Brahmamudi Serial Today Episode: నంద వెనక అనామిక, సామంత్‌ ఉన్నారని అప్పు చెప్పగానే రాజ్‌ కోపంగా సామంత్‌ ఇంటికి వెళ్తాడు. కావ్య చూస్తుంటే.. ఇంకా చూస్తున్నావేంటి వెనక నువ్వు వెళ్లు అంటుంది అపర్ణ. కావ్య, రాజ్‌ సామంత్‌ ఇంటికి వెళ్తారు.  సామంత్‌ బిజినెస్‌ డీల్‌ కోసం రెడీ అవుతుంటే నంద దొరికిపోయిన విషయం ఎవరో ఫోన్‌ చేసి చెప్తారు. దీంతో సామంత్‌ అనామిక మీద కోప్పడతాడు.


సామంత్‌: ఆ నంద గాడు దొరికిపోయాడంట. వాడు దొరికిపోతే మనం కూడా దొరికిపోతాము. నీకు అర్థం అవుతుందా..?


అనామిక: నెవర్‌ అలా జరగడానికి వీలులేదు. సంథింగ్‌ ఈజ్‌ రాంగ్‌..


సామంత్‌: నువ్వు చేసింది మొత్తం రాంగే.. పోలీసోడికి డబ్బు ఇచ్చి వాడుకోవాలని చూశావు. వాడు మనతో పాటు నంద గాడిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు కోసం నంద దగ్గరకు వెళ్తుంటే.. ఆ అప్పు పట్టుకుందట.. వాడు మన గురించి కూడా చెప్పి ఉంటాడు నీకు రాజ్‌ సంగతి తెలియదు


అనామిక: నువ్వు ఫస్ట్‌ అదంతా పక్కన పెట్టు ఈ డీల్‌ చేద్దాం పద


సామంత్‌ను కిందకు తీసుకొస్తుంది. బిజినెస్‌ పార్ట్‌నర్స్ తో డీల్‌ మాట్లాడుతుంటే కావ్య, రాజ్‌ వస్తారు. రాజ్‌ కోపంగా సామంత్‌ మీదకు వచ్చి గల్లా పట్టుకుని కొడతాడు.


రాజ్‌: రేయ్‌ సామంత్‌ ఎందుకు చేశావురా ఈ పని


సామంత్:  రాజ్‌ మనం కూర్చుని  మాట్లాడుకుందాం..?


రాజ్‌: ఏంటి వీళ్ల ముందు నీ పరువు పోతుందని ఆలోచిస్తున్నావా..? నువ్వు చేసిన పనికి గంట ముందు ఇలానే మా ఇంట్లో బ్యాంకు ఆఫీసర్లు వచ్చి  నా ఇంటిని జప్తు చేయబోయారు. మరి అప్పుడు నా పరువు పోలేదా..? చెప్పు ఎందుకు చేశావు ఇలా ..? నా వల్ల నీకు జరిగే నష్టం ఏంటి చెప్పరా..?


అనామిక: రాజ్‌ వదులు.. వదిలేయ్‌ సామంత్‌ను


రాజ్‌: ఏరా మనిద్దరం వ్యాపారంలో పోటీ పడి ఉండొచ్చు. కానీ నేను ఏ రోజు నిన్ను తొక్కాలని చూడలేదు. నీ కంపెనీ కొనమని నాకు ఎన్నోసార్లు ఓపెన్‌ ఆఫర్‌ వచ్చింది. అయినా నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పిచుకోలేడు.


కావ్య: ఏవండి వద్దండి పదండి


అనామిక: మర్యాదగా మీ ఆయనను ఇక్కడి నుంచి తీసుకెళ్లు


 కావ్య కోపంగా అనామికను కొడుతుంది.


కావ్య:  నీకు వాగడం మాత్రమే తెలుసు నాకు కొట్టి చెప్పడం కూడా తెలుసు


అంటూ వార్నింగ్‌ ఇచ్చి రాజ్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. అప్పును ఎత్తుకుని హ్యాపీగా ఫీలవుతుంటాడు కళ్యాణ్‌. నువ్వు చేసిన పనికి ఏదైనా ఇవ్వాలని అడుగు అంటాడు. దీంతో అప్పు ఇన్‌డైరెక్టుగా కిస్‌ ఇవ్వమని అడుగుతుంది. కళ్యాణ్‌, అప్పుకు కిస్‌ ఇస్తుంటే కరెంట్‌ బిల్‌ సార్‌ అంటూ ఒకతను వస్తాడు. ఇద్దరూ కంగారుపడతారు. అతన్ని తిట్టి అక్కడి నుంచి పంపిస్తారు. దుగ్గిరాల ఇంట్లో అందరూ మీటింగ్‌ పెట్టుకుంటారు.


అపర్ణ: ఇన్నాళ్లు నా కొడుకు కోడలు అప్పు సంగతి దాచిపెట్టలేక, బయటకు చెప్పలేక చాలా అవస్థ పడ్డారు. ఖర్చులన్నీ ఆపేసి అందరి దృష్టిలో చెడ్డవారు అయ్యారు. ఎంతో కష్టాన్ని బాధని దిగమింగి కష్టపడి అప్పును తీర్చడానికి చాలా పెద్ద బాధ్యత మోసారు. చిన్నవాళ్లు అయినా ఇంటిగుట్టును బయటకు రానీయకుండా మన వంశ గౌరవం కాపాడారు. ఇప్పటికైనా అందరి అపార్థాలు తొలగిపోయాయి అనుకుంటున్నాను. ఇక ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా


సీతారామయ్య: లేదమ్మా అసలు సమస్య అలాగే ఉండిపోయింది.


ఇందిర: ఇంకేం సమస్య ఉంది బావ


సీతారామయ్య: ఆస్థి.. కొందరిలో స్వార్థం మొదలైంది. మనం అనే మాట నుంచి నేను నా బిడ్డ, భర్త అనే వరకు వెళ్లింది. ఆస్థి మొత్తం ముక్కలు చేసి ఎవరి వాటా వారికి పంచాలనుకుంటున్నాను.


అని సీతారామయ్య చెప్పగానే.. ప్రకాష్‌ బాధపడుతూ కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాడు. ఆస్థిని పంచవద్దని రిక్వెస్ట్‌ చేస్తాడు. అపర్ణ, సుభాష్‌ కూడా పంచవద్దని చెప్తారు. అయితే అప్పును కోడలిగా ఈ ఇంటికి తీసుకురావాలని కండీషన్‌ పెడతాడు సీతారామయ్య. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!