బుల్లితెర హాస్య నటుడు యాదమ్మ రాజు (Yadamma Raju)కి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్య ఎవరికి ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా వెంటనే వైరల్ అవుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు క్షణాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా, కొందరు యూట్యూబ్ ఛానల్స్ కూడా రన్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వారి లైఫ్ లో ఏం జరుగుతున్నాయనే విషయాలు సైతం బయట పడుతున్నాయి.


యాదమ్మ రాజు కాలికి కట్టు ఏమిటి?
యాదమ్మ రాజు కి సంబంధించి సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? అనేది చూస్తే... యాదమ్మ రాజు కాళ్ళకి కట్టు ఉండగా, ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. పైగా నడవలేని స్థితిలో ఉండగా తన భార్య స్టెల్లా అతడికి దగ్గరుండి సేవలు చేస్తున్నట్లు కనిపించింది. అయితే యాదమ్మ రాజు కి ఏం జరిగిందో తెలియదు కానీ... కొందరు ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తనకు ఎటువంటి ప్రమాదం జరిగిందో అన్న విషయాన్ని త్వరలోనే తెలుస్తుందని చెప్పవచ్చు. ఇక ఆయన అభిమానులు తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారు. 


కెరీర్ మొదట్లో ఈటీవీ ప్లస్ లో కమెడియన్ గా పరిచయమయ్యాడు యాదమ్మ రాజు. మొదటిసారే తన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులందరికీ ఫిదా చేశాడు. దాంతో మంచి అభిమానుల్ని కూడా ఏర్పరుచుకున్నాడు. తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పర్చుకోవటంతో జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షో లో కూడా అడుగు పెట్టాడు. కానీ ఈ షో ఎంత కాలం ముందుకు సాగలేదు. కానీ అతని క్రేజ్ మాత్రం బాగానే పెరిగిపోయింది.


ఆ తర్వాత ఈటీవీ జబర్దస్త్ కి పరిచయమయ్యాడు. ఇందులో కమెడియన్ గా మరింత క్రేజీ సంపాదించుకున్నాడు. మరొ కమెడియన్ సద్దాంతో కలిసి బాగా స్కిట్లు చేస్తూ మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఏడాది కిందట యూట్యూబ్ స్టెల్లా అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అతడు ఆమెను లవ్ చేస్తున్న విషయం కూడా ఒక షో ద్వారానే బయటపడింది. అలా వీరిద్దరూ కొంతకాలం ప్రేమలో ఉండి ఏడాది కిందట రెండు మతాల పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు.


Also Read : ధనుష్ పాన్ ఇండియా సినిమాలో అక్కినేని నాగార్జున!


ఇక వివాహం తర్వాత ఇద్దరు సోషల్ మీడియాలో బాగా హడావుడి చేయడం మొదలుపెట్టారు. బుల్లితెరపై పలు షోలల్లో కూడా ఇద్దరు తెగ సందడి చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోలు పంచుకున్నారు.  ఇక ఇద్దరూ భార్య భర్తల్లాగా కంటే ఫ్రెండ్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు బాగా ట్రోల్స్ చేసుకుంటూ ఉంటారు.


Also Read: Janaki Kalaganaledhu July 25th: ‘జానకి కలగనలేదు’ సీరియల్: భార్య రాకతో సంతోషంలో సంబరాలు చేసుకుంటున్న రామ, జానకి ఎంట్రీతో వణికిపోతున్న మనోహర్?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial