Seethe Ramudi Katnam Serial Today Episode సీత ఇంటికి రావడంతో రామ్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు. రాత్రి అంతా ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. దాంతో సీత చీరలు అమ్ముకొని బిజీ అయ్యానని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్తుంది. ఇక మహాలక్ష్మీని చూసి సీత ఏమైంది అత్తయ్య అలా ఉన్నారని అడిగితే విద్యాదేవి పారిపోయిందని చలపతి చెప్తాడు. 


సీత: తన నిర్దోశిత్వాన్ని నిరూపించడానికి పారిపోయిందేమో.
చలపతి: నేను అదే అన్నాను సీత జనార్థన్ బావ కూడా అదే అన్నారు.
సీత: అయితే కొంత మంది అయినా నమ్మారేమో. టీచర్ పారిపోయిందంటే మహాలక్ష్మీ అత్తయ్యకు తిప్పలు తప్పవు ఇబ్బందులు తప్పవు. మీరేమో సుమతి అత్తమ్మని టీచర్ చంపిందని అన్నారు. అత్తమ్మని ఆమె నిజంగానే చంపారో లేక మీరు కట్టు కథ అల్లారో ఎవరికి తెలుసు.
మహాలక్ష్మీ: నాకు అంత అవసరం ఏంటి. 
రామ్: టీచరే మా అమ్మని చంపింది అనడానికి పిన్ని ఆధారాలు చూపించింది కదా.
జనార్థన్: ఆవిడ తప్పు చేయకపోతే పారిపోకుండా ఉండాల్సింది.
సీత: ఆవిడ నిజంగా తప్పు చేసుంటే పోలీసులకు దొరికిపోతుంది. అలా కాకుండా మహాలక్ష్మీ అత్తయ్య కావాలనే అలా ఆవిడ మీద నింద వేసుంటే ఆవిడ అత్తయ్యని ముప్పుతిప్పలు పెట్టొచ్చు కదా. నన్ను అనవసరంగా ఇరికిస్తావా అని ఏ కత్తో తీసుకొచ్చి నరికేస్తే. 
అర్చన: అసలే  మహా టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంకా భయపెడతావేంటి సీత.
సీత: అసలే టీచర్ క్రిమినల్ కదా ఏమైనా చేయొచ్చు. అత్తయ్య ఏ తప్పు చేయకపోతే ఇబ్బంది లేదు చేస్తే మాత్రం అంతే.
జనార్థన్: మహా ఏ తప్పు చేయదు.
మహాలక్ష్మీ: నేను ఏ తప్పు చేయలేదు నాకే ఇబ్బంది లేదు.


సుమతి తప్పించుకుందని శివకృష్ణ లలితతో చెప్తాడు. సుమతి ఎక్కడుందని లలిత టెన్షన్ పడుతుంది. ఏదో ఒకటి చేయమని భర్తని అడుగుతుంది. ఇక సీత తండ్రికి కాల్ చేసి టీచర్ గురించి టెన్షన్ పడుతున్నారా టీచర్ గురించి ఓ విషయం తెలిసిందని అంటుంది. ఏంటని శివకృష్ణ అడిగితే టీచరే సుమతి అని తెలిసిందని అంటుంది. సీత తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. మీకు ముందే నిజం తెలిసినా నాకు చెప్పలేదని సీత అడుగుతుంది. దాంతో సుమతి మాట తీసుకుందని లలిత చెప్తుంది. అత్తమ్మ ఏం తప్పు చేయలేదు అని నిరూపించే వరకు తానే సుమతి అని ఎవరికీ చెప్పొద్దని అంటుంది సీత. ఇక అత్తమ్మ నా దగ్గరే ఉందని తనకు ఏ ఆపద రానివ్వను అని సీత చెప్తుంది. ఇంతలో రామ్ సీత దగ్గరకు వస్తే సీత కంగారు పడుతుంది కానీ రామ్ ఏం వినడు. తన తల్లిని చంపిన టీచర్‌ని వదిలిపెట్టనని రామ్ అంటాడు. పోలీసులు కాదు నేనే ముందు చంపేస్తానని రామ్ అంటాడు. సీత రామ్ కోపాన్ని చూసి షాక్ అవుతుంది. తల్లిని రామ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని బాధ పడుతుంది. 



మరోవైపు మహాలక్ష్మీ సుమతి గురించి ఆలోచిస్తుంది. సుమతి ఏ క్షణంలో అయినా తన మీద అటాక్ చేయొచ్చని టెన్షన్ పడుతుంది. ఇంతలో అర్చన వచ్చి మహా మీద చేయి వేయడంతో సుమతి అనుకొని టెన్షన్ పడుతుంది. అర్చనను తిడుతుంది. సుమతి అక్కకి భయపడుతున్నావా అని అర్చన అడుగుతుంది. ఇంతలో రాకేశ్ వాళ్లు మహాలక్ష్మీకి ఫోన్ చేస్తారు. ప్రీతి పెళ్లి మా వాడితోనే కదా అని అడుగుతారు. ఇక అర్చన ఫోన్ తీసుకొని రాకేశే ప్రీతి భర్త అని మీరు ఫోన్ పెట్టేయండి అని చెప్తుంది. మరోవైపు సీత విద్యాదేవి దగ్గరకు వెళ్లి మహాలక్ష్మీకి బయటపెట్టానని చెప్తుంది. ఇక సీత విద్యాదేవిని ఎవరూ చూడకుండా ఇంట్లోకి తీసుకెళ్లి టిఫెన్ పెడుతుంది. విద్యాదేవికి వెక్కిళ్లు రావడంతో సీత మంచి నీరు తీసుకురావడానికి వెళ్తుంది. మరోవైపు మహాలక్ష్మీ అటుగా వస్తుంటుంది. విద్యాదేవిని చూసి మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read:  కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆదికేశవ్‌ పరిస్థితి తెలిసి కుప్ప కూలిపోయిన లక్ష్మీ.. ఆపరేషన్ చేయిస్తుందా!