Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నేనే మీ నాన్నని అని పిల్లలకి చెప్తాడు ఆర్య. పిల్లలు మాకు తెలుసు నాన్న అని చెప్పటంతో ఆశ్చర్యపోయిన ఆర్య దంపతులు ఎలా అని అడుగుతారు.
పిల్లలు: మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడే మీ పెళ్లి ఫోటోలు చూశాము. మాకు అప్పుడే మీరు నాన్న అనే విషయం తెలిసింది అని చెప్తారు.
అను: మమ్మల్ని కలపటం కోసమే మీరు ఇంత తపన పడ్డారా అని పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఆనందపడుతుంది.
సుబ్బు: నిజం తెలిసినా ఎంత నిబ్బరంగా ఉండగలిగారు, నిజం తెలిసినా నిజం చెప్పలేదంటే అంత ఓపిక వర్ధన్ కుటుంబానికే ఉంటుంది అని పిల్లల్ని చూసి మురిసిపోతాడు.
పద్దు: ఇదంతా పిల్లలు చేసిన పుణ్యమే. నా పుణ్యమే ఈరోజు మీ అందరినీ కలిపింది అని చెప్తుంది.
అందరూ ఆనందపడతారు కానీ అను మాత్రం నేను మీకు అను అని తెలియదు కదా మరి నా మెడలో ఎలా తాళి కట్టారు అని అడుగుతుంది.
ఆర్య: నేను తాళి కట్టక ముందే నువ్వు నా అను అని తెలుసు అని చెప్పి తాళి కట్టడానికి ముందు జెండే ఫోన్ చేసిన సంగతి చెప్తాడు. కంప్యూటర్లు పనిచేయకపోవటంతో కెనడి చేతితోనే బొమ్మ గీస్తాడు. అది ఆర్య బొమ్మ కావడంతో ఆశ్చర్యపోతాడు. అదే విషయం జెండే ఆర్య కి ఫోన్ చేసి చెప్తాడు. అలాగే డిఎన్ఏ మ్యాచ్ అయిన విషయం కూడా చెప్పాడు. అప్పుడే నువ్వు నా అను అని పిల్లలు ఇద్దరు నా పిల్లలు అని కన్ఫర్మ్ చేసుకున్నాను అని చెప్తాడు.కానీ అప్పుడే నీ దగ్గరనుంచి క్లారిటీ తీసుకుందాం అనుకుంటే ఎక్కడ సూర్య ఫ్యామిలీకి డౌట్ వస్తుందో అని ఊరుకున్నాను అని చెప్తాడు.
అందరూ ఆనందంతో ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు నీరజ్ తల్లికి జరిగిందంతా చెప్తాడు. ఆనందంతో పొంగిపోతుంది శారదమ్మ. ఆర్య కి ఫోన్ కలుపు నేను మాట్లాడాలి అని నీరజ్ కి చెప్తుంది. నీరజ్ ఫోన్ చేసి శారదమ్మకి ఇస్తాడు.
శారదమ్మ: ఆర్య ఎలా ఉన్నావు అని అడగటంతో ఉన్నాను అంటే ఉన్నాను. అను ని పిల్లల్ని చూడాలనిపిస్తుంది ఒకసారి తీసుకొని రా అని చెప్తుంది.
ఆర్య : సమయం చూసుకొని తప్పకుండా తీసుకొని వస్తాను అంటాడు. శారదమ్మ అను కి ఫోన్ ఇవ్వమనడంతో ఫోన్ అనుకిస్తాడు.
శారదమ్మ : కోడలితో మాట్లాడి అలా ఎలా వెళ్ళిపోయావు, మమ్మల్ని వదిలి ఎలా ఉండగలిగావు అని ఎమోషనల్ అవుతుంది.
అను: నేను మనిషిని మాత్రమే దూరంగా ఉన్నాను కానీ మనసంతా మీ దగ్గరే ఉంది అంటుంది. మరెప్పుడు ఈ కుటుంబానికి ఆర్య కి దూరం కావొద్దు అని శారదమ్మ చెప్పడంతో అను అందుకు సరే అంటుంది.
అప్పుడు నీరజ్, జెండే, శారదమ్మ అందరూ పిల్లలతో ఆనందంగా మాట్లాడుతారు.
మరోవైపు దివ్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది.
సుగుణ : ఊరుకో జరిగిందంతా మన మంచికే అనుకో అని ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్య వాళ్ళు వచ్చేసరికి ఇంట్లోకి కొత్త దంపతులు వస్తున్నారు ఆడపిల్ల ఏడవకూడదు కాస్త పక్క గదిలోకి వెళ్ళు అని చెప్పి జ్యోతి కి హారతి తీసుకురమ్మని చెప్పి హడావిడిగా ఆర్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
దివ్య : అమ్మకి నా జీవితం పాడైపోయింది అనే బాధ ఏమాత్రం లేదు ఎంత ఆనందంగా కొడుకు దగ్గరికి వెళ్తుందో అని జ్యోతి కి ఉష కి చెప్తుంది.
ఉష: కొడుకు మీద ఇంత ప్రేమ చూపిస్తుంది రేపు అతను సొంత కొడుకు కాదు అని తెలిస్తే ఏమైపోతుందో అని తల్లి కోసం బాధపడుతుంది.
ఆర్య దంపతులను బయటే ఉండమని చెప్పి జ్యోతి చేత హారతి ఇప్పించి లోపలికి రమ్మంటుంది సుగుణ. యాదగిరి, పిల్లలు ఆర్య దంపతులను పేర్లు చెప్పి లోపలికి రమ్మని ఆటపట్టించడంతో వాళ్లు అలాగే చేస్తారు.
సుగుణ: తర్వాత కొడుకుని కోడల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్లి ఏనాటి బంధమో ఈరోజు మా ఇంటి కోడలు అయ్యావు ఇకమీదట ఈ ఇంటి బాధ్యత నీదే అని చెప్పి దీపం వెలిగించమంటుంది. దీపం వెలిగిస్తుంది అను.
అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.