Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా కోసం అత్తింటికి వచ్చేస్తుంది. దేవాని పట్టుకొని మన బంధానికి పట్టిన అన్ని గ్రహణాలు పోయాయి.. ఇక మనకు సంతోషాలు తప్ప అవరోధాలు ఉండవు అని అంటుంది. దేవా ఏం మాట్లాడకుండా దూరంగా వెళ్లిపోతాడు.
మిథున దేవా దేవా ఏమైంది దేవా నా కోసం నువ్వు మా ఇంటికి రాకపోతే బిజీగా ఉన్నావ్ అనుకున్నా.. కానీ నేను మీ ఇంటికి వచ్చినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు.. ఏమైంది దేవా.. రెండు రోజుల క్రితం నేను చూసిన దేవా వేరు ఇప్పుడు ఈ దేవా వేరు.. నువ్వు ఇలా ఉండవు.. ఏమైంది దేవా ఎందుకు ఇలా ఉన్నావ్.. దేవా సమాధానం చెప్పు మాట్లాడు దేవా ఎందుకు నాతో మాట్లాడటం లేదు.. ఎందుకు నన్ను దూరం చేస్తున్నావ్ అని ప్రాధేయపడుతుంది.
మిథున చాలా ప్రాధేయపడుతుంది. నీ మౌనం నాకు భయం వేసేలా చేస్తుంది. ఏమైంది చెప్పు దేవా అని మిథున అడిగితే దేవా వెళ్లిపోతాడు. బయటకు వెళ్లి ఏం చెప్పను మిథున ఈ బాధని నువ్వు జీవితాంతం భరించాలి అని చెప్పనా ఏం చెప్పను అని ఏడుస్తాడు. మిథున ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
దేవా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిథునని కాల్చిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు. పోలీసులు దేవాతో చంపాలని ప్లాన్ చేసింది నిన్ను కానీ నిన్ను కాల్చబోతే అది మిథునకు తగిలిందని అంటారు. దేవా ఆయనతో నాకు శత్రువులు ఉన్నారు కానీ జడ్జి ఇంటికి వచ్చి కాల్చే అంత ఎవరికీ లేదు.. వాడి వెనక ఉంది ఎవరో పెద్ద వ్యక్తి ఆ షూటర్ డిటైల్స్ ఇవ్వండి అంటారు. పోలీస్ అతను దేవాతో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గ్యాంగ్‌కి సంబంధించిన వాడు అని డిటైల్స్ ఇస్తాడు. వాళ్లని పట్టుకోవడం కష్టం అని పోలీస్ అంటే ఓ రౌడీగా నాకు చాలా గ్యాంగ్‌లు తెలుసని నేను కనుక్కుంటా అని దేవా అంటాడు.
మిథున దగ్గరకు అత్త తోటికోడలు జ్యూస్ తీసుకెళ్లి ఇస్తారు. ప్రమోదిని మిథునతో డబ్బున్న వాళ్లు ఎవరినీ పట్టించుకోరు అని అనుకుంటారు కానీ నువ్వు మాత్రం మమల్ని చాలా బాగా చూసుకున్నావ్ అని అంటుంది. ఇక శారద అయితే దేవా మీ మామయ్యకి ముద్దుల కొడుకు చిన్నప్పుడు ఎంత వాడిని ప్రేమించారో రౌడీగా మారిన తర్వాత అంత ద్వేషించావు. కానీ నువ్వు దేవాని కడిగిన ముత్యంలా మార్చావమ్మా.. నువ్వు వాడిని ఎంతలా మార్చావో తెలుసా.. ఒకప్పుడు వాడి బతుకు ఒంటరిగా ముగిసిపోవాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే వాడి జీవితానికి అర్థమై లేదనే పరిస్థితికి వచ్చేశాడు. ఇక నుంచి మీ జీవితాలు సంతోషంగా ఉంటాయని శారద అంటుంది.
కాంతం అందరితో దేవా మిథునని పట్టించుకోవడం లేదు.. దూరం పెడుతున్నాడు.. మరి వీళ్ల కాపురం వెలిగిపోయేది ఏంటి నా బొంద అని కాంతం అంటుంది. చిన్న కోడల్ని శారద తిడుతుంది. మిథున మనసులో నిజమే కదా అనుకుంటుంది.
దేవా మందు తాగుతూ చాలా బాధ పడతాడు. నేను మాట్లాడటం లేదు అని నువ్వు ఎంత బాధ పడుతున్నావో నీతో మాట్లాడకుండా ఉండాల్సినందుకు నేను అంతే బాధ పడ్డాను అని అనుకుంటాడు. నరకాన్ని చూస్తున్నా మిథున అని ఏడుస్తాడు. త్వరగా ఇంటికి వచ్చి నిన్ను చక్కగా చూసుకోవాలి అని ఉంది కానీ నీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అని అనుకుంటాడు. దేవా దగ్గరకు అతని ఫ్రెండ్స్ వచ్చి వదిన ఎదురు చూస్తుంటుంది వెళ్లు మచ్చా.. అని అంటారు. ఏం జరిగిందో చెప్పమని దేవాని అడుగుతారు. దేవా కోపంగా వాళ్ల మీద అరిచి వెళ్లమని చెప్తాడు.
మిథున దేవా కోసం ఎదురు చూసి చూసి పడుకుండి పోతుంది. దేవా అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్న మిథుని చూసి తల నిమరాలి అని ప్రయత్నించి మామ మాటలు గుర్తొచ్చి వెనక్కి వెళ్లిపోతాడు. మిథునని దూరం నుంచి చూసి ఏడుస్తాడు. నీ ప్రేమ లేకుండా బతకలేనంత ప్రేమించేలా చేశావ్.. నీ చేతిలో చేయి వేసి అందరి ముందు నీ తోడు లేకుండా బతకలేను అన్నంత ప్రేమ వచ్చేలా చేశావ్ ఎలా బతకాలో అర్థం కావడం లేదు మిథున అని ఏడుస్తాడు. మిథునకు దుప్పటి కప్పేసి వెళ్లిపోతుంటే మిథున దేవా చేయి పట్టుకుంటుంది. మిథున కూడా నిద్ర లేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.