Prema Entha Madhuram  Serial Today Episode: అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్లిన గౌరి, శంకర్‌ లను పిచ్చివాడు చూసి మీ ప్రేమ గెలిచింది. జన్మజన్మల దాటి మీ ప్రేమ గెలిచింది అంటుంటాడు. ఆనాటి బంధం ఈనాటి అనుబందం మీదే ప్రకృతి సైతం చలించిపోయి కన్నీరు కార్చిన ముగింపు మరో కొత్త మలుపు తీసుకుంది. చరిత్రగా మిగిలిపోతుంది అనుకుంది. కానీ చరిత్ర తిరగరాస్తుంది. అటుంటాడు. ఆయన మాటలు పట్టించుకోకుండా అందరూ లోపలికి వెళ్తుటారు. గౌరి కిందపడబోతుంటే శంకర్‌ పట్టుకుంటాడు. దీంతో ఆ పిచ్చొడు ఆ చేయి వదలకు.. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అంటాడు.


శంకర్‌: ఏవండి ఆయన మీ గురించే చెప్తున్నట్టున్నాడు. ఎందుకైనా మంచిది పట్టుకునే ఉంటాను. రండి ఇలాగా మళ్లీ పడిపోతారు అని చెప్తున్నాడు.


శ్రీను: అన్న నా పెళ్లికి వచ్చినందుకు చాలా థాంక్స్‌ అన్న..


శంకర్‌: ఏంట్రా శ్రీను ఎగ్జయిట్‌మెంట్‌ అవుతున్నావు. పెళ్లి ఇక్కడ పెట్టావు ఖర్చు తక్కువ అవుతుందనా..?


శ్రీను: కాదన్నా ఈ గుడి చాలా మహత్యం అయిందట. ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటలు చాలా సంతోషంగా ఉంటారట.


శంకర్‌: ఓహో అంత మహత్యం గల దేవుడన్న మాట.


 దీంతో పిచ్చోడు కూడా దేవుడి మహత్యం కాబట్టే మీరు ఇక్కడి దాకా వచ్చారు. కాదు కాదు. ఆ దేవుడే రప్పించాడు. అంటాడు. ఇంతలో శ్రీను వాళ్ల అమ్మా నాన్న వచ్చి మా కొడుకు పెళ్లి మీ దంపతుల చేతుల మీదుగా జరగాలని అడుగుతారు. దీంతో గౌరి, శంకర్‌ షాక్‌ అవుతారు. మేము ఫ్రెండ్స్‌ అని చెప్తారు. కానీ చూడ్డానికి మీరు సీతారాముల్లా ఉన్నారు అంటారు. దీంతో పిచ్చోడు కూడా అదే సత్యం అంటాడు. మరోవైపు హోమం జరిపించడానికి రెడీ అయి వెళ్తుంటే రాకేష్‌ వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. అభయ్‌ హోమం జరిపించడానికి అని చెప్పి రాకేష్‌ ను కూడా రమ్మంటాడు. అందరూ కలిసి హోమానికి వెళ్లిపోతారు. మరోవైపు గుడి దగ్గరకు వెళ్లిన నీలకంఠాన్ని పిచ్చోడు పిలుస్తాడు.


పిచ్చోడు: వచ్చావా..? నీకోసం ఒక అద్బుతం, ఆశ్యర్యం ఎదురుచూస్తుంది. వెళ్లు చూసి తరించు. కానీ ఎవ్వరికీ చెప్పలేవు. చూపించలేవు. నీలో నువ్వే నలిగిపోతావు.


నీలకంఠం: రామచంద్ర గుడికి వచ్చిన ప్రతిసారి ఈ టార్చర్‌ ఏంట్రా నాకు.


కోఠి: మీ పాపాలు లెక్క పెట్టేది. ఈ ఊరిలో ఒకటి నేను రెండోది ఆయనే కదండి.


నీలకంఠం: ఆ కోయదొర చెప్పిందే ఇతను చెప్తున్నాడేంట్రా.. అసలు ఏం జరుగుతుంది.


కోఠి: జరిగేదేదో జరుగుతుంది కదండి పదండి..


పిచ్చోడు: వెళ్లండి వెళ్లండి.. చూసే కళ్లను నమ్మలేరు.


నీలకంఠం: ఆ జెండే సారు కూడా ఇలాగే ఏదో చెప్పాడు కదరా..? అరేయ్‌ గుడిలో ఏదో పెళ్లి జరుగుతుందిరా…? పెళ్లైనా తద్దినమైనా నా అనుమతి తీసుకోవాలి కదరా..?


అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లగానే మధ్యలోనే కోఠి ప్రసాదం కోసం వెళ్లిపోతాడు. నీలకంఠం లోపలికి వెళ్తాడు. అక్కడే శంకర్‌ కనిపిస్తాడు. దీంతో నీలకంఠం షాక్‌ అవుతాడు. ఆర్యవర్థన్‌ ను గుర్తు చేసుకుని భయంతో వణికిపోతుంటాడు. శంకర్‌ వెళ్లిపోతాడు. కోఠి ప్రసాదం తీసుకుని వస్తాడు. నీలకంఠం నేను ఆర్యవర్థన్‌ ను చూశానని చెప్తాడు. కోఠి అసలు నమ్మడు. మీకు పిచ్చి పట్టిందని తిడతాడు. ఇంతలో హోమం చేయించడానికి అభయ్‌, అకి, జెండే గుడికి దగ్గరకు వస్తారు. అభయ్‌.. జెండేను పిలిచి అక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టు ఉందని అడుగుతాడు. అవునని జెండే చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!