Nindu Noorella Saavasam Serial Today Episode: ఊహల్లో తేలుతున్న భాగీ దగ్గరకు శివరాం, నిర్మల, రాథోడ్‌ వెళ్తారు. ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతారు. భాగీ వంకలు తిరుగుతూ హ్యాపీగా ఫీలవుతూ ఆయన నా గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అని చెప్తుంది. అవునా ఇంతకీ ఏమైందని నిర్మల అడుగుతుంది.

Continues below advertisement


రాథోడ్‌: మీరు ఉండండి సార్‌ భాగీని పిచ్చి పట్టింది మెంటల్‌ హాస్పిటల్‌కు ఫోన్‌ చేస్తున్నాను. వాళ్లు వచ్చి తీసుకెళ్తారు.


భాగీ: మామయ్య ఇలా అయితే నేన చెప్పను.


శివరాం: నువ్వు ఉండవయ్యా రాథోడ్‌.. అమ్మా నువ్వు అతని మాటలేం పట్టించుకోకు. రాథోడ్‌ వినాలంటే సైలెంట్‌గా ఉండు. నువ్వు చెప్పమ్మా..?


భాగీ: అది నా చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి.. నేను ఎక్కువ పని చేస్తున్నానని అది ఆయన మనసుకు కష్టంగా ఉందని.. పైగా పిల్లలకు ఎగ్జామ్స్‌ వస్తున్నాయి కదా అని కేర్‌టేకర్‌ను పెడదాం అన్నారు.


నిర్మల: నిజంగా వాడు ఆ మాట అన్నాడా..?  


శివరాం: మా వాడు కేర్‌ టేకర్‌ అన్నాడంటే ఇప్పటి నుంచి నీ మీద కేర్‌ తీసుకోవడం మొదలు పెట్టాడన్న మాట.


రాథోడ్‌: చూడండి సార్‌ మన కష్టం గురించి సార్‌ ఎప్పుడైనా ఆలోచించారా..? వాళ్లావిడకు కష్టం అనగానే కేర్‌ టేకర్‌ను పిలిపిస్తాడట..


శివరాం: ఉండవయ్యా చిన్నపిల్లాడిలా ఏంటిది…? బాగుందమ్మా మిస్సమ్మ.. నీ ఆలోచనలో మునిగిపోయిన మా వాడికి ఈ అమ్మా నాన్నా ఉన్నారని గుర్తు చేయమ్మా..?


భాగీ: ఏంటి మామయ్య మీ మాటలు.. చూడండి అత్తయ్యా మామయ్య మాటలు..


నిర్మల: ఆయన మాటలకేం కానీ మీ ప్రేమ ప్రయాణంలో పడి మమ్మల్ని పట్టించుకోవడం మర్చిపోయేరు.


భాగీ: అత్తయ్యా మీరు కూడానా..? పోండి ఇక నుంచి మీకు ఏమీ చెప్పను..


నిర్మల: ఏదో సరదాకు అన్నావమ్మా..? వాడు నువ్వు కలిసి ఉంటే మాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. అంతా ఆ శివయ్య దయ. సంతోషంగా ఉండండి.


రాథోడ్‌: ఆ కేర్‌టేకర్‌ వస్తున్న సంగతి మా బుజ్జి సైనికులకు చెప్పాలి.


అంటూ రాథోడ్‌ లోపలికి వెళ్తాడు. నిర్మల తాను శివరాం ముందు గుడికి వెళ్లి అభిషేకానికి టికెట్‌ తీసుకుంటామని నువ్వు అమర్‌ను పిల్లలను తీసుకుని త్వరగా గుడికి వచ్చేయ్‌ అని చెప్తుంది. సరే అంటుంది భాగీ. ఇంటర్వూ కు వెళ్తున్న అనామిక దగ్గరకు వాళ్ల అన్నయ్య వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇంటర్వూకు వెళ్తున్నాను అని చెప్తుంది. అయితే మధ్యలో గుడికి వెళ్లు నీకు అంతా మంచే జరుగుతుంది. అని చెప్తాడు. అనామిక సరే అంటుంది. మధ్యలో ఉన్న గుడికి వెళ్లుంది అనామిక అక్కడ ఒక చిన్న పిల్లాడిని కాపాడుతుంది. అది నిర్మల, శివరాం చూస్తారు. ఇంతలో అమర్‌, భాగీ గుడికి వస్తారు.


అమర్‌: అమ్మా అభిషేకానికి వెళ్దామా..?


నిర్మల: ఆ ఒక్క నిమిషం నాన్నా ( అంటూ అటూ ఇటూ చూస్తుంది.)


భాగీ: ఎవరి కోసం వెతుకుతున్నారు అత్తయ్యా..?


అంజు: అనామికనా..? ఆవిడ ఎవరు నిమ్ము డార్లింగ్‌..


అమర్‌: అవును ఎవరమ్మా తను..


నిర్మల: ఇంతకు ముందే ఇక్కడ పరిచయం అయింది నాన్నా..


శివరాం: అసలు ఏం జరిగిందంటే.. ( అంటూ అనామిక బాబును కాపాడిన విషయం చెప్తాడు.) ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతుకుదాం పదండి. ఆ అమ్మాయి గ్రీన్‌ టాప్‌, స్పెట్స్‌ పెట్టుకుంది.


భాగీ: సరే మేము చూస్తాం.. రండి..


అని అందరూ తలో దిక్కు అనామికను వెతుక్కుంటూ వెళతారు. భాగీ, అమర్‌లకు ఎదురుగా అనామిక వస్తుంది. అనామికను చూసిన అమర్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!