Masooda Prequel - Rahul Yadav Nakka: ‘మసూద’ ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. హిట్ టాక్ సంపాదించుకుంది. క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌చ్చాయి ఈ సినిమాకి. ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ సినిమాకి ప్రీక్వెల్ తీయ‌నున్న‌ట్లు ప్రొడ్యూస‌ర్ రాహుల్ యాద‌వ్ న‌క్కా చెప్పారు. భూత‌ద్దం భాస్క‌ర్ నారాయ‌ణ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొత్త టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తే.. ఫ్రెష్ సినిమాలు వ‌స్తాయ‌ని అందుకే తాను కొత్త వాళ్ల‌ను తీసుకుంటాను అంటున్నారు ఆయ‌న‌. 


ఫ్రెష్ టాలెంట్ తోనే  స‌రికొత్త సినిమాలు.. 


‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస్ ఆత్రేయ‌’, ‘మసూద’ లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌ను ప్రొడ్యూస‌ర్ చేశారు ప్రొడ్యూస‌ర్ రాహుల్. డిఫ‌రెంట్ కాన్పెప్ట్స్ తో ఉన్న ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. సూప‌ర్ హిట్ గా నిలిచాయి. ‘భూత‌ద్దం భాస్క‌ర్ నారాయ‌ణ’ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ‘‘కొత్త టాలెంట్ వ‌స్తోంది. అదే నా బిగెస్ట్ స‌పోర్ట్. కొత్త ప్రొడ్యూస‌ర్లు, కొత్త డైరెక్ట‌ర్లు, కొత్త రైట‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు తాజా విష‌యాలు బ‌య‌టికి వ‌స్తాయి. రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. సినిమా ఇలానే తీయ్యాలి, అలానే తియ్యాలి అనే నోష‌న్స్ ఏమీ ఉండ‌వు. ఈ రూల్స్ పాటించాలి అనేవి ఉండ‌వు. భ‌యం తెలియ‌కుండా ధైర్యం వ‌స్తుంది. ఐదేళ్ల త‌ర్వాత నాకు భ‌యం వ‌స్తుందేమో? ఇలాంటి సినిమాలు అప్పుడు తియ్య‌లేనేమో!.  కొత్త వాళ్లు వ‌స్తే కంటెంట్ వ‌స్తుంది. అలా చూసిన‌ప్పుడు నాకు నిజంగా ఆనందం క‌లుగుతుంది. ఇక ఈ సినిమాకి డైరెక్ట‌ర్.. మైథాల‌జీని కూడా ఫిక్ష‌న‌లైజ్ చేశాడు. మైథాల‌జీనే ఫిక్ష‌న‌ల్..  అలాంటి దాంట్లో కూడా కొత్త‌గా రాశాడు’’ అని చెప్పారు. 


ఏజెంట్ -  2 ఎవ‌రితో?.. 


‘ఏజెంట్ - 2’ సినిమా తీస్తే ఎవ‌రితో క‌లిసి తీస్తారు? అని అడిగిన ప్ర‌శ్న‌కు రాహుల్ ఆయన ఇలా అన్నారు. ‘‘ఏజెంట్ - 2 మూవీ ఎవ‌రు చేయాలి అనేది సినిమా నిర్ణ‌యిస్తుంది. స్వ‌రూప్ దాని మీద వ‌ర్క్ చేస్తున్నారు. 6 నెల‌ల నుంచి స్క్రిప్ట్ వ‌ర్క్ అవుతుంది. స్వ‌రూప్ వేరే సినిమా చేయాలి. నేను వేరే సినిమా చేయాలి. ‘మసూద’ ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. కాబ‌ట్టి ‘ఏజెంట్ - 2’కు ఏడాదిన్న‌ర ప‌ట్టొచ్చు’’ అని క్లారిటీ ఇచ్చారు. 


హారర్ డ్రామాగా తెర‌కెక్కిన ‘మసూద’  సినిమా ల‌వ‌ర్స్ ని ఎంతగానో అల‌రించింది. జార్జి రెడ్డి సినిమాలో న‌టించిన‌ తిరువీర్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. సంగీత, శుభ‌లేఖ సుధాక‌ర్, సత్య ప్రకాష్  త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించారు.  ఇక ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ అనౌన్స్ చేయ‌డంతో అది ఇంకా ఎంత భ‌య‌పెడుతుందో అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో నెల‌కొంది. 


శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' . పురుషోత్తం రాజ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న‌కు ఇది మొద‌టి సినిమా. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రాశి సింగ్ హీరోయిన్ కాగా.. వర్షిణి , దేవి ప్రసాద్, శివ కుమార్ కీలక పాత్రలు చేశారు. యువ హీరో తేజా సజ్జా టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్ ఇప్ప‌టికే ఆడియెన్స్ ని ఆక‌ట్టుకుంటోంది. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ ని కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఆ ట్రైల‌ర్ కూడా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది.


Also Read: కొత్త ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్న సమంత - ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన