Sri Devi Drama Company Latest Promo: ఈటీవీలో వ‌చ్చే ఎంటర్టైన్మెంట్ షోల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. ప్ర‌తి ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు ప్ర‌సార‌మ‌య్యే ఈ షోకి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ‘జ‌బ‌ర్ద‌స్త్’ క‌మెడియ‌న్స్ తో పాటు స్పెష‌ల్ గా ఎంతోమంది ఈ షో ద్వారా త‌మ టాలెంట్ నిరూపించుకుంటారు. ఇక ప్ర‌తి ఆదివారం ఒక్కో థీమ్ ప్లాన్ చేస్తారు నిర్వాహ‌కులు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సాగనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో ఆడియన్స్ ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ప్రోమో అదిరిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్ర‌తి ఒక్క‌రు. 

ఈ మ‌ధ్యే రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న 'మంగ‌ళ‌వారం' సినిమా థీమ్ తో షో డిజైన్ చేశారు. ఈ సినిమాలో అక్ర‌మ సంబంధాల గురించి గోడ మీద రాసిన‌ట్లుగా.. ఈ షోలో కూడా ఆ థీమ్ తో ప్రోమో మొద‌లుపెట్టారు. '90’s - మిడిల్ క్లాస్ మెమోరిస్' టీమ్ ఈ వారం షోలో సంద‌డి చేయ‌నున్నారు. సింగ‌ర్స్ స్పెష‌ల్ ప‌ర్పామెన్స్, డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్, ఇన్ స్పైరింగ్ స్పోర్ట్స ప‌ర్స‌న్ స్టోరీతో ప్రోమో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 

ఇక ప్ర‌ోమో విశేషాలు చూస్తే.. "ఇమాన్యుయ‌ల్, వ‌ర్షా మ‌ధ్య సంబంధం ఉందంటా" అంటూ ఆది కేక‌లు వేయ‌డంతో అంద‌రూ వ‌స్తారు. ఎవ‌రెవ‌రికో సంబంధం ఉందంట, క‌నిపెట్టేస్తాను అంటూ ఆది చెప్తాడు. ఆ త‌ర్వాత 90'S టీమ్ ఎంట్రీ ఇచ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ న‌రేశ్, ఆది, ఇమాన్యుయ‌ల్ తో క‌లిసి శివాజీ చేసిన కామెడీ ఆకట్టుకుంది. ‘90s’ వెబ్ సీరిస్‌లో పిల్లల మార్కులు చెక్ చేసే సీన్‌ను రీక్రియేట్ చేశారు. 

 ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోకి కుమారీ ఆంటీ ఎంట్రీ.. 

'శ్రీ దేవి డ్రామా కంపెనీ'లో కుమారీ ఆంటీ కూడా ప్రత్యక్షమయ్యారు. "హాయ్ నాన్న‌.. ఏం కావాలి?" అని ఆమె అంద‌రికీ అన్నం వ‌డిస్తుంటే.. బుల్లెట్ భాస్క‌ర్, హైప‌ర్ ఆది ఆమెతో కామెడీ చేశారు. ఇక ఆ త‌ర్వాత 'బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లు కొట్టే అనుబాంబుబు కుర్రాళ్లు' అంటూ న‌లుగురు అమ్మాయిలు వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. 

అథ్లెట్ నందిని అగసెరకు ఆర్థిక సాయం.. 

ఈ షో  ఫేమ‌స్ అయిన వాళ్ల‌నే కాదు.. టాలెంట్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంది. అలా ఇప్ప‌టికి ఎంతోమందికి హెల్ప్ చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో కూడా 2022లో బ్రాన్జ్ మెడ‌ల్ సాధించిన అథ్లెట్ నందిని అగ‌సెర‌కు సాయం చేశారు. ఆమెకు తినేందుకు తిండి లేద‌ని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకుంది. దీంతో  ఇంద్ర‌జ‌, ఆది, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు ఆమెకు సాయం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రి 18 ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో ప్రసారం కానుంది. 

Also Read: చాలామంది నన్ను తిట్టారు, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌పై సందీప్ కిష‌న్ రియాక్ష‌న్