Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో హాస్పిటల్ నుంచి వచ్చేసిన అను నేరుగా ఇంటికి బయలుదేరుతుంది. అదే సమయంలో అభయ్ అక్కికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు.


అభయ్: టిఫిన్ తిను అక్కి, అమ్మ కార్తీక్ పౌర్ణమి రోజు గుడిలో పడుకుంటుంది కదా, అప్పుడు మనల్ని కూడా తీసుకొని వెళ్ళేది గుర్తుందా, అలాగే ఈరోజు కూడా పడుకొని ఉంటుంది. తను వచ్చేటప్పటికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది.


అక్కి : మరి ఈసారి కూడా తీసుకు వెళ్ళొచ్చు కదా..


అభయ్ : అప్పుడు మనం ముగ్గురమే ఉండే వాళ్ళం అందుకే తీసుకుని వెళ్ళిపోయేది ఇప్పుడు మనకు తోడుగా నానమ్మ, ఉష అక్క వాళ్ళు ఉన్నారు కదా అందుకే తీసుకు వెళ్ళలేదు. అమ్మ వచ్చేలోపు నువ్వు టిఫిన్ చేస్తే నిన్ను గుడ్ గర్ల్ అంటుంది అని చెప్పి ఆమె చేత టిఫిన్ తినిపిస్తాడు అభయ్.


ఇదంతా చూస్తున్న సుగుణ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకుంటుంది.


ఉష: ఎందుకమ్మా కన్నీరు.


సుగుణ : అభయ్ ని చూస్తే ముచ్చటేస్తుంది, ఎంత చిన్న వయసులోనే ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. నిజంగా రాధ ముత్యాలాంటి పిల్లలని కన్నది ఇలాంటి పిల్లలకి తండ్రి ప్రేమ కూడా అందితే ఇంకా బాగుంటుందనిపిస్తుంది అంటుంది.


మరోవైపు ఇదంతా జలంధర్ చేయించాడని తెలుసుకున్న జెండే ఆ విషయాన్ని ఆర్యకి చెప్తాడు.


నీరజ్ : వాడికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా బుద్ధి రాదా అంటూ కోప్పడతాడు.


ఆర్య : వాడికి నరకం చూపించాలి నా అనుని కనీసం రెండు నిమిషాలు కూడా చూసుకోనివ్వలేదు అలాంటి వాడికి ప్రాణ భయం కలిగించాలి.


నీరజ్ : ఈ ప్రమాదం గురించి ఇంట్లో ఏమని చెప్తారు.


ఆర్య : నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను కానీ మీరు ఆ జలంధర్ సంగతి చూడండి.


మరోవైపు ఇంటికి వచ్చిన అనుని చూసి ఆనందపడుతుంది సుగుణ. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది.


అను: గుడిలో ప్రవచనాలు జరుగుతుంటే అక్కడే ఉండిపోయాను.


సుగుణ: పిల్లలు నీకోసం బాగా బెంగ పెట్టుకున్నారు, అక్కి అయితే టిఫిన్ కూడా చేయలేదు. అభయ్ కబుర్లు చెప్పి తన చేత టిఫిన్ తినిపించాడు నిజంగా నీ పిల్లలు ముత్యాలు.


అను :అవును, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టే ఆనందంగా లేకపోయినా ఈ మాత్రం బ్రతుకుతున్నాను.


సుగుణ: వెళ్ళు పిల్లలు నీ మీద బెంగ పట్టుకున్నారు వాళ్లకు ఒకసారి కనిపించు అని చెప్పటంతో పిల్లల దగ్గరికి వెళ్తుంది అను.


పిల్లలిద్దరూ ఆనందంతో తల్లిని హత్తుకుంటారు. రాత్రంతా గుడిలోనే ఉన్నావా అని అడుగుతారు. అవును అంటుంది అను.


అక్కి : మమ్మల్ని, ఉష అక్కని కూడా తీసుకు వెళ్ళచ్చు కదా..


అను: వచ్చేద్దామని అనుకున్నాను కానీ ప్రవచనాలు వింటూ ఉండిపోయాను అని అక్కికి చెప్పి మనసులో మాత్రం మీకు దగ్గరగా మసులుకుంటున్నాము అందుకే మీ ప్రాణాలు మీదికి వచ్చింది సార్. ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని మనసులో అనుకొని పిల్లలతో లగేజీ సర్దుకోమని చెప్తుంది.


పిల్లలు: ఎందుకమ్మా ఇక్కడ బానే ఉంది కదా నానమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా.


అను: ఎన్ని రోజులు ఉన్నా మనం మన ఇంటికి వెళ్లి తీరవల్సిందే కదా.


అక్కి: కానీ నేను ఫ్రెండ్ ని వదిలి రాలేను.


అభయ్ : పోనీ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు కదా అని అడగటంతో అందుకు ఒప్పుకుంటుంది అను.


అందుకు పిల్లలిద్దరూ ఆనందపడతారు. బ్యాగులు సర్దుకోవడానికి బయలుదేరుతారు.


మరోవైపు జైల్లో ఉన్న జలంధర్ ఆర్య చావు కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలోనే తన సెల్ లో పొగ కొమ్ముకోవడంతో ఊపిరి అందక విలవిలలాడుతూ ఉంటాడు. పోలీసులు అక్కడ పొగ పెడుతుండడం చూసి ఏం చేస్తున్నారు, ఆపండి అంటూ కేకలు వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యని చూసి షాక్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.