Trinayani Today Episode: తిలోత్తమ వల్లభకు చాప దిండు ఇస్తూ హాల్‌లో పడుకోమని చెప్పి తీసుకొస్తుంది. దాన్ని సుమన చూస్తుంది. ఇక ఎద్దులయ్య, వల్లభ వచ్చి కింద పడుకుంటారా అని అడుగుతారు. ఇక వాళ్లు చూడకుండా తిలోత్తమ తలగడలో అఖండ స్వామి ఇచ్చిన తులసి వేరు పెట్టేస్తుంది. ఆ పడక విశాలాక్షి కోసం వేశామని వచ్చి పడుకోమని చెప్తారు. సుమన తిలోత్తమను అనుమానంగా చూస్తూ ఉంటుంది. 


ఎద్దులయ్య: అమ్మా వాళ్లు ఏం చేస్తున్నారో..
విశాలాక్షి: నాకు అన్నీ తెలుసు ఎద్దులయ్య నేను చూసుకుంటాను మీరు వెళ్లండి. 
వల్లభ: మమ్మీ పని అయిందా..
తిలోత్తమ: అఖండ స్వామి ఇచ్చిన తులసి వేరు తలగడలో పెట్టానురా. విశాలాక్షి పడుకుంటే ట్రాన్స్‌లోకి వెళ్తుంది. అప్పుడు మనం విశాలాక్షిని పసుపు అడుగుల మీద రివర్స్ నడిపిస్తే మనం అడిగిన ప్రశ్నలకు విశాలాక్షి సమాధానం చెప్తుంది.
సుమన: ఓహో అలాగా మీరు విశాలాక్షిని నడిపిస్తే తర్వాత కథను నేను నడిపిస్తా అత్తయ్య. గాజుపెంకులను పొడి చేస్తూ.. విశాలాక్షి నీ ఇంద్రజాలంతో నన్ను భయబ్రాంతులకు గురించేస్తావా.. నీ కాళ్లను నేను నొక్కడం ఏంటి అని గిల్లితే నా చేతుల్ని రక్తం వచ్చేలా చేశావ్ కదా.. నీ గారడినే నీకు శిక్ష పడేలా చేస్తుంది. ఈ గాసుముక్కల పొడిని నీవు వేసిన అడుగుల మీద వేస్తాను. వీటిమీద నువ్వు నడిస్తే నీ కాళ్లకు రక్తం వచ్చి నువ్వు విలవిల్లాడటం నేను కళ్లారా చూడాలి. అంటూ అడుగుమ మీద చల్లుతుంది. 
తిలోత్తమ: రేయ్ తులసి వేరు పనిచేస్తుందిరా.. విశాలాక్షి లేచిందిరా.. విశాలాక్షి లేచి నడుస్తూ ఉంటుంది. ఆగు విశాలాక్షి.. నా మాట వింటున్నావా.. 
విశాలాక్షి: నేను వెళ్తుంటే ఎందుకు ఆగమన్నారు. 
తిలోత్తమ: నిన్ను మేమే తీసుకెళ్లాలి అనుకున్నాం. వల్లభ విశాలాక్షికి చేయూతనిద్దాం.. నువ్వు ఆ చేయి పట్టుకో నేను ఈ చేయి పట్టుకుంటా..
హాసిని: మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే చేయి పట్టుకుంటే ఏం కాదు.
తిలోత్తమ: నీకు ఇక్కడ ఏం పనే పోయి పడుకో..
హాసిని: విశాలాక్షికి ఎక్కడిని పట్టుకెళ్తున్నారు.
తిలోత్తమ: విశాలాక్షిని సాయం చేద్దమని.. విశాలాక్షి నువ్వు రా అమ్మా..
హాసిని: విశాలాక్షి వాళ్లు ఎలా చెప్తే అలా చెప్తే నువ్వే నష్టపోతావ్.
తిలోత్తమ: రేయ్ తనని నెట్టేయ్‌రా.. ఇక విశాలాక్షిని తీసుకెళ్లి పసుపు అడుగుల మీద రివర్స్‌గా నడుస్తుంది.  నువ్వు ఎవరివి..
విశాలాక్షి: నేను విశాలాక్షిని.. అందరికీ అమ్మను. మరోవైపు హాసిని హడావుడి చేసి అందరినీ తీసుకొస్తుంది. 
తిలోత్తమ: మా గాయత్రీ అక్కయ్య ఎక్కడుందో అని మీకు తెలుసు కదా. చెప్పు విశాలాక్షి గాయత్రీ అక్కయ్య ఎక్కడుంది. 
విశాలాక్షి: మీకు తెలిసిన చోటే ఉంది. 
నయని: అమ్మో రక్తం విశాలాక్షి ఏమైందమ్మా.. ఏవండీ కాలు చూడండి..  
పావనా: సోదరి కాలికి ఏదో గుచ్చుకున్నట్లు ఉంది లేకపోతే రక్తం ఎందుకు వస్తుంది. 
విశాల్: అసలు ఏం జరుగుతుంది ఇక్కడ.
విక్రాంత్: అమ్మా మీరు ఎందుకు విశాలాక్షిని తీసుకొని వచ్చారు. 
తిలోత్తమ: విశాల్ కోపడ్డతావ్ ఎందుకు.
నయని: విశాలాక్షి కాలికి గాయం అయి రక్తం వచ్చినా వదలకుండా తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
సుమన: ఎక్కడ అడ్డుదారులు తొక్కి గాయాలపాలైందో ఎవరికి తెలుసు.
డమ్మక్క: అలా అయితే ఈ పసుపు పాదాల మీద నువ్వు నడు చూద్దాం. 
సుమన: నాకేం పట్టింది నేను ఎందుకు నడుస్తాను.
నయని: కావాలనే ఈ అచ్చులమీద విశాలాక్షిని ఎందుకు నడిపించాలి అనుకున్నారు.
వల్లభ: పని అవ్వాలి అంటే తప్పదు.
ధరుందర: ఏం పని..
పావనా: పాపం పని మాత్రం చేయకు అల్లుడు.
ఎద్దులయ్య: గాయత్రీ దేవి జాడ తెలుసుకోవడానికి మా అమ్మని ఇబ్బంది పెడతారా.. 
నయని: గాయత్రీ అమ్మగారి గురించి తెలుసుకోవడానికి విశాలాక్షిని ఇబ్బంది పెట్టారా..
తిలోత్తమ: రక్తం ఎందుకు వచ్చిందో మాకు తెలీదు.
డమ్మక్క: సుమనకే తెలియాలి. 
సుమన: నాకేం తెలుసు అందులో ఏమైనా పడిందేమో..
విక్రాంత్: పడిందా పడేశారా..
వల్లభ: రేయ్ పెళ్లాన్ని అడుగురా బాబు మేము ఏం చేయలేదు. ఒట్టురా బాబు మాకు దీనికి ఏం సంబంధం లేదు.
నయని: నువ్వు చెప్పు సుమన.
సుమన: చేసుకున్నవారికి చేసుకున్నంత అక్క. 
విక్రాంత్: నువ్వు అడుగులు వేయ్.. 
సుమన: అమ్మో నా కాలిగి గుచ్చుకుంటే..
విక్రాంత్: ఒక్కటి చెంప మీద కొట్టి.  ఎందుకు నడవాలి అనకుండా గుచ్చుకుంటుంది అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఇదే ఏదో చేసింది అని. 
సుమన: పొద్దున్న నా చేతికి రక్తం వచ్చేలా చేసిన విశాలాక్షికి రక్తం రావాలని అనుకున్నాను.
హాసిని: విశాలాక్షి నేను వద్దూ అని చెప్పినా ఎందుకు వీళ్లతో వచ్చావు.
విశాలాక్షి: తులసి చెట్టుకు పూజ చేసి వచ్చారు వీళ్లు. భక్తి పారవశ్యంలో మైకం కమ్మినట్లు అనిపించడంతో అలా నడిచాను అని అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


AlSo Read : ప్రియమణి ఫొటోస్: కుర్చీలో డిఫరెంట్ యాంగిల్స్​లో ఫోజులిచ్చిన ప్రియమణి