Trinayani Today Episode : కాలికి గాయమై రక్తం కారుతున్నా ఎందుకు అలా నడిచావ్‌ అమ్మా అంటూ విశాల్ విశాలాక్షిని ప్రశ్నిస్తాడు. దాంతో విశాలాక్షి తప్పు ఎవరిదో తెలియాలి అంటే ఓపిక పట్టాలి నాన్న అని.. కానీ రేపు సుమన తప్పు చేస్తే మాత్రం మీరు మన్నించకండి అని అంటుంది. దీంతో అందరూ షాక్ అయి సుమన వైపు చూస్తారు. 


విక్రాంత్: ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే నీ ప్రాణాలే తీస్తాను. 
పావనా: సుమనమ్మ ఎక్కడున్న వారు అక్కడ ఉండాలి నీకు ఎందుకు చెప్పు ఇవన్నీ.
ధరందర: అనిగిమనిగి ఉండి పెట్టినవి తింటూ ఓ మూలన ఉండవే..
సుమన: ఇప్పుడు కాదు రేపు చెప్తా నేను ఏంటో..
తిలోత్తమ: విశాలాక్షి కాలికి మందు రాయండి చూడలేకపోతున్నాం.. పాపం..
విశాలాక్షి: (ఉలూచిని చూసుకోమని సుమన తమకు పాపని ఇచ్చిందని పావనా, ధురందర, ఎద్దులయ్య, డమ్మక్కలు సంతోషపడుతుంటారు. పాపకి పాలు తాగించాలి అని ధురందరకు అంటారు. అయితే అప్పుడే హాసిని వచ్చి వీళ్లలో ఎవరికీ అనుభవం లేదు అంటుంది.) నేర్చుకోని పెద్దమ్మ ఇకనుంచి ఉలూచి ఆలనాపాలనా వీళ్లలో ఎవరో ఒకరు చూడాలి అంటే అనుభవం రావాలి కదా..
వల్లభ: చిన్నమరదలు ఏం చేస్తుంది అంట.
తిలోత్తమ: పైగా పని కూడా లేదు. చిన్న పిల్లని వదిలేస్తే ఎలా..
విశాలాక్షి: తనకు పని ఎందుకు లేదు. ఈ రోజు పనికే వెళ్తుంది కదా..
విక్రాంత్: ఏ పని చేస్తుందమ్మా ఇసుక ఎత్తుతుందా.. రాళ్లు మోస్తుందా.. పక్కింటిలో పనికి వెళ్లినా సరే నువ్వు పనికిరావు పో అంటారు. 
సుమన: హలో బుల్లిబావగారు అంటూ.. మోడ్రన్‌ డ్రస్‌లో సుమన ఎంట్రీ ఇస్తుంది. అందరూ షాక్‌తో అలా చూస్తూ ఉండిపోతారు. 
విశాలాక్షి: పిల్లగల తల్లి అని ఎవరూ అనుకోకూడదు అని ఏమో..
సుమన: నాకు పెళ్లి అయిందని కూడా ఎవరూ అనుకోరు. 
నయని: ఎవరి గురించో ఎందుకు కానీ పిచ్చి డ్రస్‌ వేసుకోకుండా చీర కట్టుకొని నుదిటిన బొట్టు పెట్టుకో. 
వల్లభ: ఇది పిచ్చి డ్రస్ కాదే రిచ్ డ్రస్సే.. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు.
హాసిని: ఆఫీస్‌కి వెళ్తున్నాం.. బోర్డ్ మీటింగ్ ఉంది.
సుమన: నేను అక్కడికి వచ్చేది మీతోపాటు మీటింగ్‌లో కూర్చొడానికి.. ఎందుకు అంటే నేను కూడా బోర్డ్ మెంబర్‌ని కాబట్టి. 
నయని: బోర్డ్ మెంబర్ అని నువ్వు అనుకుంటే కాదు బాబుగారు అనాలి.
సుమన: మీ భర్తగారే నేను బోర్డ్ మెంబర్‌ని అని లెటర్‌ కూడా రాసిచ్చారు అక్క. ఇదిగో.. 
విశాల్: అవును నయని.. ఇంట్లో ఉంటే తన మానసిక కండీషన్ బాగోదు అని బోర్డ్‌ మెంబర్‌గా ఉండమని ఆర్డర్ పాస్ చేశా. 
తిలోత్తమ: అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది అంటే ఏదో అనుమానించాల్సిందే..
హాసిని: ఒకరు బాగుపడతారు అంటే ఓర్పలేరు అనుకుంటా మీరు. 
వల్లభ: నయనికి కూడా తెలీకుండా అపాయింట్ చేయడానికి ఆంతర్యం ఏంటో తెలియాలి. 
విశాల్: అన్నయ్య అక్కాచెల్లెల్లకు గొడవలకు బదులు ఆఫీస్ పనులు ఉండాలి అని చేశాను. 
హాసిని: చెల్లి విశాల్ అవకాశం ఇచ్చిన తర్వాత చిట్టీ ఇక నీ మాట వింటుందా..
విశాలాక్షి: నాన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ దుర్వినియోగం చేయరాదు. అలా చేస్తే అదృష్టం ఆవిరిఅయిపోతుంది.
తిలోత్తమ: అంటే బాధ్యతతో ఉండకపోతే సుమన ఉద్యోగం పోయినట్లేనా..
విశాలాక్షి: అవును నాన్న రాసిచ్చిన పత్రంలో షరతులు చూడలేదేమో సుమన.. 
సుమన: పిన్ని ఏముందో చదువు..
దురంధర: ఇందులో నియన నిబంధనల్లో ముఖ్యమైనది ఏంటంటే.. నీ వ్యక్తిత్వంలో కానీ అధికారదుర్వినియోగంలో కానీ అలాగే కంపెనీ ఉద్యోగులకు అసౌకర్యం కల్పించినా ఆ క్షణంతోనే నీ ఉద్యోగం అటక ఎక్కినట్లే అని ఉంది. 
విక్రాంత్‌: థ్యాంక్స్ బ్రో. చాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి ముక్కుతాడు వేశావ్.
విశాల్: రేయ్ అది సుమనకే కాదు అందరకీ వర్తిస్తుంది.
నయని: కంపెనీ రూల్స్‌ని మార్చకూడదు. సరే మీటింగ్‌కి నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాం. పద్ధతిగా చీర కట్టుకొని పాపని తీసుకొని వచ్చేయ్..
సుమన: పాప ఏ పాప.. 
తిలోత్తమ: ఇంకేపాపని గారడీ పాపని అనుకున్నావా ఏంటి..
సుమన: తననా తనని తాకడానికి కూడా నేను ఇష్టపడను.
విశాలాక్షి: అలా అన్న నువ్వే నన్న ఎత్తుకుంటావు సుమన.
సుమన: చాలు ఆపు.. 
విశాల్: సుమన ఇంట్లో నుంచి నువ్వు ఇంకా అడుగు కూడా బయట పెట్టలేదు. అప్పుడే ఇలా మాట్లాడుతున్నావేంటి.
నయని: మీరు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవడానికి బాబుగారు. 
సుమన: ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు అక్క. పెద్ద బావగారు నేను మీ కారులో వస్తాను. 
హాసిని: మరి ఉలూచి..
సుమన: ఉన్నారు కదా వాళ్లు చూసుకుంటారులే..
దురంధర: నీ బిడ్డను మేం ఎందుకు చూస్తాం.. ఇదిగో నీ బిడ్డ.. 
సుమన: పిన్ని దూరంగా ఉండు ఈ డ్రస్‌లో ఎలా ఎత్తుకోను డ్రస్ పోతుంది. ఇక ఉలూచి పాప ఏడుస్తున్నా సరే పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఇక విక్రాంత్ పాప బాధ్యత తీసుకొని పడుకోపెట్టి వస్తాను అంటాడు.
ఎద్దులయ్య: అమ్మా ఆట మొదలవుతుంది. 


మరోవైపు సుమన ఆఫీస్‌కు వెళ్తుంది. అక్కడ బిల్డింగ్‌లు సెక్యూరిటీ రెస్పెక్ట్ చూసి మురిసిపోతుంది. ఇక విక్రాంత్ పాపని ఆడిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఆరెంజ్ గౌన్​లో ఓ రేంజ్​లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య హీరోయిన్