తెలుగు ప్రేక్షకులకు ధనుష్ (Dhanush) సుపరిచితులే. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకులతో పని చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' చేశారు. ఆయన తొలి తెలుగు సినిమా అది. నిజం చెప్పాలంటే... 'సార్' కంటే ముందు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ఓ సినిమాకు 'ఎస్' చెప్పారు ధనుష్. త్వరలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
కీలకమైన ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగార్జున
ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్నారు. అయితే... ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు, అలాగని అతిథి పాత్ర కూడా కాదు! కీలకమైన క్యారెక్టర్ చేయాల్సిందిగా నాగార్జునను శేఖర్ కమ్ముల సంప్రదించగా... కథ, క్యారెక్టర్ నచ్చడంతో నాగార్జున ఓకే చెప్పారని తెలిసింది.
Nagarjuna In Dhanush Movie : ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా కోసం నాగార్జున 20 నుంచి 30 రోజుల పాటు షూట్ చేయాల్సి ఉంటుందట. త్వరలో ఆయన షూటింగులో జాయిన్ అవుతారని యూనిట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రమిది. మూడు భాషల్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూడు కాకుండా మిగతా భారతీయ భాషల్లో అనువదించి విడుదల చేయనున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్!
కథానాయికగా రష్మికా మందన్నా?
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ... ఆమెతో చర్చలు జరుపుతున్నారు. 'పుష్ప 2'తో పాటు తెలుగు, తమిళ సినిమా 'రెయిన్ బో', హిందీ సినిమాల్లో ఇప్పుడు రష్మిక నటిస్తున్నారు.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
Dhanush Sekhar Kammula Movie : నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది.
Also Read : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
''కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ హీరోతో... తన తొలి సినిమాతో జాతీయ పురస్కారాన్ని అందుకుని, కళాత్మక విలువలతో కూడిన కమర్షియల్ చిత్రాలు తీస్తూ విజయాలను అందుకుంటూ పాత్ బ్రేకింగ్ సినిమాలు తెరకెక్కించడంలో మాస్టర్ అయిన మన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయనున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తాం'' అని ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : సోనాలి నారంగ్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial