Prema Entha Madhuram Serial Today Episode: ఈరోజు నుంచి ఈ ఇంటి కోడలుగా బాధ్యత నీదే అని చెప్పి దీపాన్ని వెలిగించమని అను తో చెప్తుంది సుగుణ. అను అలాగే చేస్తుంది.


యాదగిరి : ఆనందపడుతూ నేను చెప్పాను కదా సార్ ఈ పెళ్లి జరిగితే అంతా మంచే జరుగుతుందని,మీరు మేడం గారు కలిసి పోయారు నాకు అదే ఆనందంగా ఉంది. సీతారాముల లెక్క ఎన్ని కష్టాలు పడ్డారు అని ఎవరికి వినిపించకుండా  అంటాడు. ఈ హ్యాపీ మూమెంట్లో ఒక సెల్ఫీ తీసుకుందాం అంటాడు.


ఆర్య అక్కడే కూర్చున్న దివ్యని కూడా సెల్ఫీ తీసుకుందాం రమ్మంటాడు.


దివ్య: ఏడుస్తూ నేను కొందరు లాగా పాత మొగుడిని మర్చిపోయి, కొత్త మొగుడుతో సరదాగా ఉండలేను ఇన్నాళ్ళు పాత మొగుడు కోసం ఏడుపు ఇప్పుడేమో కొత్త మొగుడుతో సరదాలు అంటుంది.


ఆర్య: బాధపడుతూ ఇంతకుముందు సంగతి వేరు ఇప్పుడు తను నీ వదిన కొంచెం మాటలు అదుపులో పెట్టుకో అని చెప్తాడు.


దివ్య: నేను చెప్పిన దాంట్లో తప్పేముంది తను ఎంత త్వరగా ప్రేమని మర్చిపోయింది, నేను నా ప్రేమని అంత త్వరగా మరిచిపోలేను అంటుంది.


అను: దివ్య.. విషయం తెలుసుకోకుండా మాట్లాడొద్దు నా మటుకు నాకు నా పిల్లలకి న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నోరు జారితే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది  అని హెచ్చరిస్తుంది.


కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది దివ్య.


మరోవైపు ఒక పాప( కొత్త క్యారెక్టర్) బ్యాగ్ లో బట్టలు సర్దుకొని  అందులో ఆర్య ఫోటో పెట్టుకుంటుంది. నేను నిన్ను వదిలి ఉండలేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికే వస్తాను నాన్న అని చెప్పి దేవునికి దండం పెట్టుకొని బయలుదేరుతుంది.


మరోవైపు రెడీ అవుతున్న అను జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతుంటుంది. బయట ఉన్న ఆర్య కూడా  జరిగిందంతా తలుచుకుంటాడు. ఇద్దరూ రూమ్ లో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు.


అను: ఒక అబద్ధం మన మధ్య ఎంత దూరాన్ని పెంచేసింది అంటుంది.


ఆర్య: అవును నువ్వుద్వారమయ్యాక ఎంత బాధపడ్డాను కానీ మళ్ళీ నా దగ్గరికి వస్తావని ఎంతో నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఈరోజుకి నిజమైంది. ఇంకెప్పుడూ మన మధ్య ఇలాంటి దూరం రాకూడదు అంటాడు.


అను: లేదు సార్ మరెప్పుడూ రానివ్వను మీకు దూరంగా ఉన్నానన్నమాటే కానీ నా ఆలోచనలు ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతూ ఉండేవి అంటుంది.


వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పిల్లలు ఇద్దరు వస్తారు. మీ ఇద్దరూ మాకు థాంక్స్ చెప్పాలి. మా వల్లే కదా మీకు పెళ్లి అయింది అంటారు. వాళ్లు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటే దివ్య చూస్తుంది. అసూయతో రగిలిపోతుంది. మీరు ఎలా ఆనందంగా ఉంటారో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది.


మరోవైపు శారదమ్మ  మనవళ్ళ దగ్గరికి వెళ్ళటానికి హడావిడి పడిపోతూ ఉంటుంది. స్వయంగా స్వీట్స్ తయారు చేస్తుంది. అది చూసి ఆర్య, జెండే నవ్వుకుంటారు.


శారదమ్మ: ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది.


నీరజ్: నిన్నటి వరకు ఈ ఇంటిలో ఎంత స్తబ్దుగా  ఉండే దానివి ఈరోజు ఎంత హుషారుగా కనిపిస్తున్నావు. ఇదంతా కొడుకు కోడలు కలిసిపోయారని ఆనందమా అంటాడు.


శారదమ్మ: అవునురా ఇంటికి కూతురైన కోడలైనా తనే కదా నాకు వాళ్ళని ఎలాగైనా చూడాలని ఉంది పదా వెళ్దాం.


నీరజ్: అక్కడ మనం ఎవరిమో తెలియదు కదా ఏమని చెప్తాము, మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుంది అంటాడు.


శారదమ్మ: ఎవరో అని ఎందుకు చెప్తాము, అత్తగారు అనే చెబుదాము. అయినా నువ్వు అక్కడ ఎలా మేనేజ్ చేస్తావో తెలియదు కానీ నేను మాత్రం అక్కడికి వెళ్లాలి అంటుంది.


నీరజ్: తల్లితో సరే అని చెప్పి నువ్వు కూడా రావచ్చు కదా అని జెండే ని అడుగుతాడు.


జెండే: అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే రియాక్ట్ అవటానికి నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళండి అంటాడు.


శారదమ్మ బయలుదేరబోతు ఎందుకో ఆలోచనలో పడుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.