Sundeep Kishan Comments On Kumari Aunty Food Stall: కుమారీ ఆంటీ.. ఇప్పుడు ఈమె ఫేమ‌స్. సోష‌ల్ మీడియా స్టార్. బుల్లితెర‌పై క‌నిపించారు ఈ వంట‌ల ఆంటీ. అంతేకాదు.. ఏకంగా ఒక సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఈమె ఫుడ్ స్టాల్ కి వెళ్లారు సందీప్ కిషన్ అండ్ టీం. 'ఊరు పేరు భైర‌వకోన' సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అక్క‌డికి వెళ్లారు. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే ఆమె ఫుడ్ స్టాల్ మూసేశారు. దీంతో అంద‌రూ సందీప్ కిషన్ ని ట్రోల్ చేశారు. అయితే, దానిపై ఇప్పుడు సందీప్ స్పించారు. 


చాలామంది తిట్టారు. కానీ, హెల్ప్ చేద్దాం అనుకున్న.. 


'ఊరు పేరు భైర‌వ‌కోన' సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు సందీప్ కిష‌న్. ఈ సంద‌ర్భంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కోజ్ అయ్యిందీ మీ వ‌ల్లే క‌దా? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. "ఆ ప్లేస్ చాలా ఫేమ‌స్ అవుతుంద‌ని విని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి వెళ్లాను. ఆమెకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుంద‌నే అనుకున్నాను. కానీ, ఆ త‌ర్వాత అంత ఫేమ‌స్ అవుతుంద‌ని అనుకోలేదు. ఇంత‌లోనే జ‌నాలు రావ‌డంతో మూసేశారు అని విన్నాను. దాని గురించి ఆన్ లైన్ లో చాలామంది న‌న్ను తిట్టారు కూడా. కానీ, ఫ‌స్ట్ రెస్పాండ్ అయ్యింది నేనే. నా ఫ్రెండ్స్ తో మాట్లాడించాను. నిజానికి ఆమె స్టాల్ పెట్టుకునేందుకు వేరే ప్లేసులు కూడా వెతికాము. చాలా ఇంపార్టెంట్ వాళ్ల‌తో మాట్లాడిచ్చాం. సీఎం గారే వ‌స్తాను అన‌డం చాలా పెద్ద రెస్పాన్స్. నేను వ‌చ్చిన కుటుంబంలో ఆడ‌వాళ్లు ప‌నిచేసి స్ట్రాంగ్ గా అయ్యారు. ఆమెది ఓవ‌ర్ నైట్ స‌క్సెస్ కాదు. గుడివాడ నుంచి వ‌చ్చి ఇక్క‌డ క‌ష్ట ప‌డుతుంటే.. నేను స‌పోర్ట్ చేద్దాం అనుకున్నాను. 14 ఏళ్ల క‌ష్టం ఆమెది. అందుకే, ఆమెకు స‌పోర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ, అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ వ‌చ్చింది" అని అన్నారు సందీప్ కిష‌న్. 


సందీప్ కిష‌న్ న‌టించిన 'ఊరు పేరు భైర‌వ‌కోన' సినిమా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఈ నెల 14న వ్యాలెంటైన్స్ సంద‌ర్భంగా ప్రీమియ‌ర్ షో లు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ముమ్మ‌రంగా చేస్తోంది సినిమా టీమ్. దాంట్లో భాగంగానే కుమారీ ఆంటీ ఫుడ్ ప్లేస్ కి వెళ్లి అక్క‌డ తిన్నారు సందీప్ కిష‌న్. 


Also Read: ‘మ‌సూద’ ప్రీక్వెల్ వస్తోంది - ప్రొడ్యూస‌ర్ రాహుల్ యాద‌వ్ న‌క్కా


ఇక ఈ సినిమాకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఊరు పేరు భైరవకోన’లో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లామా, కావ్య థాపర్ నటించారు. ఫిబ్రవరీ 9న విడుదల అవ్వాల్సింది. అప్ప‌టికే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీకి సోలో రిలీజ్ అందిస్తామని నిర్మాతలంతా ప్రకటించడంతో.. వారి నిర్ణయాన్ని గౌరవించి మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంది ‘ఊరు పేరు భైరవకోన’. ఫైనల్‌గా ఫిబ్రవరీ 16న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమాతో సందీప్ కమర్షియల్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.