వసు చెప్పే క్లాస్ లో పది నిమిషాల పాటు కూర్చుని పాఠాలు వినడానికి రిషి ఒప్పుకున్నందుకు తెగ సంతోషపడుతుంది. కాసేపటికి రిషి కారు డోర్ సౌండ్ చేయడంతో అదంతా తన భ్రమ అని తెలుసుకుంటుంది. అంటే రిషి సర్ నా రిక్వెస్ట్ కి ఒప్పుకోలేదా? అనుకుంటుంది.


రిషి: మీరు రిక్వెస్ట్ కి ఒప్పుకోకపోతే కారు ఎక్కనని అన్నారు కదా అందుకే నేనే నడుచుకుంటూ వెళ్తాను మీరే కారు ఎక్కి రండి


వసు: మీకు ఇష్టం లేకపోతే రానని చెప్పండి అంతే కానీ నడుచుకుంటూ వస్తే విశ్వనాథం గారు ఏమనుకుంటారు?


రిషి: మీ మాట వినడమే ఇష్టం లేదు అలాంటిది మీ పాఠాలు ఎలా వింటానని అనుకున్నారు. దయచేసి ఇలాంటి రిక్వెస్ట్ లు ఇంకోసారి పెట్టొద్దు. ఇలాగే రిజెక్ట్ చేస్తాను అనేసి వెళ్ళిపోతాడు.


కాలేజ్ లో ఒంటరిగా కూర్చుని వసు రిక్వెస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వసు రిషిని గమనించి అంత కోపం ఎందుకని అనుకుంటుంది. చేసిందంతా చేసి ఇప్పుడు నీ క్లాస్ వినమంటే ఎలా వింటానని రిషి అనుకుంటాడు. ఇక పాండ్యన్ బ్యాచ్ వసు మేడమ్ చెప్పిన ప్రాబ్లం చేయలేకపోయామని అనుకుంటూ తన దగ్గరకి వస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని వృత్తి ధర్మంలో వ్యక్తిగతం ఉండకూడదని చెప్పారని ఒక చిన్న కథ చెప్తుంది. ఈ విషయం మాకెందుకు చెప్పారని పాండ్యన్ వాళ్ళు బిక్క మొహం వేస్తారు. అది విని ఈ విషయం చెప్పింది మీకు కాదు తనకని రిషి మనసులో అనుకుంటాడు. చెప్పాల్సింది చెప్పాను మీరు వినాల్సింది విన్నారు, ఖచ్చితంగా మిషన్ ఎడ్యుకేషన్ టేకప్ చేస్తారని వసు మనసులో అనుకుంటుంది.


Also Read: బోల్డ్ యాడ్ షూట్ లో స్వప్న, పుట్టింటికి అండగా నిలిచిన కావ్య


జగతి: మీటింగ్ గురించి అందరికీ చెప్పావా?


మహేంద్ర: చెప్పాను అందరూ మీటింగ్ కి వచ్చి ఉంటారు


జగతి: శైలేంద్ర కి చెప్పావా?


మహేంద్ర: చెప్పలేదు కనీసం లిస్ట్ లో తన పేరు కూడా మెన్షన్ చేయలేదు. మీటింగ్ జరుగుతున్న విషయం శైలేంద్రకి తెలిసే అవకాశమే లేదు


జగతి: మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు రిషి వాళ్ళకి అప్పగిస్తున్నామని చెప్పొద్దు. కేవలంవిష్ కాలేజ్ కి అప్పగిస్తున్నామని చెప్పాలి


మహేంద్ర: నేను చెప్పను, నువ్వు చెప్పకు. రిషి ఎక్కడ ఉన్నాడో అన్నయ్యకి తెలిస్తే చాలా సంతోషపడతారు. కానీ తను వెళ్ళి వదిన, శైలేంద్రకి చెప్తే రిషికి ప్రమాదం


ఇక శైలేంద్ర కాలేజ్ లోకి అడుగుపెడతాడు. నాకు తెలియకుండా మీటింగ్ ఎరేంజ్ చేశారంటే ఏదో సీక్రెట్ బోర్డ్ మెంబర్స్ కి చెప్పబోతున్నారు. రిషి, వసుధార గురించి చెప్పబోతున్నారా? ఈ సామ్రాజ్యం నాకు దక్కకుండ చేయాలని చాలా పెద్ద ప్లాన్ వేశావ్ పిన్నీ కానీ అదేమీ జరగనివ్వను వస్తున్నానని అనుకుంటాడు. రిషి లైబ్రేరిలో ఉండగా వసు కూడా వస్తుంది. వృత్తి ధర్మంలో వ్యక్తిగతం ఉండకూడదని వసు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మెసేజ్ పెడతాడు. ఎవరెవరో జీవిత కథలు చెప్పి మనసు మార్చలేవు వెళ్లిపొమ్మని మెసేజ్ చేస్తాడు.


వసు: నా ప్రయత్నం నాది మీ నిర్ణయం మీది. అయినా మిమ్మల్ని బలవంతంగా ఒప్పించడానికి మన మధ్య బంధం లేదని మీరే అన్నారు కదా


రిషి: నువ్వు ఎంత ట్రై చేసినా నా మనసు మారదు వసుధార


లైబ్రరీ బుక్స్ పెట్టిన ర్యాక్ డోర్ వసు మీద పడబోతుంటే రిషి గమించి తనని పక్కకి లాగుతాడు. అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాలేజ్ కి ఏంజెల్ వచ్చి రిషిని పలకరిస్తుంది. వసు బయటకి వెళ్ళాలి రమ్మని కాల్ చేసి పిలిచిందని చెప్తుంది. దేనికి, ఎక్కడికని వరుస ప్రశ్నలు వేస్తాడు. ఖాళీగా ఉంటే నువ్వు కూడా రావచ్చు కదా ఏంజెల్ పిలుస్తుంది. కానీ రిషి మాత్రం రానని చెప్తాడు. అప్పుడే వసు వస్తుంది.


ఏంజెల్: రిషిని మనతో పాటు బయటకి రమ్మంటే రాను అంటున్నాడు, నువ్వైన చెప్పు వసుధార


వసు: నువ్వు పిలిస్తేనే రాను అన్నారు నేను పిలిస్తే వస్తారా?


రిషి: ఏంజెల్ జాగ్రత్తగా వెళ్ళండి


Also Read: రిషిధార మీద అనుమానపడిన ఏంజెల్- రిషిని మట్టి కరిపించమని కొడుక్కి నూరిపోసిన దేవయాని


వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు. వసుధారకి మెసేజ్ చేసి కనుక్కుందామా? అనుకుని మళ్ళీ వద్దులే తను ఎక్కడికి వెళ్తే నాకెందుకు అనుకుంటాడు. వీళ్ళని కాలేజ్ ప్యూన్ గమనిస్తూ ఉంటాడు. డీబీఎస్టీ కాలేజ్ లో మీటింగ్ స్టార్ అవుతుంది.


జగతి: మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం. మేం వెళ్లొచ్చిన కాలేజ్ లో మంచి టీం ఉంది వాళ్ళకి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది


శైలేంద్ర: ఏంటి పిన్నీ ప్లేట్ ఫిరాయిస్తున్నారు. మిషన్ ఎడ్యుకేషన్ మనం హ్యాండిల్ చేయలేమని చెప్పాను అప్పుడు నా మాట వినలేదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా నేనే ముందుకు తీసుకెళ్తానని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమైంది. వాళ్ళ మీద మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఆ కాలేజ్ కి పేరు లేదా? ఎందుకు వాళ్ళకి అప్ప జెప్పాలని అనుకుంటున్నారు


మహేంద్ర: ఎందుకు లేదు శైలేంద్ర.. మేం వెళ్లొచ్చిన కాలేజ్వి పేరు విష్. మిషన్ ఎడ్యుకేషన్ ని ప్యాషన్ తో పని చేసే వాళ్ళ కోసం కావాలన్న మా అన్వేషణ ఫలించింది. ఆ కాలేజ్ లో ఉన్న స్టాఫ్ ను చూస్తే ఈ పని చేయగలరని అనిపించింది


శైలేంద్ర: మరి ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏంటి?( నాకు ఇప్పుడు అర్థమయ్యింది. మీరు రిషి, వసుధారకి అప్పగిస్తున్నారు. కానీ అది జరగనివ్వను)


జగతి: పేర్లు చెప్పను. మనకి పేర్లు  ముఖ్యం కాదు. మన ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళే వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాను


శైలేంద్ర: అదేంటి పిన్నీ అలా అంటారు. మేం కాలేజ్ బోర్డ్ మెంబర్ కదా.. పేర్లు చెప్పండి


జగతి: మిషన్ ఎడ్యుకేషన్ పూర్తి బాధ్యత నాదేనని సంతకాలు చేశారు కదా. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నా ఇష్టం ఆ విషయం గురించి గుర్తు పెట్టుకో. ఎప్పుడైతే నీకు ఈ కాన్సెప్ట్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పావో అప్పుడే నీకు దీని మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం అయ్యింది. అందుకే నిన్ను ఈ మీటింగ్ కు కూడా పిలవలేదు. అయినా దీని మీద మానిటరింగ్ మాత్రమే వాళ్ళకి ఇస్తున్నాను. పూర్తి బాధ్యత కాదు.. దీనికి దానికి తేడా తెలుసుకో శైలేంద్ర