Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మూడీ గా ఉన్న అమ్ముకి ధైర్యం చెప్తుంది మిస్సమ్మ.


మిస్సమ్మ: వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తే చేయని నీ గెలుపుతోనే వాళ్ళ ఎగతాళికి సమాధానం చెప్పాలి. నువ్వు స్ట్రాంగ్ అని నాకు తెలుసు కానీ నీకు నువ్వు కూడా తెలుసుకునే టైం వచ్చింది. నీ గెలుపుతోనే అందరి నోర్లు మూయించు. నువ్వే ఇలా డీలా పడిపోతే నిన్ను చూసి ఇంక వీళ్ళేం నేర్చుకుంటారు అంటూ అంజు వాళ్ళని చూపిస్తుంది. ఆపై ఎవరి మీద ఎవరికీ కోపం ఉన్నా అన్నం మీద చూపించకూడదు అంటూ పిల్లలు అందరూ అన్నం తినేలాగా చేస్తుంది. మీకోసం స్వీట్ కూడా తీసుకువచ్చాను అంటుంది.


అంజు : స్వీట్ బాక్స్ తీసుకొని రామ్మూర్తి దగ్గరికి వెళ్లబోతుంది.


మిస్సమ్మ ఎక్కడికి అని అడగడం తో తాతయ్యకి ఇచ్చి వస్తాను అని చెప్తుంది. మిస్సమ్మ మీరు తింటూ ఉండండి నేను వెళ్లి ఇచ్చి వస్తాను అని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకుని బయలుదేరుతుంది.


మరోవైపు అరుంధతిని వెతుకుతున్న ఘోరకి అమర్ కనిపిస్తాడు.  అతనికి కనిపించకుండా దాక్కుంటాడు ఘోర. ఈయన ఇక్కడున్నాడు ఏమిటి అనుకొని ఆ విషయం మనోహరి కి చెప్పటానికి బయలుదేరుతారు. అయితే అప్పుడే అమర్ మనోహరి ని చూస్తాడు.


 అమర్: నువ్వేంటి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు.


మనోహరి : అమర్ ని అక్కడ చూసి ముందు షాక్ అవుతుంది తర్వాత తడబడుతూ పిల్లల చదువు డిస్టర్బ్ అవ్వకూడదన్నావు కదా అదే ప్రిన్సిపాల్ తో మాట్లాడదామని వచ్చాను అని చెప్తుంది.


అమర్: పిల్లలని కలిసావా అని అడుగుతాడు.


మనోహరి లేదు అని చెప్పడంతో ఇద్దరూ కలిసి పిల్లల దగ్గరికి వెళ్తారు. దారిలో మిస్సమ్మ కనిపిస్తుంది.


మనోహరి : కంగారుగా నువ్వు ఎందుకు వచ్చావు ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది.


అమర్: మేమిద్దరం కలిసే వచ్చాము అని మనోహరి కి సమాధానం చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అని మిస్సమ్మని అడుగుతాడు.


మిస్సమ్మ : తాతయ్యకి స్వీట్ ఇవ్వమని పిల్లలు చెప్తే ఇవ్వటానికి వెళ్తున్నాను అంటుంది.


ఆ మాటలకి కంగారుపడుతుంది మనోహరి. ఇప్పుడు అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లని తెలిసిపోతుంది అని అనుకుంటూ వెళ్లొద్దు అని మిస్సమ్మ కి  చెప్తుంది.


మిస్సమ్మ: ఎందుకు అని అడుగుతుంది.


మనోహరి : అలాంటి వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి అయినా అతనితో స్నేహం ఏమిటి అని అంటుంది.


అమర్: ఆయన చాలా మంచి వారు, ఆయన కంపెనీని పిల్లలు ఇష్టపడతారు అని మనోహరికి చెప్పి స్వీట్ ఇచ్చి రమ్మని మిస్సమ్మకి చెప్తాడు.


ఎక్కడ తండ్రీ కూతుర్లు కలిసిపోతారో అని టెన్షన్ పడుతూ అమర్ వెనుక వెళ్ళిపోతుంది మనోహరి. మరోవైపు గేటు దగ్గరికి వచ్చిన మిస్సమ్మకి మీరు వెతుకుతున్న వ్యక్తి ఇప్పుడే భోజనానికి వెళ్లారు అని చెప్పడంతో అక్కడికి వెళ్లి వెతుకుతుంది. అప్పుడు మరొక వాచ్‌మ్యాన్ కనిపిస్తాడు. నేను అక్కడికే వెళ్తున్నాను నాకు ఇవ్వండి అని చెప్పటంతో మిస్సమ్మ అతనికి స్వీట్ ఇస్తుంది.


వాచ్‌మ్యాన్ : స్వీట్ బాక్స్ తీసుకొని ఎప్పుడు దగ్గుతూ ఉంటాడు మళ్ళీ స్వీట్ తింటాడు అనుకుంటాడు.


మిస్సమ్మ : ఆ మాటలు విన్న మిస్సమ్మ ఏమన్నారు అంటుంది.


వాచ్‌మ్యాన్ : నిజమేనమ్మ అతను బాగా దగ్గుతాడు అయినప్పటికీ స్వీట్లు తింటూ ఉంటాడు. దగ్గు ఎలా తగ్గుతుంది అంటాడు.


మిస్సమ్మకి తన తండ్రి గుర్తుకు వస్తాడు.


వాచ్‌మ్యాన్ రామ్మూర్తికి స్వీట్ ఇచ్చి ఒక అమ్మాయి తీసుకొని వచ్చింది అని చెప్తాడు. తన కూతురే అని తెలియని రామ్మూర్తి ఆ అమ్మాయిని  వెతుక్కుంటూ వస్తాడు కానీ ఇద్దరు మిస్ అయిపోతారు.


మరోవైపు అమర్ పిల్లలని మోటివేట్ చేస్తూ ఉంటాడు. కొడైకెనాల్లో నువ్వు ఎస్ పి ఎల్ గా ఉండే దానివి కదా ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగించు. ఓడిపోతాం అనే భావన దారులన్నీ మూసుకుపోయేలాగా చేస్తుంది అని ధైర్యం చెప్తాడు. ఇంతలో బెల్ మోగటంతో పిల్లలు క్లాస్ కి, అమర్ వాళ్ళు బయటికి వెళ్లిపోతారు. వాళ్లతో పాటే కారెక్కి  వెళ్ళిపోతున్న ఆత్మను చూసి పట్టుకోలేకపోతున్నాను అని ఘోర కోపంతో రగిలిపోతాడు. కారులో వెళ్తున్న మిస్సమ్మకి ఎందుకో తన తండ్రి బాగా గుర్తుకు వస్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: నోట్లో కాల్చితే వెనుక నుంచి బుల్లెట్, అలా ఎలా? - ‘సైంధవ్’ సీన్‌పై ఫన్నీ ట్రోల్స్ - స్పందించిన దర్శకుడు