Brahmamudi Serial Today Episode:   భోజనానికి ధాన్యలక్ష్మీ ఎందుకు రాలేదని వంటమనిషిని అడుగుతారు. తనకు ఆకలిగా లేదని రానని నా ముఖం మీదే తలుపు వేసిందని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి సమయం తీసుకుని చెప్తామని చెప్పాం కదా..? అంటుంది. ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తను వదిలేలా లేదు అత్తయ్యా అంటుంది అపర్ణ. బాధపడని వదిన అంటాడు ప్రకాష్‌. ఈ ఇంట్లో రోజు రోజుకు మానవత్వం నశించిపోతుంది అంటుంది రుద్రాణి. దీంతో రుద్రాణిని స్వప్న, ప్రకాష్‌ తిడతారు. మరోవైపు ఆఫీసులో కావ్య తన ఎంప్లాయీస్‌ తో డిజైన్స్‌ వేయించి కలెక్ట్ చేస్తుంది రాజ్‌ వస్తాడు.


రాజ్‌: ఏంటి..? మా టింగు ఉండగా మీ టింగు పెట్టారేంటి..? ఉప్మాలో కరివేపాకు లాగా మీటింగ్ హాల్లో మీరెందుకు ఇక్కడ. వెంటనే ఈ చెత్తాచెదారం అంతా తీసేసి కడిగిపారేయండి.


కావ్య: మీరెందుకు లేచారు. కూర్చోండి.. ఇక్కడ మేమేమీ చింతపిక్కల ఆట ఆడుకోవడానికి రాలేదు. ప్రాజెక్టు గురించి డిష్కర్షన్‌ చేయడానికి వచ్చాము. మా టింగు ఇక్కడే జరుగుతుంది. మీ టింగు ఇంకెక్కడైనా పెట్టుకోండి.


రాజ్‌: ఏయ్‌ మర్యాదగా లేవండి. లేకపోతే కూర్చోవడానికి కుర్చీలు ఉండవు.


కావ్య: ఏంటి రౌడీయిజం చేస్తున్నారా..? మీరేం చేసినా మా టీం ఇక్కడి నుంచి కదలదు. కూర్చోండి అందరూ కూర్చోండి.


ఎంప్లాయి: మేడం మీ ఇద్దరు ఏ టీం ఉండాలో డిసైడ్‌ చేసుకునేదాకా  ఈ స్టాండప్‌ సిడౌన్‌ కాన్సెఫ్ట్ ను ఆపేయండి మేడం.


అని ఎంప్లాయీస్‌ చెప్పగానే రాజ్‌, కావ్య గొడవ పడతారు. కావ్య నేను కంపెనీ సీఈవోగా చెప్తున్నాను అంటుంది. దీంత ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోతుంది. ఇంతలో జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ వస్తాడు. నేను విన్నది నిజమే అన్నమాట. అంటూ మీరిద్దరూ విడిపోయారని మీ గొడవల వల్ల కంపెనీని పట్టించుకోవడం లేదని అందరూ అనుకుంటున్నారు అని చెప్పగానే రాజ్‌ గట్టిగా నవ్వుతాడు.


శృతి: మేడం సార్‌కు డీల్‌ పోతుందన్న భయంతో పిచ్చి పట్టింనట్టు ఉంది.


కావ్య: షటప్‌..


రాజ్‌: నన్నా…?


కావ్య: కాదండి.. కానీ మీరు ఎందుకు నవ్వుతున్నారో జగదీశ్‌ ప్రసాద్‌ గారికి చెప్పండి.


రాజ్‌: విడిపోయిన భార్యాభర్తలు కలిసి ఒకేచోట ఎందుకు పని చేస్తారు చెప్పండి. అందులోనూ ఒకే ప్రాజెక్టు కోసం ఎందుకు కష్టపడతారు చెప్పండి.


ప్రసాద్‌: అంటే నేను విన్నది అబద్దమా..? నేను వచ్చేటప్పటికీ మీరు గొడవ పడుతున్నది నిజం కాదా..?


రాజ్‌: నిజం కాదు సార్‌.. అంతా అబద్దం. మేము డిజైన్స్‌ కోసం గొడవ పడటం చూశారు మీరు.


   అంటూ రాజ్‌ చెప్పగానే జగదీశ్‌ ప్రసాద్‌ అవునా..? అంటాడు. ఇంతలో ప్రసాద్‌ను నమ్మించడానికి మేమిద్దరం పేపరు డిజైన్‌ లాగా కలిసిపోయామే తప్పా విడిపోలేదు. అంటూ కావ్య నడుం పట్టుకుని నువ్వు ఏదైనా చెప్పవే అంటాడు రాజ్‌. నడుము మీద చెయ్యి వేస్తే మాటలు ఎలా వస్తాయండి అంటుంది కావ్య. ఇంతలో ప్రసాద్‌ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు బాగా కష్టపడి బెస్ట్‌ డిజైన్స్‌ వేసి ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోతాడు.


కావ్య: మనిద్దరం ఎందుకు కలిసి ఉంటున్నామని అబద్దం చెప్పారు.


రాజ్‌: డీల్ పోతుందని అలా అబద్దం చెప్పాను.


కావ్య: మన అవసరం కోసం ఎదుటి వాళ్లను నమ్మించడం కోసం అబద్దం చెప్పడం తప్పు కాదా..?


రాజ్‌: తప్పు ఎలా అవుతుంది. తప్పే కాదు.


కావ్య: మరి ఆరోజు మిమ్మల్ని మార్చడానికి మా అమ్మ క్యాన్సర్‌ అని అబద్దం చెబితే ఎందుకు అంతలా తిట్టారు. ఆరోజు మా అమ్మ చేసింది తప్పైతే ఈరోజు మీరు చేసింది తప్పే.


రాజ్‌: అది ఒకటి కాదు.


కావ్య: ఎందుకు కాదు.. అది ఇది ఒక్కటే..


రాజ్‌: నేను క్లయింట్‌ ను నమ్మించడం కోసం అలా చేశాను.


కావ్య: మా అమ్మ మనిద్దరిని కలపడం కోసం అలా చేసింది.


అంటూ ఇద్దరి మధ్య గొడవ పెరిగిపెద్దగా అవుతుంది. ఇప్పటి వరకు నేను చూసీ చూడనట్టు వదిలేశాను. కానీ ఇక తగ్గేదేలే నా క్రియేటివిటీ చూపిస్తాను అంటూ రాజ్‌తో చాలెంజ్‌ చేసి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌, సీతారామయ్య దగ్గరకు వెళ్లి ఆఫీసులో జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. మరోవైపు హ్యాపీగా ఇంటికి వస్తాడు కళ్యాణ్‌.



కళ్యాణ్‌: పొట్టి నీకో గుడ్‌ న్యూస్‌  


అప్పు: ఏంటి తండ్రి కాబోతున్నావా..?


కళ్యాణ్‌: నీ ప్రమేయం లేకుండా నేను తండ్రి అవుతానా..?


అప్పు: ఏమో ఎవరికి తెలుసు..?  మీ పెద్దనాన్నగారిలాగా చిన్న ఇల్లు ఏమైనా ఉందేమోనని


కళ్యాణ్‌: మీ ఇంట్లో అందరూ ఇంతేనా..? అవకాశం దొరికితే చాలు దెప్పి పొడుస్తూనే ఉంటారు.  మా వదిన కూడా ఇంతే పొరపాటున నోరు జారి ఏదైనా అంటే సరి నెలల సరిపడా దెప్పిపొడుస్తూనే ఉంది.


అప్పు: ఏదో సరదాగా అన్నాలే.. ఇంతకీ ఏంటా గుడ్‌ న్యూస్‌.


అని అప్పు అడగ్గానే కళ్యాణ్‌ చెప్పనని అంటాడు. చిన్నింటికి వెళ్లి చెప్తాను అంటాడు. అప్పు చెప్పమని బతిమాలుతుంది. దీంతో తనకు రైటర్‌ లక్ష్మీకాంత్‌ దగ్గర అసిస్టెంట్‌ రైటర్‌ గా తీసుకున్నాడు అని చెప్తాడు. దీంతో నువ్వేమైనా అగ్రిమెంట్‌ చేశావా అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌ షాక్‌ అవుతాడు. దీంతో   ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!