Nindu Noorella Saavasam Serial Today Episode: కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ గుడిలో పూజలు చేస్తుంటారు. ఇంతలో అమర్ వాటర్ తీసుకెళ్లి భాగీకి ఇస్తాడు. దీంతో భూమి మెల్లగా భాగీని చూస్తుంది. అమరేంద్ర గారు మా భాగీ అంటే బాగానే ప్రేమ ఉంది మీకు అంటుంది. అలాంటిదే లేదని పాస్టింగ్ ఉంది కదా..? అందుకే వాటర్ ఇచ్చానని చెప్తాడు. ఇంతలో గగన్ కూడా భూమిని ఎందుకు వాళ్లను ఇబ్బంది పెడతున్నావు అంటాడు. భాగీ కూడా మ భూమిని ఎలా భరిస్తున్నారు అని అడుగుతుంది. మాతో మమూలుగా ఆడుకోదని చెప్తాడు గగన్. తర్వాత అందరూ దీపాలు వెళిగిస్తారు. కళ్లు మైసుకుని మెక్కుతుంటే మనోహరి అక్కడకు వచ్చి తనతో తీసుకొచ్చిన పెట్రోల్ బాటిల్స్ పెడుతుంది. మరోవైపు దూరంగా కూర్చున్న శరత్ చంద్ర ఆత్మ భూమిని తలుచుకుంట ఏడుస్తుంది.
గుప్త: ఆ తల్లి కార్చు ప్రతి కన్నీటి బొట్టుకు కారణం నవ్వే బాలిక. ఆ బాలిక బాధను తీర్చబోయి.. ఈ తల్లికి తీరని బాధను మిగిల్చితివి.
ఆరు: తీర్చగలను గుప్త గారు ఆ తల్లి బాధను నేను తీర్చగలను.
గుప్త: బాలిక.. ఈ బాలిక మళ్లీ ఏం చేయునో ఏమో..
ఆరు: శోభాచంద్ర గారు. భూమి మీద ఉన్నందుకు.. పుణ్యం చేసుకున్నందుకు స్పర్శ శక్తని ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ శక్తిని ఇవాళ మనసా వాచా మీకు ఇద్దామనుకుంటున్నాను.
గుప్త: బాలిక నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..? అటుల చేసిన ఎడల నీవు నీ శక్తిని కోల్పోయెదవు.
ఆరు: పర్వాలేదు గుప్త గారు ఈవిడ తన కన్న కూతురుతో కొన్ని క్షణాలు కలిసి ఉంటుందంటే నా శక్తులు పోయినా పర్వాలేదు.
శోభ: ముఖ పరిచయం కూడా లేని నాకోసం ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు అమ్మా..
ఆరు: కూతురుగా తల్లి లేని బాధ తెలుసు. తల్లిగా పిల్లలకు దూరంగా ఉన్న బాధ తెలుసు.
గుప్త: బాలిక ఒక్కసారి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో..
ఆరు: పర్వాలేదు గుప్త గారు అయినా ఒక తల్లి బిడ్డను కలపలేని శక్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత. నా శక్తి ఆమెకు వచ్చేటట్టు చేయండి గుప్తగారు.
గుప్త: నీ త్యాగమును ఏ పేరున పిలవాలెనో తెలియడం లేదు బాలిక.
అంటూ ఆరు స్పర్శ శక్తిని శోభా చంద్రకు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు గుప్త. స్పర్శ శక్తి వచ్చిన శోభాచంద్ర సంతోషంగా వెళ్లి పువ్వులు పట్టుకుంటుంది. తర్వాత భూమి వాళ్ల దగ్గరకు వెళ్లి చాటు నుంచి చూసి వెళ్లిపోతుంటే..
భూమి: అమ్మా.. ( అని పిలుస్తుంది.) మీ కళ్లు అచ్చం మా అమ్మ కళ్లలాగే ఉన్నాయి.
ఆరు: ఏంటిది గుప్త గారు శోభ గారు భూమికి కనిపిస్తుందా..?
గుప్త: నువ్వు నీ సోదరికి కనిపించుచుంటివి కదా..? నీ శక్తి ఈ బాలికకు ఇచ్చావు కదా..? అందుకే కనిపిస్తుంది.
శోభ: నీ పేరేంటి తల్లి..
భూమి: భూమి.. అమ్మా నాకో సాయం చేస్తారా..? నాకు అమ్మ లేదమ్మా.. నాతో పాటు ఈ దీపాలు వెలిగిస్తారా..?
అని అడగ్గానే శోభ.. భూమి దగ్గరకు వెళ్లి తదేకంగా చూస్తుంటుంది. ఇంతలో భూమి ఏంటమ్మా అలా చూస్తున్నారు అని అడుగుతుంది. తెలిసిన అమ్మాయిలా ఉన్నావు అందుకే చూస్తున్నాను అని చెప్తుంది.
భూమి: అమ్మా మీ ముఖం నేను ఒకసారి చూడొచ్చా..?
శోభ: ఏమీ అనుకోకు తల్లి.. నాకు కాస్త గాయం అయింది. అందుకని..
భూమి: ఏమైనా మీ కళ్లు మాత్రం చాలా బాగున్నాయి. నిజంగా మా అమ్మ కళ్లలాగే ఉన్నాయి. మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా..?
శోభ: అడుగమ్మా…?
భూమి: అందరూ నా కళ్లు మా అమ్మ కళ్లలాగే ఉంటాయి అంటారు. నిజంగా నా కళ్లు మీ కళ్లలాగే ఉంటాయా..?
శోభ: మీ అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నీ కళ్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో..
అంటూ శోభ ఏడుస్తుంది. భూమి ఎమోషనల్ అవుతుంది. ఇద్దరూ కలిసి దీపం వెలిగిస్తారు. తర్వాత శోభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న గుప్త ఆశ్చర్యంగా నువ్వు చాలా మంచిదానివి అంటూ మెచ్చుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!