Seethe Ramudi Katnam Today Episode రామ్ సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో సీత మహాలక్ష్మికి క్షమాపణ చెప్పడానికి ఒప్పుకుంటుంది. అయితే మహాలక్ష్మి రామ్ తన కాళ్లు పట్టుకొని సారీ చెప్పాడని సీత కూడా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని మహా అంటుంది. దీంతో మహాలక్ష్మి అంత బాధగా ఉంటే సీతని సపోర్ట్ చేసిన ఎవరైనా తన కాళ్లు పట్టుకోవచ్చని అంటుంది.
సీత: నేను బాధ పడింది చాలు. నా కోసం ఎవరూ అవమాన పడకూడదు. నేనే మీ కాళ్లు పట్టుకుంటాను. అని సీత మహాలక్ష్మి కాళ్లు పట్టుకొని క్షమించమని చెప్తుంది. ఏడూస్తూ మహా కాళ్లమీద తన తల పెడుతుంది.
మహాలక్ష్మి: మళ్లీ ఇలాంటి తప్పు చేయకు. వెళ్లు.. కొడుకువు అంటే నువ్వు రామ్ గొప్ప కొడుకువి. ప్రతీ తల్లికి నీలాంటి కొడుకు ఉండాలి. నిన్ను చూసి గర్వ పడుతున్నాను. నిన్ను పెంచానే తప్ప నవమాసాలు మోసి కనలేకపోయానే అని బాధ పడుతున్నాను రామ్. మళ్లీ జన్మంటూ ఉంటే నువ్వు నా కడుపులోనే పుట్టాలి.
రామ్: ఇప్పుడు మాత్రం ఏమైంది పిన్ని. నేను మీ కన్న కొడుకునే. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా చెప్పాలి అంటే మీరు నా కన్న తల్లి కంటే ఎక్కువ.
మహాలక్ష్మి: థ్యాంక్యూ రామ్.. లవ్‌యూ.. నామీద నీకున్న ప్రేమకు నమ్మకానికి నేను చాలా సంతోషపడుతున్నాను. జన్మజన్మలకు మన తల్లీకొడుకుల బంధం ఇలానే ఉండాలి.
చలపతి: మనసులో.. ఈ దరిద్రపుగొట్టు సీన్ చూడటం కంటే వెళ్లిపోవడమే బెటర్.
సీత: మనసులో.. చనిపోయి మీరు ఏ లోకంలో ఉన్నారో తెలీదు అత్తమ్మ. మీరు లేని ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలిస్తే తట్టుకోలేరు. కొడుకు అరగంటలో చనిపోతాడు అని వార్నింగ్ ఇస్తే ఏ తల్లి అయినా అరనిమిషం అయినా ఆగుతుందా.. ఆఖరి క్షణం వరకు కొడుకు చావు కోసం ఎదురుచూస్తుందా.. మీ అబ్బాయిని మహాలక్ష్మి తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంది. నేను ఈ ఇంటికి వచ్చేంతవరకు మీ అబ్బాయికి కన్నతల్లి అని ఒకరు ఉన్నారని తెలీకుండా పెంచుతుంది. మంచి చెడు చెప్పడానికి మీరు లేరు మీ తరుపున నేను పోరాడుతున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు మీ అబ్బాయి కోసం పోరాడుతూనే ఉంటాను. అలాగే మీ గురించి కూడా తెలుసుకుంటాను.
రేవతి: సారీ సీత.. ఎప్పుడూ నువ్వు గెలవాలి అని చెప్పేదాన్ని. మొదటి సారి రామ్ గురించి నిన్ను ఓడిపోమని చెప్పాను.
సీత: లేదు పిన్ని మీరు నా మంచి కోరి చెప్పారు. ఆయన కోసం నేను తప్పక తలదించుకున్నాను.
చలపతి: నువ్వు ఓడిపోయి గెలిచావమ్మా.. వాళ్లు గెలిచి ఓడిపోయారు. నువ్వేం బాధ పడకు. ఇలాగే వాళ్ల మీద పోరాడుతూ ఉండు.
రేవతి: ఈ ఇంట్లో మహాతో ఎవరూ చేయలేని యుద్ధం నువ్వు చేస్తున్నావ్ సీత.
చలపతి: మహాని ఎదురించి మేం ఏం చేయలేం మమల్ని అర్థం చేసుకో తల్లీ.
రేవతి: నేను ప్రేమించిన వాడితో వెళ్లిపోయి హాయిగా బతకాల్సిన దాన్ని. ఆరోజు అలా చేయలేకపోయాను. ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ప్రేమను చంపుకొని బతుకు మీద భవిష్యత్‌మీద ఆశలు చంపుకొని జీవచ్ఛవంలా బతుకుతున్నాను. నాలా నీ జీవితం కాకుండా ఉండాలి అంటే నువ్వు ఇలాగే పోరాడుడూ ఉండాలి సీత.
చలపతి: మహాలక్ష్మి వల్లే నా భార్య బిడ్డలు నాకు దూరం అయ్యారమ్మా. నా పిరికితమమే వాళ్లని దూరం చేసింది. నీకు రామ్ దూరం అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు పోరాడకతప్పదు.
సీత: పోరాడుతాను బాబాయ్. నా రాముడి కోసం పోరాడి తీరుతాను.
సూర్య: మధు నేను ఆఫీస్‌కు వెళ్తున్నా.. నేను ఈ జాబ్‌లో చేరడం నీకు నిజంగానే ఇష్టమేనా మధు.
మధు: నన్ను చూస్తే నీకు అర్థం కావడం లేదా సూర్య. నేను నిన్ను ఇష్టపడ్డాను. ప్రేమించాను. మా ఇంట్లో వాళ్లని కాదని నిన్ను పెళ్లిచేసుకున్నాను. మా ఇంట్లో ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా నీ కోసం భరిస్తున్నాను. జలజ అక్క అన్న మాటలకు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే నేను ఏం చేయగలను సూర్య. మనకంటూ సొంత సంపాదన ఉండాలి అనుకున్నాను. అంతే.. నేను ఈ క్షణం వరకు నీతో ఫెయిర్‌గానే ఉన్నాను సూర్య.
సూర్య: నువ్వు నాతో ఫెయిర్‌గానే ఉంటావు అనుకుంటున్నాను. పెళ్లికి ముందు మన ప్రేమ బలంగా ఉండేది. పెళ్లి తర్వాత కూడా మన బంధం అంతే బలంగా ఉందని నాకు అనిపించినప్పుడు నేను నమ్ముతాను.
మధు: ఏమైంది సూర్యకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. జాబ్ లేనప్పుడు ఓకే జాబ్ వచ్చాక కూడా ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు. ఈ టైంలో సూర్యకు జాబ్ రావడం మంచిది అయింది. లేదంటే ఇంకా నన్ను విమర్శించి అవమానించేవాడు..
మహాలక్ష్మి: ఏంటి టైలర్ ఎత్తి పెట్టిన మెషిన్‌ను మళ్లీ బయటకు తీసి బట్టలు కుడుతున్నావ్.. నీ బతుకు ఇదే అని అర్థమైపోతుందా.. నా పవర్ ఏంటో తెలిసొచ్చిందా..
సీత: కాదు ప్రాణం ఉన్న మనుషులతో మాట్లడటం కన్నా.. ప్రాణంలేని మెషిన్‌తో నా మనసు పంచుకోవడం మంచిది అనిపించింది.
మహాలక్ష్మి: ఇంత జరిగినా నీకు బుద్ధిరాలేదేంటి.
సీత: అంతగా ఏం జరిగిందేంటి సంబరపడిపోతున్నారు.
మహాలక్ష్మి: నిన్ను నీతో నా కాళ్లు పట్టించుకున్నాను. ఇంకా ఏం జరగాలి.
సీత: వసుదేవుడు అంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు నేనెంత.
మహాలక్ష్మి: ఏయ్.. ఎక్కువ మాట్లాడావంటే నువ్వు పట్టుకున్న నా కాలి కింద నిన్ను తొక్కిపడేస్తా.
సీత: నిన్న మీ పెంపుడు కొడుకు మీ మాట విన్నాడని రెచ్చిపోకు.
మహాలక్ష్మి: పెంపుడు కొడుకు ఏంటే రామ్ నా సొంత కొడుకు. సొంత కొడుకు.
సీత: మామని మీరు నవమాసాలు మోశారా కన్నారా.. రామ్‌గారిని కన్నది మా అత్త సుమతి గారు. ఈ ఇంట్లో మీరు గోడకి వేసిన సున్నం లాంటివారు.
మహాలక్ష్మి: ఈ ఇంట్లో నేను గ్రేట్ కాకపోతే నువ్వా..
సీత: అవును ఇప్పటివరకు మా అత్తమ్మ సుమతి గారు ఈ ఇంటికి గ్రేట్. ఆవిడ కన్న కొడుకు భార్యగా ఈ ఇంటి వారసురాలిగా ఇకపై ఈ ఇంట్లో నేను గ్రేట్.. ఇన్నాళ్లు మీరు గొప్ప అని పొగిడిన నోళ్లతోనే నేను గొప్ప అనిపిస్తాను. నిన్న మామ మీ మాట విన్నారని సంబరాలు చేసుకున్నారు కదా.. అదే రామ్ గారిచేత సీత గ్రేట్ అనిపిస్తా.. మీ పెంపుడు కొడుకు మీ దగ్గరకు వచ్చి సీత గ్రేట్ కదా పిన్నిఅనేలా చేస్తా..
మహాలక్ష్మి: ఇంపాజిబుల్..
సీత: మీరు కూడా నీ పెళ్లాం సీత చాలా గొప్పదిరా అనేలా చేస్తా. మీ నోటితో మీరే నా గొప్పని ఒప్పుకునేలా చేస్తా..
మహాలక్ష్మి: ఏంటే పగటి కలలు కంటున్నావా. లేక నిన్న నా కాళ్లు పట్టుకున్న షాక్‌లో పిచ్చి పట్టేసిందా.. అయినా ఎప్పటిలో జరిపిస్తావు. అప్పటి వరకు నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను కదా.. వెళ్లగొట్టేస్తాను. నువ్వు చెప్పింది జరగాలి అంటే నువ్వు చాలా జన్మలు ఎత్తాలి.
సీత: యుగాలు కాదు. జన్మలు కాదు.. నాలుగంటే నాలుగు రోజుల్లో నేను చెప్పింది చేసి చూపిస్తా..
మహాలక్ష్మి: ఈ నాలుగు రోజుల్లోనా.. నీకు చాలా అత్యాశ ఉందే.. నువ్వు రామ్‌ని నీ వైపునకు తిప్పుకోవడం నేను నిన్ను మెచ్చుకోవడం అంటే అది మూడో ప్రపంచ యుద్ధం లాంటిది. ఇక ఇద్దరూ సవాళ్లు విసురుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'నాగ పంచమి' సీరియల్ ఫిబ్రవరి 12th: పంచమి నిర్ణయంతో ఫుల్ ఖుషీలో మోక్ష.. రగిలిపోతున్న వైదేహి!