Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కారు ఎక్కి డోర్ వేసేసిన తర్వాత కిడ్నాపర్ చేతిలో ఉన్న మిస్సమ్మని చూస్తుంది అరుంధతి.


కారు ముందుకు కదలడంతో మనోహరి ఆనందపడుతుంది. కానీ అరుంధతి మాత్రం టెన్షన్ పడుతూ మిస్సమ్మ అక్కడ ఉంది రాథోడ్ కారాపు, ఏవండీ రక్షించండి అంటూ కేకలు వేస్తుంది. కానీ ఎప్పటిలాగే ఆమె మాటలు ఎవరికీ వినబడవు.


అమర్ వాళ్ళు ఫంక్షన్ హాల్ కి వెళ్తారు. అక్కడ ఒక ఎస్ఐ కనిపించి పలకరిస్తాడు.


అమర్: మీరు ఎవరు అన్నట్లు అనుమానంగా చూస్తాడు.


పోలీస్: నేనండి కొడైకెనాల్ లో ఒక కేసులో మీరు నాకు బాగా హెల్ప్ చేశారు. ఆ కేసులో మీరు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నేను ఈ జాబ్ లో ఉండే వాడిని కాదు అంటాడు. ఆ తర్వాత అమర్ వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టమని చెప్పి కానిస్టేబుల్స్ కి ఆర్డర్ వేస్తాడు.


అందరూ ఎవరు కుర్చీలలో వారు కూర్చుంటారు. కానీ అరుంధతి మాత్రం మిస్సమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో వెళ్లి రక్షించండి అంటూ ఏడుస్తుంది.


మరోవైపు పిల్లలు నలుగురు ఆంజనేయస్వామికి దండం పెట్టుకుంటారు. ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావంట కదా మా తాతయ్యకి నయం అయ్యేలాగా చేయు. ఆయన చాలా మంచివారు ఆయనకు ఏమీ కాకూడదు. అలాగే మా మిస్సమ్మని ఇంట్లో వాళ్ళ అపార్థం చేసుకుని రావద్దని చెప్పారంట తను ఎంత బాధపడిందో ఏంటో తను ఇంట్లోకి వచ్చేలాగా చేయు అలాగే ఆర్జే భాగీ మాకు కనిపించేలాగా చేయు అని దేవుడిని ప్రార్థిస్తారు.


అప్పుడే మిస్సమ్మ రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది. ఆమెను మళ్లీ పట్టుకున్న రౌడీలు మాకు నిన్ను చంపాలనే ఉద్దేశం లేదు. కానీ నువ్వే ఆ పరిస్థితి తీసుకొచ్చావు అంటూ ఆమెపై కత్తి దూస్తాడు ఒక రౌడీ.


ఇంతలో అతని తలకి ఒక గాజు సీసా వచ్చి తగలడంతో కుప్పకూలిపోతాడు. అందరూ ఒకసారిగా వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ అమర్ కనిపిస్తాడు.


కిల్లర్: వీడు వెళ్లిపోయాడు కదా మళ్ళీ ఎలా వచ్చాడు అనుకుంటాడు.


అసలు ఏం జరిగిందంటే.. అరుంధతి మిస్సమని రక్షించండి అంటూ గట్టిగా అరుస్తుంది. దానిని ఫీల్ అవుతాడు అమర్. అక్కడ ఏం జరిగిందో ఊహించండి, మీకే అర్థమవుతుంది అని మిస్సమ్మ అంటుంది. అయితే అమర్ కిటికీ వెనకాతల ఎవరో ఉన్నట్లుగా కనిపించడంతో రాథోడ్ దగ్గర కీస్ తీసుకొని ఒక్కడే ఆ ప్లేస్ కి వస్తాడు. ఆ రౌడీలతో ఫైట్ చేసి వాళ్ళు పారిపోయేలాగా చేస్తాడు.


అమర్: ఒక నిమిషం నేను రావడం ఆలస్యం అయితే ఏం జరిగేదో తెలుసా? అయినా వాళ్ళు ఎవరు, నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అంటాడు.


మిస్సమ్మ : నాకు తెలియదు నేను మా మామయ్య బండి మీద వస్తుంటే అడ్డంపడ్డారు. నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్తుంది.


అమర్: సరే నీకు ఏమీ కాలేదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు డ్రాప్ చేస్తాను అంటాడు.


మిస్సమ్మ: పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ కి వెళ్ళాలి అంటుంది.


అమర్: అక్కడికెందుకు?


మిస్సమ్మ (మనసులో) : మళ్లీ ఆర్జేగా పని చేశాననే విషయం చెప్పలేదని అపార్థం చేసుకుంటారేమో.


అమర్: సరేలే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. పదా డ్రాప్ చేస్తాను అని చెప్పి తనతో పాటు తీసుకువెళ్తాడు.


మరోవైపు ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు కిల్లర్. ఈ విషయం తెలిస్తే ఆవిడ ఏమంటుందో.. ఆవిడ చెప్పిన పని నేను చేయలేదు కాబట్టి నా పని ఆవిడ చెయ్యదు అంటూ చిరాకు పడిపోతాడు.


మరోవైపు మినిస్టర్ దగ్గరికి వచ్చిన అతని పిఏ ఇక్కడ మీకు ఏదో ప్రమాదం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది త్వరగా వెళ్ళిపోదాం రండి అని మినిస్టర్ కి చెప్తాడు.


మినిస్టర్: ఇక్కడ వరకు వచ్చి అవార్డులు ఇవ్వకుండా వెళ్తే బాగోదు, సెక్యూరిటీని టైట్ చేయమని చెప్పు అంటాడు. తర్వాత అవార్డులు ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్తాడు.


ఇంతలో బయట ఏం జరుగుతుందో తెలియని మనోహరి కంగారు పడిపోతూ సెక్యూరిటీని పర్మిషన్ అడిగి బయటికి వెళ్లి ఎవరికో ఫోన్ చేస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.