెబుతావా అని ఏంజెల్ అంటే..తప్పకుండా చెబుతాను అంటుంది వసుధార
వాళ్ళిద్ది కారుని ఫాలో అవుతాడు కాలేజీ అటెండర్ ఫాలో అవుతూ ఉంటాడు. శైలేంద్ర వాడిని డబ్బుతో కొనేస్తాడు. రిషి, వసుధార ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా ఫాలో అవమని సమాచారం ఇమ్మని చెబుతాడు. 


Also Read: రిషిధార మీద అనుమానపడిన ఏంజెల్- రిషిని మట్టి కరిపించమని కొడుక్కి నూరిపోసిన దేవయాని


మరోవైపు వసుధార, ఏంజెల్ ఎక్కడకు వెళ్లారో తెలుసా అని విశ్వనాథాన్ని అడుగుతాడు రిషి. తెలియదని విశ్వనాథం అనడంతో.. 
రిషి: దెబ్బతగిలాక ఈ రోజే కాలేజీకి వచ్చారు, ఈరోజే బయటకు వెళ్లారు మళ్లీ ఏమైనా జరుగుతుందేమో మీరు పట్టించుకోవాలి కదా సార్ ఎకర ఏం చేసినా తనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పడంతో వాళ్లని ఫాలో అవుతాడు అటెండర్.
విశ్వనాథం: నువ్వు ఏమి గమనించినట్లే ఉంటావు కానీ అన్ని గమనిస్తావు అయినా నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదులే వసుధార తెలివైన అమ్మాయి వాళ్లకి ఏమీ కాదు వచ్చేస్తారు
రిషి: ఏమైనా వాళ్ళిద్దరూ అలా వెళ్ళటం నాకు నచ్చలేదు అంటాడు రిషి.
 వసుధార ఏంజెల్ ని తీసుకుని ఒక బస్తీకి వెళ్తుంది. అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూపించి వీళ్ళు చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోతున్న పిల్లలు. వీళ్ళకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్తే వాళ్ళు చదువుకుని బాగుపడతారు అని ఏంజెల్ కి చెప్తుంది. పిల్లలందరినీ పిలిచి మీకు చదువుకోవాలని ఉందా అని అడుగుతుంది. అవును అంటారు పిల్లలందరూ. అయితే మీ తల్లిదండ్రులని తీసుకుని రండి అనటంతో పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులని తీసుకుని వస్తారు. వాళ్లకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వసుధార. ఇదే విషయాన్ని అటెండర్ శైలేంద్ర కి ఫోన్ చేసి చెప్తాడు. తన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వకూడదు అక్కడ వాళ్ళు ఆవిడ మీద ఎదురు తిరిగేలాగా చెయ్యు అని సలహా ఇస్తాడు.


శైలేంద్ర ప్లాన్
బస్తీలో ఇద్దరు దంపతులకి డబ్బు ఆశ చూపించి వాళ్లని అవమానించి పంపించమని చెబుతాడు.  మీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు మాలాంటి వాళ్ళని ఆశపెట్టి తర్వాత మధ్యలోనే వెళ్లిపోతారని ఫైర్ అవుతారు. ఆవిడ భర్త  కార్ టైర్ లో గాలి తీసేస్తాడు. కోపంతో మనిషివా పశువు వా అని అడుగుతుంది వసుధార. నా  భర్తని అంత మాట అంటావా అంటూ వసుధార మీద చెయ్యెత్తుతుంది  ఆవిడ. ఆమెను అడ్డుకుంటుంది వసుధార. పెద్ద గొడవ జరిగబోతుండగా పాండ్యన్ బ్యాచ్ ఎంట్రీ ఇస్తారు. అసలు మీరు ఇక్కడకు ఎందుకొచ్చారంటూ ఎంట్రీ ఇచ్చిన రిషిని చూసి షాక్ అవుతారు ఏంజెల్, రిషి. 


ఎపిసోడ్ ముగిసింది..