Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక సుభాష్‌తో తన ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటే సహస్ర వచ్చి ఎదురుగా నిల్చొంటుంది. అంబిక మనసులో ఇది గానీ వినేసిందా.. విహారిని దెబ్బతీయాలని అనుకుంటున్నాం అని తెలిస్తే అస్సలు ఊరుకోదు అని అనుకుంటుంది.
సహస్ర వచ్చి మాట్లాడగానే అంబికకు సహస్ర వినలేదు అని అర్థమైపోతుంది. ఇక అంబిక లక్ష్మీ గురించి మాట్లాడి ఎలా అయినా లక్ష్మీని పంపేలా చూడాలని అంటుంది. లక్ష్మీ విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విహారి ప్రపోజ్ చేయడం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీ ఏడుస్తుంటే వసుధ, చారుకేశవ అక్కడికి వస్తారు. ఎక్కడికి వెళ్లావ్ వదినతో ఎందుకు వెళ్లావ్ అని వసుధ అడుగుతుంది. దాంతో లక్ష్మీ విడాకుల కోసం లాయర్ దగ్గరకు వెళ్లామని చెప్తుంది. విడాకులు పేపర్లు చింపేశా కదా అని వసుధ అంటే దానికి లక్ష్మీ ఏడుస్తూ ఈ సారి నేనే విడాకులు అడుగుతున్నట్లు లాయర్ దగ్గరకు వెళ్లి అప్లే చేయడానికి వెళ్లామని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయి అలా ఎలా ఒప్పుకున్నావ్ అని అడుగుతారు.
లక్ష్మీ ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. యమున మేడ మీద నుంచి కోర్టు నోటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పోస్ట్ మెన్ వస్తే లక్ష్మీని పిలిచి యమున కోర్టు నోటీస్ తీసుకోమని చెప్తుంది. లక్ష్మీ పరుగులు పెడుతుంది. లక్ష్మీ పరుగున వెళ్తూ విహారిని ఢీ కొడుతుంది. విహారి లక్ష్మీని దగ్గరకు లాక్కొని హగ్ చేసుకుంటాడు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. లక్ష్మీ సారీ చెప్పి వెళ్లిపోతుంది. విహారి వెళ్లిపోతాడు.
లక్ష్మీ కిందకి వెళ్లే సరికి పోస్ట్మెన్ బయట అంబికను చూసి విహారి గారికి పోస్ట్ వచ్చిందని చెప్పి ఇస్తాడు. అంబిక అది తీసుకుంటుంది. లక్ష్మీ అది చూసి చాలా కంగారు పడుతుంది. అంబిక చూస్తే అందరికీ విషయం తెలిసిపోతుందని కంగారు పడుతుంది. ఇంతలో అక్కడే చారుకేశవ ఉండటం చూసి లక్ష్మీ కంగారుగా సైగ చేసి తీసుకోమని అంటుంది. చారుకేశవ లాక్కుంటాడు. ఇంతలో అంబిక అది నీకు వచ్చిన పోస్ట్ కూడా కాదు కదా అని మళ్లీ బావ దగ్గర నుంచి తీసుకుంటుంది. అంబిక అది తీసుకొని హాల్‌లోకి వెళ్తే ఎదురుగా వచ్చిన పద్మాక్షిని గుద్దేస్తుంది.
పద్మాక్షి ఏంటే ఆ కంగారే అని అంటే విహారికి పోస్ట్ వచ్చిందని చెప్తుంది. కింద పడిన ఆ పోస్ట్‌ని సహస్ర తీసి చూస్తుంది. అందులో డైవర్స్ నోటీస్ ఉండటం చూసి షాక్ అయిపోతుంది. బావకి వచ్చింది కదా నేను ఇస్తా అని అందరి దగ్గర కవర్ చేస్తుంది. ఇక తాను ఆ కవర్ విహారికి ఇస్తే ప్రాబ్లమ్ అని అత్త చేతిలో పెట్టేస్తుంది. లక్ష్మీకి ఇచ్చి నువ్వే విహారికి ఇచ్చి సంతకం చేసేలా చేయ్ అని అంటుంది. లక్ష్మీ తీసుకొని వెళ్తుంది.
ప్రకాశ్ గదిలో ఉంటే విహారి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. ప్రకాశ్ చాలా కంగారు పడతాడు. ఇందాకే కొట్టావ్ కదరా మళ్లీ ఏంట్రా వచ్చావ్ అంటే.. చచ్చిన పాముని ఎంత కొట్టినా వేస్ట్ అని అంటాడు. ఇక ప్రకాశ్‌తో ఏంట్రా నన్ను చూస్తేనే భయపడే వాడివి ఇప్పుడు ఈ కొత్త నాటకంతో మా ఇంటికి వచ్చావ్ నీతో ఈ నాటకం ఆడిస్తుంది ఎవరు అని అడుగుతాడు. నన్ను ఎవరూ పంపలేదు నేనే వచ్చా అని అంటాడు. నేను లక్ష్మీ మెడలో తాళి కట్టాను అని తెలిసి కూడా నువ్వు భర్తగా రావడం ఏంటి ఏంటి నీ ప్లాన్ అంటే ఇందులో ప్లానేంటిరా నేను లక్ష్మీ భర్తనిరా అని అంటాడు. దాంతో నువ్వు లక్ష్మీ భర్తవా అని విహారి ప్రకాశ్‌ని చితక్కొడతాడు. ప్రకాశ్ విహారితో నా మీద ఇంకొక్క దెబ్బ పడినా నీకు లక్ష్మీకి పెళ్లి అయిందని చెప్పేస్తా అంటాడు. నేను ఎలా చెప్పలేకపోతున్నా నువ్వు వచ్చి నిజం చెప్పరా అని విహారి అంటాడు. నీ వెనక ఉన్నది ఎవరో కనిపెడతా.. ఈ లోపు నువ్వు లక్ష్మీని బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నీ శవం బయటకు వెళ్తుందని విహారి వార్నింగ్ ఇస్తాడు.
విహారి డల్‌గా ఉంటే సహస్ర వెళ్లి ఏంటి బావ ఆలోచిస్తున్నావ్ అంటుంది. లక్ష్మీ కోర్టు నోటీస్ పట్టుకొని వెళ్తుంది. సహస్రని చూసి పక్కకు వెళ్లి విహారికి కాల్ చేస్తుంది. లక్ష్మీ కాల్ చూసి విహారి కంగారు పడి సహస్రని చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. విహారి పేరు పెట్టకుండా ఏంటి అంటాడు. దానికి లక్ష్మీ విహారి గారు మీతో మాట్లాడాలి రండి అని చెప్తుంది. సహస్రకు విహారి బయటకు వెళ్తా అని చెప్తే సరే అంటుంది. సహస్ర తనలో తాను నాకు తెలుసు బావ నువ్వు ఆ లక్ష్మీని కలవడానికి వెళ్తున్నావని.. నోటీసు గురించి తెలుసు మీరు విడిపోతారు అని కూడా తెలుసు అనుకుంటుంది.
సుభాష్, అంబికలు కొన్ని సైట్స్‌లో బాంబ్‌లు పెడతారు. లక్ష్మీ, విహారి ఓ చోట కలుసుకుంటారు. ఎందుకు పిలిచావ్ అని విహారి అడిగితే లక్ష్మీ విహారికి నోటీసులు ఇస్తుంది. విహారి విడాకుల నోటీసు చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఇది కనకం ముందు ఇద్దరి సమ్మతంతో విడాకులు చేయించావు.. ఇప్పుడు నీకే కావాలి అని నాకు నోటీస్ ఇచ్చావని అంటాడు. నాకు విడాకులు కావాలి విహారి గారు అని అంటుంది. నాతో విడిపోవాలి అనుకుంటే ఇన్నాళ్లు నాకోసం ఎందుకు తాపత్రయ పడుతున్నావ్.. నాకు ఏమైనా నువ్వెందుకు తల్లడిల్లిపోతున్నావ్ అని అడుగుతాడు. అన్ని సమస్యలు నా వల్లే విహారిగారు. రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. వీటి వల్ల మీరు ప్రశాంతంగా లేరు నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా అని అంటుంది.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.