Dhee Celebrity Special Latest Promo: బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షోల్లో ఢీ కి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ప్రతి సీజన్ ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ టెటికాస్ట్ అవుతోంది. ప్రతి బుధవారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ షో. ఈ షోకి నందు యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ బుధవారం వ్యాలెంటైన్స్ డే కావడంతో.. లవ్ థీమ్ తో ఈ షో చేశారు నిర్వాహకులు. కంటెస్టెంట్స్ అందరూ లవ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేసి ఎంటర్‌టైన్ చేశారు. హైపర్ ఆది శేఖర్ మాస్టర్ పైన వేసిన జోకులు నవ్వు తెప్పించాయి. ప్రతి కంటెస్టెంట్ తో శేఖర్ మాస్టర్ చేతికి ముద్దులు పెట్టించి ఫన్ క్రియేట్ చేశారు. ఇక తన జీవితంలో జరిగిన ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి తలచుకుని షో యాంకర్ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఏడ్చేసిన నందు..
తను చేయని తప్పుకు తనను బలిచేశారని, చేయలేదని చెప్పినా ఎవ్వరూ కనీసం పట్టించుకోలేదని ఏడ్చేశారు నందు. నీ జీవితంలో జరిగిన మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి? అని హైపర్ ఆది అడిగిన ప్రశ్నకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘నాకు సంబంధం లేని, నా ఇన్వాల్మెంట్ లేని ఒక విషయంలో పేరు లాగారు. నా గురించి న్యూస్ లో 12 రోజులు వేశారు. నేను చేయలేదని చెప్పినా పట్టించుకోలేదు. ఆ తర్వాత నా తప్పు లేదు అని తెలిశాక.. జస్ట్ చిన్న స్కోలింగ్ వేసి వదిలేశారు’’ అంటూ ఏడ్చేశారు నందు. నందును ఓదార్చిన హైపర్ ఆది.. ప్రదీప్ అన్న లేడు అని తెలియగానే ఫీల్ అయ్యాం. కానీ, ఆ తర్వాత నువ్వు ఆ ఫీలింగ్ తీసుకురాకుండా యాంకరింగ్ చేస్తున్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
శేఖర్ మాస్టర్ మదర్..
ఇక ఈ ప్రోమోలో మరో స్పెషల్ అట్రాక్షన్ శేఖర్ మాస్టర్ తల్లి. ఒక కంటెస్టెంట్ తన పర్ఫామెన్స్ లో ఆమెను కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్, ఆయన తల్లి ఇద్దరు కలిసి స్టేజ్ పై స్టెప్పులు వేశారు. తల్లిని మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఉండదు అంటూ శేఖర్ మాస్టర్ చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించాయి అక్కడి వాళ్లందరికీ. ఈ ప్రొమోలో ఇవే కాకుండా.. కొన్ని ఫన్నీ టాస్క్ లు కూడా జరిగాయి. వాలంటైన్స్ డే గురించి, ప్రేమ గురించి చెప్తూ ఎన్నో మంచి పర్ఫామెన్స్ లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ షో ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు ప్రసారం కానుంది.
Also Read: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కుమారి ఆంటీ - అథ్లెట్ నందినికి ఆర్థిక సాయం, ఇదిగో ప్రోమో